ఢిల్లీ కాపిటల్స్ తడబాటు: IPL 2023లో వరసగా ఐదో ఓటమి

2023 సీజన్ ఐపీఎల్‌లో 20కి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దాదాపు అన్ని జట్లు కనీసం ఒక్కో విజయాన్ని నమోదు చేశాయి.. కానీ, అన్ని టీంల కంటే ఎక్కువగా అంటే.. అయిదు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) మాత్రం ఇంకా బోణీ కొట్టలేదు. ఇక శనివారం.. విరాట్ కోహ్లీ టీమ్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో కూడా ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌.. ఢిల్లీ ముందు 174 పరుగుల టార్గెట్ ఉంచింది. అయితే మొదట బెంగళూరు […]

Share:

2023 సీజన్ ఐపీఎల్‌లో 20కి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దాదాపు అన్ని జట్లు కనీసం ఒక్కో విజయాన్ని నమోదు చేశాయి.. కానీ, అన్ని టీంల కంటే ఎక్కువగా అంటే.. అయిదు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) మాత్రం ఇంకా బోణీ కొట్టలేదు. ఇక శనివారం.. విరాట్ కోహ్లీ టీమ్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో కూడా ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌.. ఢిల్లీ ముందు 174 పరుగుల టార్గెట్ ఉంచింది. అయితే మొదట బెంగళూరు దూకుడుచూ స్తుంటే 200లకు పైగా పరుగులు చేస్తుందేమోనని అనిపించింది. 174 పరుగుల లక్ష్యం.. ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇది అంత పెద్ద టార్గెట్ కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ లక్ష్యాన్ని ఉఫ్ అంటూ ఊదెయ్యగల బ్యాటర్లు ఢిల్లీ టీంలో ఉన్నారు. కానీ.. వారు ఆ పోరాటమపటిమ చూపలేదు. ఫలితంగా, ఆ టీమ్ వరుసగా ఐదో ఓటమి నుండి తప్పించుకోలేకపోయింది. 

అమన్ హకీమ్ ఖాన్‌‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండర్‌గా తీసుకుంది.  అదేమిటో కానీ శనివారం జరిగిన మ్యాచ్‌లో అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. పైగా అతను  8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఆ టీం ఎంత గందరగోళంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు వారు ఆడిన 5 మ్యాచులు వరసగా ఓడిపోయారు. రిషబ్ పంత్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.  రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, ప్రవీణ్ ఆమ్రే వంటి గొప్ప వ్యక్తులు కోచ్, సహాయ కోచులుగా ఉన్నారు. అమన్ హకీమ్ చాలా మంచి ఆటగాడు, గత సీజన్లలో బాగా ఆడాడు. కానీ అతనికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. 

గతంలో టాప్ ప్లేయర్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ కూడా తన స్థాయికి తగ్గ ఆడట్లేదు. జట్టుపై అతని ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. అతని కెప్టెన్సీ కూడా నిరాశ కలిగిస్తోంది. అయితే, శనివారం కాస్త ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించినా 19 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 

2023 ఐపీఎల్‌-16లో బెంగళూరు విజయాల సంఖ్యను పెంచుకుంటోంది. మొదటి మ్యాచ్ గెలిచిన తరువాత, రెండు మ్యాచులు ఓడిన రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు.. ఇప్పుడు మళ్ళీ శనివారం 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌పై  ఘన విజయం సాధించింది. విరాట్‌ కోహ్లీ (34 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 50 పరుగులు ) అర్ధ సెంచరీతో మెరవడంతో రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. DC బౌలర్లలో కుల్‌దీప్‌, మిచెల్‌ మార్ష్‌ చెరో రెండు వికెట్లు తీసి బెంగళూరును కట్టడి చేశారు. 174 పరుగులతో ఛేదనకు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. మనీశ్‌ పాండే (38 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 50 పరుగులు) అర్థ శతకంతో మెరిసినా.. ఢిల్లీ ఓడిపోయింది. బెంగళూరు బౌలర్లలో విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ 3 వికెట్లు పడగొట్టగా, సిరాజ్‌ 2 వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించారు.