పోలింగ్ ఐకాన్ గా సచిన్

EC (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్న EC తమ ప్రచార కర్తగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను నియమించుకుంది. సచిన్ 2024 ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు చాలా ఉపయోగపడతాడని EC ఆశాభావం వ్యక్తం చేసింది.  సంతకాలు పూర్తి ఈ మేరకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరియు ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ […]

Share:

EC (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్న EC తమ ప్రచార కర్తగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను నియమించుకుంది. సచిన్ 2024 ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు చాలా ఉపయోగపడతాడని EC ఆశాభావం వ్యక్తం చేసింది. 

సంతకాలు పూర్తి

ఈ మేరకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరియు ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ల సమక్షంలో సంతకాలు చేశాడు. ఈ ఒప్పందం మీద సంతకం చేయడంతో మాస్టర్ బ్లాస్టర్ ECకి ప్రచారకర్తగా అఫీషియల్ గా నియమించబడ్డాడు. 2024 ఎన్నికల కోసం పోలింగ్ పర్సంటేజ్ పెంచడం మీద అతడు దృష్టి పెట్టనున్నాడు. అతడు ఇందులో తప్పకుండా సక్సెస్ అవుతాడని ఈసీ ఆశాభావం వ్యక్తం చేసింది. భారత రత్న పొందడమే కాదు సచిన్ టెండూల్కర్ రాజ్య సభ సభ్యుడు కూడా. క్రీడాకారుల కోటాలో అతడు రాజ్యసభకు నామినేట్ చేయబడ్డాడు. కానీ ప్రస్తుతం అతడు ఎంపీగా లేడు. 2018 వరకు అతడు రాజ్యసభ ఎంపీగా సేవలందించాడు. 

అందుకోసమే సచిన్

సచిన్ టెండూల్కర్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా సచిన్ ఇంచు మించు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇలా సచిన్ ఇమేజ్ తమకు పనికి వస్తుందని ఈసీ భావించింది. అందుకోసమే రాబోవు సార్వత్రిక ఎన్నికల కోసం పని చేయమని సచిన్ ను రిక్వెస్ట్ చేసింది. దీనికి సచిన్ కూడా అంగీకరించడంతో EC తన అంబాసిడర్ గా నియమించుకుంది. వచ్చే ఎన్నికల్ల పోలింగ్ పర్సంటేజ్ పెంచడం, యువతకు ఓటు యొక్క ఆవశ్యకతను వివరించడం, ప్రతి ఓటు ఎంత విలువైందో సచిన్ ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు. జనాలకు అవగాహన కల్పించడంలో సచిన్ చాలా ఎఫెక్టివ్ రోల్ ను పోషిస్తాడని EC నమ్ముతోంది. ఒక ఆటగాడిగా క్రీడా మైదానంలో సచిన్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అంతే కాక అతడు ఎన్నో రివార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక 2012-2018 మధ్య రాజ్యసభ ఎంపీగా వర్క్ చేసిన సచిన్ అక్కడ మాత్రం అంతగా అందర్నీ ఆకట్టుకోలేకపోయాడు. తన పదవీకాలంలో మొత్తం 8 శాతం రోజులు మాత్రమే అతడు సభకు హాజరయ్యాడు. దీంతో చాలా మంది అతడి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రౌండ్ లో ఎన్నో రికార్డులను తన పేర రాసుకున్న ఈ పరుగుల రారాజును రాజ్యసభలో మాత్రం తీవ్రంగా నిరాశపర్చాడు. తన పదవీకాలంలో కేవలం 22 ప్రశ్నలు మాత్రమే అడిగాడు. కానీ తన హయాంలో ఎంపీ ల్యాడ్స్ నిధులను మాత్రం సచిన్ బాగానే ఖర్చు చేశాడు. అతడు చాలా ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించాడు. జమ్ము మరియు తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరదలు వచ్చినపుడు అతడు సహాయం చేశాడు. అంతే కాకుండా సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాడు. 

ఇదేం కొత్త కాదు.. 

వివిధ రంగాలలో పేరు గాంచిన వారిని EC తన అవసరాల కోసం ఉపయోగించుకోవడం ఎప్పటి నుంచో వస్తుంది. ఇది కేవలం సచిన్ విషయం లో మాత్రమే జరగలేదు. ఇప్పటికే అనేక మంది సెలబ్రెటీలు EC అంబాసిడర్లుగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా కొంత మంది వ్యవహరిస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కెప్టెన్ కూల్ ఎం. ఎస్ ధోనీ, బాలీవుడ్ ప్రముఖ హీరో అమీర్ ఖాన్, ఒలంపిక్ పతక విజేత మేరీ కోమ్ సేవలను EC వినియోగించుకుంది.