Bishan singh Bedi: ముగిసిన బిషన్ సింగ్ బేడీ అంత్యక్రియలు

దీర్ఘ కాల అనారోగ్యంతో తనువు చాలించిన ఇండియన్ మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ (Bishan Singh Bedi) అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. ఈ వేడుకలకు అనేక మంది ఇండియన్ మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. కేవలం బిషన్ సింగ్ బేడీ (Bishan Singh Bedi)తో ఆడిన వారు మాత్రమే కాకుండా వేరే జట్లకు ఆడిన క్రికెటర్లు కూడా హాజరయ్యారు. ఒక్కరని కాకుండా అనేక మంది ఈ అంత్యక్రియలకు వచ్చారు. వచ్చి వారు బిషన్ సింగ్ బేడీ (Bishan […]

Share:

దీర్ఘ కాల అనారోగ్యంతో తనువు చాలించిన ఇండియన్ మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ (Bishan Singh Bedi) అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. ఈ వేడుకలకు అనేక మంది ఇండియన్ మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. కేవలం బిషన్ సింగ్ బేడీ (Bishan Singh Bedi)తో ఆడిన వారు మాత్రమే కాకుండా వేరే జట్లకు ఆడిన క్రికెటర్లు కూడా హాజరయ్యారు. ఒక్కరని కాకుండా అనేక మంది ఈ అంత్యక్రియలకు వచ్చారు. వచ్చి వారు బిషన్ సింగ్ బేడీ (Bishan Singh Bedi)ని కడసారి చూశారు. ఆయన ఇటీవల మరణించగా.. మంగళవారం అతడి అంత్యక్రియలు (Fluneral) జరిగాయి. 

కపిల్ దేవ్, సెహ్వాగ్ హాజరు.. 

ఈ దిగ్గజ మాజీ క్రికెటర్ అంత్యక్రియలకు (Fluneral) ఇండియన్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తో పాటు అనేక మంది క్రికెట్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. బిషన్ సింగ్ బేడీ (Bishan Singh Bedi) మృతి చెందేందుకు ఆయనకు దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యమే (Health Issues) కారణం. చాలా రోజుల నుంచి బాధపడుతున్న బిషన్ సింగ్ (Bishan Singh Bedi) సోమవారం ఇక్కడ మరణించారు. అతని వయస్సు 77. ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్, మదన్ లాల్, సెహ్వాగ్ మరియు కీర్తి ఆజాద్‌ లతో సహా భారత క్రికెట్‌ లోని చాలా మంది ప్లేయర్స్ అతడి అంత్యక్రియలకు (Fluneral) హాజరయ్యారు. కడసారి ఆ లెజెండ్ ను చూసి కన్నీరు పెట్టుకున్నారు. కేవలం పైన పేర్కొన్న వారు మాత్రమే కాకుండా ఇండియన్ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ సపోర్టు స్టాఫ్‌ లో భాగమైన అజయ్ జడేజా వంటి ఎంతో మంది బిషన్ సింగ్ బేడీ  (Bishan Singh Bedi) వద్ద నుంచి మెళకువలు నేర్చుకున్న వారిలో ఉన్నారు. బిషన్ సింగ్ బేడీ (Bishan Singh Bedi)ని “సర్దార్ ఆఫ్ స్పిన్” అని పిలిచే వారు. ఆయన వద్ద మెళకువలు నేర్చుకున్న వారిలో సీనియర్ స్పిన్నర్ మురళీ కార్తీక్ కూడా ఉన్నారు.

ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు కూడా.. 

బిషన్ సింగ్ బేడీ (Bishan Singh Bedi) అంత్యక్రియలకు కేవలం ఇంటర్నేషనల్ క్రికెటర్లు మాత్రమే కాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు కూడా హాజరయ్యారు. మొత్తం ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు హాజరయ్యారు. అతను గొప్ప క్రికెటర్ మరియు గొప్ప మానవతా వాది అని వారు కీర్తించారు. అతడి అంత్యక్రియలు (Fluneral) లోధీ శ్మశానవాటికలో జరిగాయి. 1946 లో అమృత్‌సర్‌ లో జన్మించిన బిషన్ సింగ్ బేడీ (Bishan Singh Bedi) భారత్ తరఫున 67 టెస్టులు ఆడి 14 సార్లు ఐదు వికెట్లు, ఒకసారి 10 వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతడు తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 266కు చేరుకుంది. అతను ఎరపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్ మరియు శ్రీనివాస్ వెంకటరాఘవన్‌ ల సమయంలో ఇండియన్ క్రికెట్ కు సేవలందించాడు. వీరు స్పిన్ బౌలింగ్ (Bowling) చేస్తుంటే ప్రత్యర్థులు బెంబేలెత్తిపోయేవారు. వారు 1966 మరియు 1978 మధ్య ఒక దశాబ్దానికి పైగా భారతదేశ బౌలింగ్ యూనిట్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్నారు. అప్పడు వారు లేకపోతే భారత బౌలింగ్ లేదనే స్థాయిలో వారి పర్ఫామెన్స్ ఉండేది.  

మేనేజర్ గానూ.. 

బిషన్ సింగ్ బేడీ (Bishan Singh Bedi) కేవలం క్రికెటర్ గా మాత్రమే కాకుండా క్రికెట్ టీం కు మేనేజర్ (Manager) గా కూడా సేవలందించాడు. 1990లో న్యూజిలాండ్ మరియు ఇంగ్లండ్ పర్యటనల సమయంలో బేడీ (Bishan Singh Bedi) కొంతకాలం భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌ గా కూడా పని చేశాడు. అంతే కాకుండా మణిందర్ సింగ్, సునీల్ జోషి మరియు మురళీ కార్తిక్ వంటి అనేక మంది ప్రతిభావంతులైన స్పిన్నర్లకు జాతీయ సెలెక్టర్ మరియు మెంటర్‌ (Mentar) గా కూడా సేవలందించాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి రిటైర్మెంట్ తర్వాత 1975 మరియు 1979 మధ్య టెస్ట్ క్రికెట్‌ లో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అతడు కెప్టెన్సీ కూడా చేశాడు. అతడి వంటి దిగ్గజ క్రికెటర్ ను కోల్పోవడం ఇండియన్ క్రికెట్ కు పెద్ద లోటే అని చెప్పాలి. ఆయన సేవలను మెచ్చిన ప్రభుత్వం మరియు బీసీసీఐ అతడికి ఎన్నో అవార్డులతో పాటు రివార్డులను కూడా అందించింది.