David Warner: వరల్డ్ కప్ 2023లో స్టెప్పులు వేసిన డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్ (David Warner), ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గొప్ప క్రికెటర్ కన్నా ముందు, మంచి డాన్సర్ అంటూ ప్రశంసలు వినిపిస్తూ ఉంటాయి. క్రికెట్ బరిలో ఎంత బాగా ఆడతాడో స్టెప్పులు కూడా అంతే బాగా వేస్తాడని మరొకసారి నిరూపించుకున్నాడు డేవిడ్ వార్నర్. వరల్డ్ కప్ 2023 (world cup 2023) జరుగుతున్న క్రికెట్ స్టేడియంలో, పుష్ప పాటకు మరొకసారి డాన్స్ వేసి అభిమానుల మనసులను దోచుకున్నాడు డేవిడ్ వార్నర్.  (David Warner) మరోసారి […]

Share:

డేవిడ్ వార్నర్ (David Warner), ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గొప్ప క్రికెటర్ కన్నా ముందు, మంచి డాన్సర్ అంటూ ప్రశంసలు వినిపిస్తూ ఉంటాయి. క్రికెట్ బరిలో ఎంత బాగా ఆడతాడో స్టెప్పులు కూడా అంతే బాగా వేస్తాడని మరొకసారి నిరూపించుకున్నాడు డేవిడ్ వార్నర్. వరల్డ్ కప్ 2023 (world cup 2023) జరుగుతున్న క్రికెట్ స్టేడియంలో, పుష్ప పాటకు మరొకసారి డాన్స్ వేసి అభిమానుల మనసులను దోచుకున్నాడు డేవిడ్ వార్నర్.  (David Warner)

మరోసారి పుష్ప పాటకు.. డాన్స్ : 

డేవిడ్ వార్నర్  (David Warner) తరచుగా తన టిక్ టాక్ ద్వారా ఎన్నో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అందులో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది పుష్ప స్టైల్ డాన్స్. పుష్ప వచ్చిన అనంతరం, అందులో ఉండే హుక్ స్టెప్ కు డేవిడ్ వార్నర్ చాలాసార్లు తనదైన శైలిలో డాన్స్ వేస్తూ మెస్మరైస్ చేశాడు. ప్రతి ఆటను కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడాలనేది డేవిడ్ వార్నర్ ను చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే, వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో కూడా, స్టేడియంలో వినిపించిన పుష్ప సాంగ్కుగాను చక్కగా స్టెప్పులు వేసి, ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకున్నాడు డేవిడ్ వార్నర్. 

Read More: చెలరేగిన కోహ్లీ, రాహుల్.. వరల్డ్‌కప్‌లో భారత్‌ బోణీ

పుష్ప సినిమా దక్కించుకున్న ఎన్నో అవార్డులు: 

పుష్ప ది రైస్ తరువాత రాబోతున్న సెకండ్ పార్ట్ ‘పుష్ప 2: ది రూల్‌’, దీని టీసర్ కూడా ఈమధ్య కాలంలో వచ్చి ఈ సినిమా పైన మరింత అంచనాలు పెంచేస్తోంది. అయితే దాని తరువాత పెద్దగా దీని గురించి వార్తలు వినిపించలేదు. ఇటీవల చిరు లీక్స్ లాగా అల్లు అర్జున్ పుష్ప 2 లోని ఒక డైలాగ్ లీక్ చేసాడు.”పుష్ప అంటే ప్లావర్ అంకుంటివ్వా? కాదు ఫైయ్యారు!!” లాంటి డైలాగులు ఎన్నో మొదటి భాగం లో విన్నాము. బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’ సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని అందరం ఎదురుచూస్తున్నాము. అంచనాలు లెక్కించలేనంతగా ఉన్నాయి, సినిమా ఎప్పుడొస్తుంది మాత్రం క్లారిటీ లేదు, పైగా దేశం లో సౌంత్ లో నాలుగు భాషలు, హిందీ తో కలిపి ఐదు భాషల్లో వచ్చి కరోనాలోనే భారీ వసూళ్లు సాధించిన మొదటి సినిమా అయ్యింది పుష్ప ఫస్ట్ పార్ట్. పుష్ప సినిమాకుగాను అల్లు అర్జున్ ఈ మధ్య జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు. 

రెండవ భాగం నుండి ఒక ప్రధాన డైలాగ్‌ను లీక్ చేసి ఇప్పుడు సినిమా అభిమానులలో మరింత ఉత్సాహాన్ని పెంచాడు ఐకాన్ స్టార్. “బేబీ” సినిమా సక్సెస్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ అతిధిగా వచ్చి, టీం అందర్నీ పేరు పేరునా మెచ్చుకున్నాడు. అనంతరం ఈ కార్యక్రమంలో బేబీ టీమ్ ని మెచ్చుకుని చివరిలో , “ఈడంతా ఉండేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది. పుష్ప గాడి రూల్.” ఇలా ఈ డైలాగ్ చెప్తానని అనుకోలేదు కానీ చెప్తాను అని చెప్పేసాడు ఐకాన్ స్టార్ అల్లు అల్లు అర్జున్. అల్లు అర్జున్ డైలాగ్‌కు చప్పట్లతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చీర, గాజులు అలంకరించుకున్న అవతార్‌లో పుష్పరాజ్  ఫస్ట్ లుక్ అప్పుడే అదిరిపోయింది. సీక్వెల్ పుష్ప 2: ది రూల్‌కి సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక, ఫహద్ ఫాసిల్, సునీల్ అనసూయ ముఖ్య పాత్రల్లో కొనసాగుతారు. సినిమా త్వరలో విడుదల అయ్యి మంచి విజయం సాధించాలని, ఆలస్యం అయితే ఇలాంటి లీక్స్ మరిన్ని రావాలని కోరుకుందాం.