12 పరుగుల తేడాతో లక్నోపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ఐపీఎల్ 2023లో చెన్నై బోణీ కొట్టింది. తన రెండవ మ్యాచ్‌లో  చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ఐపీఎల్‌లో అన్ని టీమ్స్ వారి హోమ్ గ్రౌండ్‌లో బాగా స్ట్రాంగ్‌గా కనబతాయి. అందులో కొన్ని టీమ్స్ మాత్రం ఆ స్టాంగ్‌నెస్‌ను కంటిన్యూ చేస్తూ విజయాలు నమోదు చేస్తాయి. అలాంటి వాటిలో చెన్నై ముందు వరసలో ఉంటుంది. ఇక చెపాక్‌ స్టేడియంలో చెన్నైకి మంచి రికార్డే ఉంది.  లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG) […]

Share:

ఐపీఎల్ 2023లో చెన్నై బోణీ కొట్టింది. తన రెండవ మ్యాచ్‌లో  చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది.

ఐపీఎల్‌లో అన్ని టీమ్స్ వారి హోమ్ గ్రౌండ్‌లో బాగా స్ట్రాంగ్‌గా కనబతాయి. అందులో కొన్ని టీమ్స్ మాత్రం ఆ స్టాంగ్‌నెస్‌ను కంటిన్యూ చేస్తూ విజయాలు నమోదు చేస్తాయి. అలాంటి వాటిలో చెన్నై ముందు వరసలో ఉంటుంది. ఇక చెపాక్‌ స్టేడియంలో చెన్నైకి మంచి రికార్డే ఉంది.  లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG) తో జరిగిన మ్యాచ్‌లో కూడా చెన్నై సూపర్ సింగ్స్(CSK) దుమ్ము దులిపింది. రెండు  జట్లలో 200లకు పైగా స్కోర్లు నమోదు చేసినా.. చెన్నై విజయం సాధించింది.

చెపాక్ క్రికెట్ స్టేడియంలో చెన్నై 56 మ్యాచ్‌లు ఆడగా, 40 మ్యాచ్‌లు గెలిచింది. ఇటీవల లక్నోపై కూడా విజయం సాధించింది. చెపాక్‌లో చెన్నై గెలుపు శాతం 72 శాంతంగా ఉంది. సొంతగడ్డపై మరే జట్టు కూడా ఇన్ని విజయాలు సాధించలేదు. ప్రస్తుతం చెపాక్‌లో చెన్నై 57 మ్యాచ్‌లు ఆడి 41 విజయాలు సాధించింది. కాగా.. చెన్నై అభిమానుల సంఖ్య కూడా భారీగానే ఉంది.

చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు మాత్రమే కోల్పోయి 217 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG) మాత్రం 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. లక్నో కెప్టెన్ KL రాహుల్ ఆకట్టు కోలేకపోయాడు. దీపక్ హుడా, కృణాల్ పాండ్యా ఇద్దరూ విఫలమవగా, మధ్యలో బ్యాటింగ్ చేసిన నికోలస్ పూరన్ రాణించినా.. లక్నోకు ఓటమి తప్పలేదు. ఇక మేయర్స్‌ క్రీజ్‌లో ఉన్నంత వరకు లక్నోకు గెలుపు ఈజీగానే అనిపించింది. ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్‌లో  దిల్లీపై దంచికొట్టిన ఈ విండీస్ ఆటగాడు.. CSK పైన కూడా కనికరం లేకుండా ఆడాడు. అందిన బాల్‌ని అందినట్టుగా కొడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.  దీంతో మేయర్స్‌ దూకుడుకు 2 నుండి 5 మధ్య ఓవర్లలో వరుసగా 18, 13, 18, 17 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లలోని లక్నో స్కోర్  73కు చేరుకుంది. కాగా.. పవర్‌ ప్లేలో చివరిది ఆరో ఓవర్లో బౌలింగ్ చేసిన మొయిన్‌ అలీ మేయర్స్‌ దూకుడుకు కళ్లెం వేశాడు. అంతలోనే ఆగకుండా.. ఓవర్‌కో వికెట్‌  తీసుకున్నాడు. రాహుల్‌ కేవలం 20 పరుగులే చేశాడు. ఇక స్టాయినిస్‌ కూడా 21 పరుగులే చేసి మొయిన్ ఆలీ బౌలింగ్‌లో ఔటయ్యారు. చివరికి ఆట స్వరూపం మార్చేస్తున్నట్టు కనిపించిన పూరన్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక బదోని 23 పరుగులు చేయగా, గౌతమ్‌ 17 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచినా ఓటమి నుండి కాపాడలేకపోయాడు. 

మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఓపెనర్లు ఇద్దరు లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ఋతురాజ్ గైక్వాడ్, కాన్వే ఇద్దరూ చెలరేగి ఆడారు. ఒకరితో ఒకరు పోటీపడి మరి బౌండరీలు కొట్టారు. ఋతురాజ్ కేవలం 26 బంతులలోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 31 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు.  మరోవైపు డేవాన్‌ కాన్వే కూడా 29 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు శివమ్‌ దూబె 27 అంబటి రాయుడు  చెరో 27 పరుగులు చేశారు. జడేజా, బెన్​స్టోక్ట్స్​, నిరాశపరిచైనా ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోనీ సంచలన అత్థో ఇన్నింగ్స్ ముగించాడు కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోనీ 2 సిక్స్‌లతో 12 పరుగులు చేశాడు. లఖ్​నవూ బౌలర్లో బిష్ణోయ్‌, మార్క్​వుడ్​ తలా మూడు వికెట్లు  తీయగా, ఆవేశ్​ ఖాన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

మరింత లోడ్ చేయండి

స్క్వాడ్‌లు:  CSK: ఎంఎస్ ధోని (సి), మోయిన్ అలీ, భగత్ వర్మ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, సిసంద మగల, అజయ్ మండల్, మతీషా పతిరానా, డ్వైన్ ప్రిటోరియస్, డ్వైన్ ప్రిటోరియస్ అజింక్యా రహానే, అంబటి రాయుడు, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, సిమర్‌జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, బెన్ స్టోక్స్, మహేశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్.

LSG: కేఎల్ రాహుల్ (సి), అవేష్ ఖాన్, ఆయుష్ బడోని, క్వింటన్ డి కాక్, కె గౌతం, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, కైల్ మేయర్స్, అమిత్ మిశ్రా, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, డేనియల్ సామ్స్ , కరణ్ శర్మ, రొమారియో షెపర్డ్, మార్కస్ స్టోయినిస్, స్వప్నిల్ సింగ్, జయదేవ్ ఉనద్కత్, మనన్ వోహ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, యష్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్.