ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ: అనిల్ కుంబ్లే

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో అనిల్ కుంబ్లే సంతోషం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ, అనుకున్న స్థాయికి లేదని భావించిన లెజెండరీ సునీల్ గవాస్కర్‌తో సహా రోహిత్ శర్మ అభిమానుల నుంచి అదే విధంగా మాజీ క్రికెటర్ల నుండి చాలా విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. అనిల్ కుంబ్లే ప్రశంసలు:  డొమినికాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ […]

Share:

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో అనిల్ కుంబ్లే సంతోషం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ, అనుకున్న స్థాయికి లేదని భావించిన లెజెండరీ సునీల్ గవాస్కర్‌తో సహా రోహిత్ శర్మ అభిమానుల నుంచి అదే విధంగా మాజీ క్రికెటర్ల నుండి చాలా విమర్శలు ఎదుర్కోవడం జరిగింది.

అనిల్ కుంబ్లే ప్రశంసలు: 

డొమినికాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించి ఎట్టకేలకు రోహిత్ శర్మ తన మీద వస్తున్న విమర్శలకు ముగింపు పలికాడు. గత కొంతకాలంగా భారీ స్కోరు చేసేందుకు ఇబ్బంది పడుతున్న భారత కెప్టెన్‌ ఇప్పుడు సెంచరీ చూసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. రోహిత్ సెంచరీకి స్పందిస్తూ, భారత గ్రేట్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు, ప్రపంచ కప్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా రోహిత్ సరిగ్గా లేని ఫామ్‌ ఇప్పుడు మళ్లీ గాడిలో పడినందుకు అనిల్ మెచ్చుకున్నాడు. 

అంతేకాకుండా తను ఎప్పుడు ఫామ్ లోనే ఉంటాడు అని, ఈ మధ్యకాలంలో ఆడిన కొన్ని మ్యాచెస్ లో మాత్రమే కాస్త అటు ఇటు అయినప్పటికీ, ఇప్పుడు రోహిత్ శర్మ తన సత్తా మళ్ళీ చాటుతున్నాడు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనిల్ కుంబ్లే. 

మొదట్లో వినిపించిన విమర్శలు: 

ప్రజలు అతని కెప్టెన్సీపై విమర్శలు కురిపిస్తున్న వేళ, స్పిన్ గ్రేట్ హర్భజన్ సింగ్కు వ్యక్తిగతంగా తెలిసిన రోహిత్ శర్మ గురించి మాట్లాడడం జరిగింది. ఇటీవల, ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో అతని నాయకత్వం సరైన స్థాయిలో లేదని భావించిన లెజెండరీ సునీల్ గవాస్కర్‌తో సహా భారత కెప్టెన్ అభిమానులు మరియు మాజీ క్రికెటర్ల నుండి చాలా విమర్శలు అయితే వినిపించాయి. అయితే రోహిత్ శర్మ కాప్టెన్సీ పైన వినిపిస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, ప్రతి మనిషికి మనిషి గౌరవించుకోవడం రోహిత్ శర్మ ఎంతగానో పాటిస్తాడని అదే ఇతరుల ద్వారా కోరుకుంటాడని మరోసారి గుర్తు చేశాడు. 

‘డబ్ల్యూటీసి ఫైనల్ లో టీం ఇండియా సరిగా ఆడకపోవడం నిజమే దాన్ని అందరూ ఒప్పుకుంటారు కానీ, కేవలం కెప్టెన్ గురించి తక్కువ చేసి మాట్లాడటం అనేది ఒప్పు కాదు. కెప్టెన్ రన్స్ చేయట్లేదు అంటూ, క్యాప్టెన్ సరిగా వ్యవహరించట్లేదు అంటూ ఎత్తి చూపించడం సరైన పద్ధతి కాదు’ అని హర్భజన్ సింగ్ తన మనసులో మాటను బయటపెట్టారు. రోహిత్ నాయకత్వ సామర్థ్యంపై విశ్వాసం చూపించాల్సిన అవసరం ఉంది అని హర్భజన్ మరోసారి గుర్తు చేశారు. రోహిత్‌కి కూడా మునుపటి ఉన్న కెప్టెన్స్లాగే బీసీసీఐ నుంచి మద్దతు లభిస్తుందని హర్భజన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘బీసీసీఐ సపోర్ట్‌ ఉంటే స్వేచ్ఛగా పని చేయవచ్చు.. కేవలం ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లి మాత్రమే కాదు.. కాస్త వెనక్కి వెళితే అప్పటి బీసీసీఐ అధ్యక్షుల నుంచి చాలా మంది కెప్టెన్లు సపోర్ట్‌ను పొందారు. రోహిత్‌కు బీసీసీఐ నుంచి తప్పక మద్దతు లభిస్తోంది. అతనికి ఆ రకమైన మద్దతు ఉంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో అతనికి సహాయపడుతుంది’ అంటూ రోహిత్ కు తన వంతు సపోర్ట్ ఇచ్చారు హర్భజన్ సింగ్. డొమినికాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించి ఎట్టకేలకు రోహిత్ శర్మ తన మీద వస్తున్న విమర్శలకు ముగింపు పలికాడు.