ప్లేయర్లలాంటి ఫిట్ నెస్ కావాలంటే

మీరు ప్లేయర్లలా ఫిట్‌‌గా ఉందాం అనుకుంటున్నారా?అయితే ఈ వ్యాయామాలు చేయడం తప్పనిసరి  చిన్నపిల్లాడిలా ఉన్నప్పుడు కానీ, టీనేజ్ లో గానీ యూత్‌‌గా ఉన్నప్పుడు గానీ మీకు అథ్లెట్ లాంటి శరీరం కావాలని అనుకునే ఉంటారు కదా? నిజం చెప్పాలంటే మన అందరికీ అలాంటి కోరిక ఉంటుంది. కలలు కంటూనే ఉంటాం. NBA ఆట విషయానికి వస్తే అందులోని ప్లేయర్లు అపారమైన ప్రతిభావంతులే కాదు.. దాదాపుగా ఎవరికీ లేని ఫిట్‌నెస్ స్థాయిని కలిగి ఉంటారు. కోర్టులో వేగం, చురుకుదనం, […]

Share:

మీరు ప్లేయర్లలా ఫిట్‌‌గా ఉందాం అనుకుంటున్నారా?
అయితే ఈ వ్యాయామాలు చేయడం తప్పనిసరి 

చిన్నపిల్లాడిలా ఉన్నప్పుడు కానీ, టీనేజ్ లో గానీ యూత్‌‌గా ఉన్నప్పుడు గానీ మీకు అథ్లెట్ లాంటి శరీరం కావాలని అనుకునే ఉంటారు కదా? నిజం చెప్పాలంటే మన అందరికీ అలాంటి కోరిక ఉంటుంది. కలలు కంటూనే ఉంటాం.

NBA ఆట విషయానికి వస్తే అందులోని ప్లేయర్లు అపారమైన ప్రతిభావంతులే కాదు.. దాదాపుగా ఎవరికీ లేని ఫిట్‌నెస్ స్థాయిని కలిగి ఉంటారు. కోర్టులో వేగం, చురుకుదనం, ఓర్పు వంటి లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్లలా ఉండాలంటే ఎన్నో సంవత్సరాల నిబద్ధత, కృషి, సాధన అవసరం. మనం అందరం వాళ్లు ఇప్పుడున్న రూపాన్ని మాత్రమే చూస్తాం గానీ.. దాని కోసం వారు చేసిన కష్టాన్ని, కృషిని మనం పట్టించుకోం. 

కాబట్టి NBA ప్లేయర్‌లు ఎంత ఫిట్‌గా ఉన్నారో చూసిన తర్వాత సాధారణంగా ఆటగాళ్లుగా, బాస్కెట్‌బాల్ అభిమానులుగా మనం ఖచ్చితంగా ఈ ప్రశ్న వేసుకునే ఉంటాము. మనం వారిలా ఫిట్‌గా ఉండగలమా? అవును అది సాధ్యమే

.NBA ఆటగాళ్లు ఏమీ పైనుండి రాలేదు. వాళ్లేమీ పుట్టుకతో ఆ ఆకృతిలో ఉండరు. వాస్తవానికి వారు వ్యాయామాలను నిరంతరం సాధనం చేయడం ద్వారా ప్రస్తుత షేప్‌‌లో కనిపిస్తున్నారు. వర్కౌట్ నియమాలు, జిమ్ సెషన్‌లు మరియు పద్ధతులు ప్లేయర్ ప్లేయర్‌కీ మారుతూ ఉంటాయి. మీరు ఆ స్థాయి ఫిట్‌నెస్‌ను కొనసాగించాలనుకుంటే మీ దినచర్యలో చేర్చగలిగే కొన్ని సాధారణ వ్యాయామాలు ఇక్కడ మీకోసం. 

1. స్ప్లిట్ స్టాన్స్ స్ప్రింటర్లు

ఒకరు అక్షరాలా స్ప్లిట్ స్టాన్స్‌లో నిలబడి, ఆపై కొంత దూరం పరుగెత్తాలి. శరీరాన్ని అప్రమత్తంగా ఉంచడం, తద్వారా సర్దుబాటు సులభంగా చేయవచ్చు. ఇది స్ప్రింటింగ్ వేగాన్ని, అలాగే ఎక్కువ ఎత్తుకు దూకే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏ అథ్లెట్‌కైనా కోర్ బలం కీలకం మరియు మీ వేగం ఎల్లప్పుడూ ప్రధాన అంశంగా ఉంటుంది.

2. జంప్ రోప్

పేరుకి తగ్గట్టే తాడుపై నుండి దూకి కదులుతూ ఉండాలి. మోకాళ్లలో రక్తం ప్రవహించేందుకు ఇది సరైన వ్యాయామం. ఇది జిమ్‌లో ఎక్కడైనా చేయవచ్చు. దీనివల్ల  ఫుట్‌వర్క్ మెరుగవుతుంది. మోకాలి కండరాలు కూడా మెరుగుపడతాయి. అయితే తాడును దూకేటప్పుడు సిమెంట్ లాంటి గట్టిన ఉపరితలంపై కాకుండా మట్టి నేలపై చేయడం మరిచిపోవద్దు. లేకుంటే కాలక్రమేణా మోకాళ్ల నొప్పులు, హాని కలిగే అవకాశాలు చాలా ఎక్కువ.

3. వెయిట్ లిఫ్టింగ్

వారంలో కనీసం మూడు రోజులు జిమ్‌కి వెళ్లడం తప్పనిసరి. ఒకేసారి పెద్దపెద్ద బరువులు ఎత్తకుండా, తక్కువతో మొదలు పెట్టి పెంచుకుంటూ పోవాలి. ఇది శరీర బలాన్ని, ముఖ్యంగా చేతుల్లో బలాన్ని పెంచుతుంది.

4. పవర్ లంజ్ రోప్ స్లామ్‌లు

నేల ఉపరితలంపై నిరంతరం తాడును కదుపుతూ.. కొంత సమయం పాటు ఒక లయబద్దంగా చేయాలి. దీనిని చాలా వేగంతో చేయాలి. దీని కోసం శారీరకంగాను, మానసికంగాను ఓర్పు అవసరం. 

5. స్ట్రెచింగ్ వ్యాయామాలు

స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం ద్వారా శరీరం స్ట్రెచ్ అయ్యే గుణాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇది కండరాలను నిర్మించడానికి, పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.