ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ రెండో టెస్టు

రెండో టెస్టుకు ఎలాంటి మార్పులు లేకుండానే ఇంగ్లండ్ జట్టు బరిలోకి దిగుతోంది. అయితే రెండో టెస్టు పిచ్ పేసర్లకు స్వర్గధామంగా ఉంటుందని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇంగ్లండ్ 1929 తర్వాత తొలిసారిగా టెస్ట్ క్రికెట్‌లో వరుసగా 7వ విజయంపై కన్నేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ మరియు ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ తమ చివరి 11 టెస్టుల్లో 10 విజయాలు సాధించింది. రెడ్ బాల్ క్రికెట్‌లో కనికరంలేని మరియు దూకుడుగా ఆడే […]

Share:

రెండో టెస్టుకు ఎలాంటి మార్పులు లేకుండానే ఇంగ్లండ్ జట్టు బరిలోకి దిగుతోంది. అయితే రెండో టెస్టు పిచ్ పేసర్లకు స్వర్గధామంగా ఉంటుందని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

ఇంగ్లండ్ 1929 తర్వాత తొలిసారిగా టెస్ట్ క్రికెట్‌లో వరుసగా 7వ విజయంపై కన్నేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ మరియు ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ తమ చివరి 11 టెస్టుల్లో 10 విజయాలు సాధించింది. రెడ్ బాల్ క్రికెట్‌లో కనికరంలేని మరియు దూకుడుగా ఆడే శైలిని ప్రదర్శించింది. 

మొదటి టెస్ట్‌లో న్యూజిలాండ్‌లోని పరిస్థితులు స్వింగ్ బౌలింగ్‌కు సహకరించినప్పటికీ ఇంగ్లండ్ ఒక్క అడుగు కూడా వెనక్కి తీసుకోలేదు. వారు బ్లాక్‌క్యాప్స్ బౌలర్లపై దాడి చేసి మొదటి రోజు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి డిక్లేర్ చేశారు. బెన్ డకెట్, జో రూట్ మరియు బెన్ ఫోక్స్ దూకుడుగా ఆడగా, హ్యారీ బ్రూక్ మరోసారి రెండు ఇన్నింగ్స్‌ల అర్ధసెంచరీలు చేసి జట్టును ముందుకు నడిపించాడు. మొదటి టెస్టులో జేమ్స్ ఆండర్సన్, ఆలీ రాబిన్సన్ మరియు స్టువర్ట్ బ్రాడ్ కలిసి 17 వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ బాల్‌తో కూడా రాణించింది. 

“వాళ్ళను స్వదేశంలో ఓడించడం చాలా కష్టం. అయితే మీకు తెలుసా.. 2-0తో సిరీస్ విజయం సాధించి ఇక్కడ మా దేశానికి వెళ్లడం చాలా బాగుంటుంది. మీరు రెండో టెస్టులో కూడా చూడబోయేది గత 10 నుండి 11 నెలలుగా మేం ఆడుతున్న అదే క్రికెట్‌ను. ఇకపై కూడా అలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నామని నేను భావిస్తున్నాను అని స్టోక్స్ ఈ సందర్భంగా చెప్పాడు. 

బేసిన్ రిజర్వ్‌లో సీమర్స్ ప్యారడైజ్?

అంతేకాకుండా 2వ టెస్టు కోసం ఇంగ్లండ్ ఎటువంటి మార్పులేని జట్టుతో రంగంలోకి దిగుతుందని స్టోక్స్ అన్నాడు. తొలి టెస్టు తర్వాత ఫాస్ట్ బౌలర్లు ఎలా నిలదొక్కుకున్నారో టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలించిందని, 2వ టెస్టుకు ముందు ముగ్గురు పేసర్లు బాగా కోలుకున్నారని ఇంగ్లండ్ కెప్టెన్ చెప్పాడు.

ఆండర్సన్, బ్రాడ్ మరియు రాబిన్సన్ మొదటి టెస్ట్‌లో ఎక్కువ భాగం బౌలింగ్ చేసారు. 2వ టెస్ట్‌లో అవసరమైతే ఆలీ స్టోన్ మరియు మ్యాటీ పాట్‌లను సిద్ధంగా ఉంచామన్నారు.

“బౌలర్లు ఎలా మ్యాచ్‌ను వాళ్ల నుంచి మావైపు తీసుకొచ్చారో మీరు చూడచ్చు. ముఖ్యంగా నిన్న వికెట్‌ను చూసిన తర్వాత జట్టులో మార్పులు ఏమీ చేయలేదు అన్నారాయన.

రెండో టెస్టుకు ముందు బేసిన్ రిజర్వ్‌లోని పిచ్‌లో చాలా పచ్చిక ఉంది, అయితే ఇది సీమర్‌లకు స్వర్గధామమవుతుందో లేదో చెప్పడం కష్టమని స్టోక్స్ చెప్పాడు.

అంటే. ​​అక్కడ చాలా గడ్డి ఉంది, మీరు దాని గురించి ప్రత్యేకంగా ఇక్కడ చూడగలరని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఇది సీమర్‌లకు చాలా ఉపయోగపడచ్చు. అలాగే కొన్నిసార్లు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని చెప్పాడు.

ఇంగ్లాండ్‌తో వెల్లింగ్టన్ టెస్టు మ్యాచ్ తొలి రోజు బెన్‌‌ను డకెట్  చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ తన పేరును చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున 700 అంతర్జాతీయ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా టిమ్ సౌథీ నిలిచాడు. అతని కంటే ముందు న్యూజిలాండ్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన రికార్డు డేనియల్ వెటోరీ పేరిట ఉంది. న్యూజిలాండ్ తరఫున వెటోరి మొత్తం 696 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్ లో 700 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 15వ బౌలర్‌గా సౌథీ నిలిచాడు.