కొన్నిసార్లు స‌రిగ్గా ఆడ‌టంలేదు: గంగూలీ

భారత క్రికెట్ జట్టు చివరగా 2013లో ఐసిసి ఈవెంట్ గెలిచింది. 2011లో ప్రపంచ కప్ గెలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో 2011,13 లో భారత్ ఐసీసీ టైటిల్స్ సాధించింది. ఇండియా ఇప్పుడు టైటిల్స్ గెలవకపోవడానికి కారణాలు చెప్పిన గంగూలీ.  పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ టీం గురించి చెప్పిన గంగూలీ: మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇండియాకు చాలా మంచి విజయాలు అందించాడు.  శనివారం గంగూలీ 51వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇండియా ఎందుకు టైటిల్స్ గెలవలేక […]

Share:

భారత క్రికెట్ జట్టు చివరగా 2013లో ఐసిసి ఈవెంట్ గెలిచింది. 2011లో ప్రపంచ కప్ గెలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో 2011,13 లో భారత్ ఐసీసీ టైటిల్స్ సాధించింది. ఇండియా ఇప్పుడు టైటిల్స్ గెలవకపోవడానికి కారణాలు చెప్పిన గంగూలీ. 

పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ టీం గురించి చెప్పిన గంగూలీ:

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇండియాకు చాలా మంచి విజయాలు అందించాడు. 

శనివారం గంగూలీ 51వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇండియా ఎందుకు టైటిల్స్ గెలవలేక పోతుందో గంగూలీ  తెలియజేశాడు. సరైన టైంలో భారత జట్టు అనుకున్న ప్లాన్స్ ఎగ్జిక్యూట్ 

చేయలేక పోతుంది అందుకే ఓడిపోతుందని గంగూలీ తెలియజేశాడు. భారత జట్టులో మంచి ఆత్మస్థైర్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని. భవిష్యత్తులో ఇండియా టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన బర్త్డే రోజు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తానని గంగూలీ తెలియజేశాడు. బర్త్డే అంటే మామూలు రోజే అని ఆరోజు కుటుంబంతో స్పెండ్ చేశానని తెలియజేశాడు. గంగూలీ ఈసారి భారత్ ప్రపంచ కప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

గంగూలీ గురించి కొన్ని విషయాలు:

గంగూలీ ఇండియా క్రికెట్ కి చాలా సేవలు చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత భారత జట్టు గతి తప్పింది. ఆ టైంలో కెప్టెన్ గా గంగూలీ నియమించబడ్డాడు. గంగూలీ  కెప్టెన్సీలో

భారత జట్టు రాటు తేలింది. చాలా విజయాలు సాధించింది. 2002లో చాంపియన్స్ ట్రోఫీ సంయుక్త విజేతగా నిలిచింది. తర్వాత జరిగిన 2003 వరల్డ్ కప్ ఫైనల్ వరకు వచ్చింది. గంగూలీ స్పిన్ బౌలింగ్ లో ముందుకు వచ్చాడు అంటే సిక్సర్ పక్కా అనేంత రేంజ్ లో తన ఆట ఉండేది. గంగూలీ కెరీర్ లో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. దూకుడు అనే మంత్రంతో భారత జట్టుకు చాలా మంచి విజయాలు అందించాడు. 

ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి జట్ల మీద ఇండియాని గెలిపించాడు. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది గంగూలీనే. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు గంగూలీ హయాంలోనే రాటుదేలారు. ముఖ్యంగా సెహ్వాగ్ కోసం గంగూలీ తన ఓపెనింగ్ స్థానాన్ని వన్ డౌన్ కి మార్చుకున్నాడు. యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్లకు గంగూలీ మంచి సపోర్ట్ ఇచ్చాడు. 2005లో పాకిస్తాన్తో మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీని తన వన్ డౌన్ స్థానంలో పంపడం వల్లనే ధోని సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ధోని వెనుతిరిగి చూసుకోలేదు. ఇలా అందరు ప్లేయర్లను బాగా ఎంకరేజ్ చేసే గంగూలీ మీద 2006లో వేటు వేశారు. తర్వాత తన ఆట తీరు మెరుగుపరుచుకొని మళ్లీ 2007 ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించాడు. 2007లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ టీమిండియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. తర్వాత ఇంగ్లాండ్ తో సిరీస్ లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. 2008లో గంగూలి మళ్లీ వన్డే జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. తర్వాత టెస్టుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పాకిస్తాన్తో డబుల్ సెంచరీ చేశాడు. గంగూలీ ఒక మంచి కెప్టెన్, ఒక మంచి ప్లేయర్. భవిష్యత్తులో గంగూలి లాంటి కెప్టెన్లు టీమిండియా కు మరింత మంది దొరకాలని కోరుకుందాం.