World Cup 2023: ఆస్ట్రేలియాపై ఓడినా అఫ్గానిస్థాన్ జట్టుకు సెమీస్ కు వెళ్లే అవకాశం..!

World cup 2023: వన్డే వరల్డ్ కప్ 2023 (Worldcup2023) టోర్నమెంట్ లో ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్(Afghanistan) ఓటమితో ఫోర్త్ ప్లేస్ కోసం మూడు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియాపై అఫ్గాన్ జట్టు ఓడినప్పటికీ ఆ జట్టుకు సెమీస్(Semis) కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. భారత్(India) వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా(Australia), అఫ్గానిస్థాన్(Afghanistan) జట్ల మధ్య ఉత్కంఠ పోరు కొనసాగింది. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ (Afghanistan) జట్టు […]

Share:

World cup 2023: వన్డే వరల్డ్ కప్ 2023 (Worldcup2023) టోర్నమెంట్ లో ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్(Afghanistan) ఓటమితో ఫోర్త్ ప్లేస్ కోసం మూడు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియాపై అఫ్గాన్ జట్టు ఓడినప్పటికీ ఆ జట్టుకు సెమీస్(Semis) కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

భారత్(India) వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా(Australia), అఫ్గానిస్థాన్(Afghanistan) జట్ల మధ్య ఉత్కంఠ పోరు కొనసాగింది. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ (Afghanistan) జట్టు దాదాపు గెలుపు గుమ్మం వరకు చేరింది. కానీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్‌ మాక్స్‌వెల్ (Maxwell) బ్యాట్ తో వీరవిహారం చేయడంతో అఫ్గాన్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మాక్స్‌వెల్ ఒంటరిపోరాటం చేసి ఆసీస్ కు అద్భుత విజయాన్ని అందించాడు.

 128 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గాన్ పై గెలుపుతో ఆసీస్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంకు చేరుకుంది. ఫలితంగా సెమీస్(semis) బెర్త్ ఖరారు చేసుకుంది. పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన టీమిండియా అన్నింటిల్లోనూ విజయం సాధించింది. దీంతో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరో మ్యాచ్ ఈనెల 12న నెదర్లాండ్స్ తో తలపడుతుంది. రెండో స్థానంలో ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఉంది. దక్షిణాఫ్రికా(South Africa), ఆస్ట్రేలియా(Australia) జట్లు ఎనిమిది మ్యాచ్ లుఆడి ఆరు మ్యాచ్ లలో విజయం సాధించడంతో 12 పాయింట్లతో ఉన్నాయి. కానీ రన్ రేట్ ప్రకారం సఫారీ జట్టు ముందంజలో ఉంది.

Read More: Angelo Mathews: నా కెరీర్ లో ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదు..

సెమీస్ కు వెళ్లే అవకాశాలు

ప్రపంచకప్‌ 2023లో అఫ్గానిస్థాన్‌ అంచనాలకు మించి రాణించింది. టోర్నీని మామూలుగానే ఆరంభించిన అఫ్గాన్‌.. తర్వాత అనూహ్య ప్రదర్శనతో ఆందరినీ ఆశ్చర్యపరిచింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌(England)తో పాటు పాకిస్థాన్(Pakistan), శ్రీలంకకు(Srilanka) పెద్ద షాక్ ఇచ్చింది.  అయితే, సౌతాఫ్రికా ఈనెల 10న అఫ్గానిస్థాన్ జట్టుతో తలపడుతుంది. ఆస్ట్రేలియా మరో మ్యాచ్ ఈనెల 11న బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఒకవేళ అఫ్గాన్ జట్టుపై సౌతాఫ్రికా ఓడిపోయి, బంగ్లాపై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే రెండో ప్లేస్ లోకి ఆస్ట్రేలియా వెళ్తుంది. ఒకవేళ రెండు జట్లు తమ ప్రత్యర్థి జట్లపై విజయం సాధిస్తే రన్ రేట్ ప్రకారం రెండు మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు నిలిచే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ ఓటమితో ఫోర్త్ ప్లేస్ కోసం మూడు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియాపై అఫ్గాన్ జట్టు ఓడినప్పటికీ ఆ జట్టుకు సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

తన చివరి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa)లపై అఫ్గానిస్థాన్‌ ఆడాల్సి ఉండగా…ఆస్ట్రేలియా పై ఉత్కంఠ పోరులో ఓడిపోయింది. తరువాత మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడాల్సి  ఉంది.  అయితే  ఈ జట్టును ఓడించడం అఫ్గాన్‌కు అంత ఈజీ కాదు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ (Pakistan)మరియు న్యూజిలాండ్ (New Zealand)కంటే తక్కువ రన్-రేట్(Run Rate) కలిగి ఉంది, కాబట్టి వారు దక్షిణాఫ్రికాను గణనీయమైన తేడాతో ఓడించాలి లేదా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ రెండూ తమ రాబోయే మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అయితే అఫ్గాన్‌ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో నాల్గో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో పాకిస్థాన్(Pakistan), ఆరో స్థానంలో అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో, పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ తో, అఫ్గానిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడతాయి. ఒకవేళ ఈ మూడు జట్లు ప్రత్యర్థి జట్లపై ఓడిపోతే రన్ రేట్ ప్రకారం ఫోర్త్ ప్లేస్ లోకి వచ్చే జట్టును నిర్ణయించబడుతుంది. ఒకవేళ మూడు జట్లు ప్రత్యర్థి జట్లపై విజయం సాధించినా రన్ రేట్ ప్రకారం నాల్గో స్థానంలో సెమీస్ కు వెళ్లే జట్టు నిర్ణయించబడుతుంది. అఫ్గాన్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లలో ఒక్క జట్టు మాత్రమే గెలిచి మిగిలిన జట్లు ఓడిపోతే మినహా.. నాల్గో స్థానంలో సెమీస్ కు వెళ్లే జట్టును రన్ రేట్ ద్వారా నిర్ణయించడం తప్పనిసరి అవుతుంది.

నవంబర్ 15 న మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే(Vankhade)లో జరగనుండగా..  నవంబర్ 16 న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్(Gardens of Eden)లో జరగనుంది. టాప్ లో జట్టు, నాలుగు స్థానంలో జట్టుపై మొదటి సెమీస్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అదే విధంగా 2,3 స్థానాల్లో నిలిచిన జట్లు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధించాయి. వీటిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలవడం ఖాయమైపోయింది. అగ్ర స్థానంలో ఉన్న టీమిండియాతో సెమీస్ లో తలపడేందుకు పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు పోటీ పడనున్నాయి.ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. నవంబర్ 12 న లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి.