క్రిస్టియానో ​​రొనాల్డో మరియు టాలిస్కే ఇద్దరూ గొప్ప ఫుట్‌బాల్ ఆటగాళ్లే.. కానీ..

ఈ ఏడాది జనవరిలో అల్-నాసర్ తో ఒప్పందం కుదుర్చుకున్న38 ఏళ్ళ రొనాల్డో ప్రస్తుతం లీగ్ స్టాండింగ్‌లలో రెండవ స్థానంలో ఉన్నాడు, అల్-ఇత్తిహాద్ ఫ్యాన్ క్లబ్ నాయకుడు మొదటి స్థానంలో ఉన్నట్టు అంచనా. ఇక రొనాల్డో ఒప్పందం విలువ సుమారు 200 మిలియన్ యూరోల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ మీడియా కథనాలు వెలువడ్డాయి. క్రిస్టియానో ​​రొనాల్డో సౌదీ అరేబియాలో అనేక గోల్స్ చేస్తూనే ఉన్నాడు, తొమ్మిది లీగ్ గేమ్‌లలోనే  11 గోల్స్ చేసి ఔరా అనిపించాడు. […]

Share:

ఈ ఏడాది జనవరిలో అల్-నాసర్ తో ఒప్పందం కుదుర్చుకున్న38 ఏళ్ళ రొనాల్డో ప్రస్తుతం లీగ్ స్టాండింగ్‌లలో రెండవ స్థానంలో ఉన్నాడు, అల్-ఇత్తిహాద్ ఫ్యాన్ క్లబ్ నాయకుడు మొదటి స్థానంలో ఉన్నట్టు అంచనా. ఇక రొనాల్డో ఒప్పందం విలువ సుమారు 200 మిలియన్ యూరోల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ మీడియా కథనాలు వెలువడ్డాయి.

క్రిస్టియానో ​​రొనాల్డో సౌదీ అరేబియాలో అనేక గోల్స్ చేస్తూనే ఉన్నాడు, తొమ్మిది లీగ్ గేమ్‌లలోనే  11 గోల్స్ చేసి ఔరా అనిపించాడు. కాగా.. ఇంత  అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, అతను ఇప్పటికీ జట్టు సహచరుడు అయిన అల్- నాస్ర్ యొక్క టాప్ స్కోరర్ అండర్సన్ టాలిస్కా గోల్స్ చేసిన రికార్డులను అందుకోలేకపోయాడు.

బ్రెజిలియన్ స్ట్రైకర్ అండర్సన్ టాలిస్కా ఈ సీజన్‌లో తన క్లబ్‌ తరపున మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు అన్ని గేమ్స్ లో  కలిపి 16 గోల్స్ చేశాడు. మంగళవారం అల్-అదాలాపై 5-0తో తేడాతో ఆల్ నాస్ర్ గెలుపొందింది.  ఇందులో 2 గోల్స్  అండర్సన్ చేసినవే కావడం విశేషం. ఈ గోల్స్ అతనిని ఈ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా చేశాయి, ఇక మాజీ మాంచెస్టర్ యునైటెడ్ మరియు ప్రస్తుత ఆల్- హిలాల్ ప్లేయర్ ఓడియన్ ఇఘాతో సమానంగా ఉన్నాడు.

ప్రతి జట్టుకు సీజన్‌లో ఇంకా ఎనిమిది గేమ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ సీజన్‌ను ఒక జట్టు మరో జట్టుతో సమానంగా ముగించినట్లయితే, హెడ్-టు-హెడ్ మ్యాచ్‌లలో మెరుగైన రికార్డు ఉన్న జట్టు విజేతగా నిలుస్తుంది.

“నేను అల్-నాసర్‌ ను గెలిపించడం పైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నాను, అదే విధంగా లీగ్‌లో టాప్ స్కోరర్‌గా ఉండటం గురించి నాకు ఆలోచనే లేదు. నా ప్రధాన లక్ష్యం ఏంటంటే.. నా జట్టును విజయపథంలో నడిపించడంలో సహాయపడటం, అంతే.” అని ఆ జట్టు ఆటగాడు అండర్సన్ టాలిస్కా అన్నారు. 

విరామానికి ముందు, రోనాల్డో టాలిస్కాకు చివరి నాలుగు నిమిషాల సమయంలో పెనాల్టీ కిక్‌ను మార్చే పనిని అప్పగించాడు, దీంతో  గోల్ చేసిన టాలీస్క పోర్చుగల్ కెప్టెన్ నుండి అభినందనలు అందుకున్నాడు.

ఫిబ్రవరి 5, 1985న జన్మించిన క్రిస్టియానో ​​రొనాల్డో ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ ఆటగాడు, అతను అనేక అవార్డులు గెలుచుకున్నాడు. అందరిచే ప్రశంసలు అందుకున్నాడు. అతను ప్రపంచంలోనే గొప్ప ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఛాంపియన్స్ లీగ్ మరియు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లలో ఇతను ఆల్-టైమ్ లీడింగ్ స్కోరర్. ఏడు లీగ్ టైటిల్స్, ఐదు UEFA ఛాంపియన్స్ లీగ్‌లు, UEFA యూరోపియన్ ఛాంపియన్‌షిప్ మరియు UEFA నేషన్స్ లీగ్‌లతో సహా తన కెరీర్‌లో 32 ట్రోఫీలను కూడా గెలుచుకున్నాడు. 

ఇక ఫిబ్రవరి 1, 19994న జన్మించిన అండర్సన్ టాలిస్కా బ్రెజిలియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, అతను సౌదీ ప్రొఫెషనల్ లీగ్ క్లబ్ అల్ నాసర్‌కు అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌గా మరియు ఫార్వర్డ్‌గా ఆడతాడు. ఇక ఇతని ప్రత్యేకత ఏంటంటే అతను రెండు పాదాలతో గోల్స్ చేయగలడు.

4 నవంబర్ 2014న, అతను UEFA ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ దశలో ఏకైక గోల్ చేసి మొనాకోను ఓడించాడు. ఈ గోల్ చెయ్యడం తన జీవితంలో అత్యుత్తమ అనుభూతిగా అభివర్ణించాడు. 26 జనవరి 2016న, అతను టాకా డా లీగ్ లో మోరీరెన్స్‌పై హ్యాట్రిక్ కొట్టి 6-1తో విజయం సాధించి పెట్టాడు.