పాక్ ప్లేయ‌ర్‌ను ఆపడానికి ట్రై చేసిన కోచ్‌కు రెడ్ కార్డ్

క్రికెట్ అయినా, ఫుట్బాల్ అయినా, గేమ్ ఏదైనా సరే ఇండియా పాకిస్తాన్ ఆడుతున్నారు అంటే మాత్రం అది హై వోల్టేజ్ మ్యాచ్ కిందకే వస్తుంది. బుధవారం నాడు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ ఫుట్బాల్ మ్యాచ్ ఇందుకు మరొక నిదర్శనం అని చెప్పవచ్చు. మ్యాచ్ ఎంతో మామూలుగా బిగిన్ అయింది, అయితే అనూహ్యంగా పాకిస్తాన్ గోల్ కీపర్ సాకిబ్ హనీఫ్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల భారత్ కెప్టెన్ సునీల్ ఛెత్రికి […]

Share:

క్రికెట్ అయినా, ఫుట్బాల్ అయినా, గేమ్ ఏదైనా సరే ఇండియా పాకిస్తాన్ ఆడుతున్నారు అంటే మాత్రం అది హై వోల్టేజ్ మ్యాచ్ కిందకే వస్తుంది. బుధవారం నాడు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ ఫుట్బాల్ మ్యాచ్ ఇందుకు మరొక నిదర్శనం అని చెప్పవచ్చు.

మ్యాచ్ ఎంతో మామూలుగా బిగిన్ అయింది, అయితే అనూహ్యంగా పాకిస్తాన్ గోల్ కీపర్ సాకిబ్ హనీఫ్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల భారత్ కెప్టెన్ సునీల్ ఛెత్రికి మొదటి గోల్ కొట్టాడు. అయితే ఆట గడుస్తున్న కొద్ది భారత్ పాకిస్తాన్ పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. 90 నిమిషాల సమయం జరిగిన ఆటలో భారత్ దే పైచేయి. అయితే కరెక్ట్ గా ఆఫ్ టైం విసిల్కు ఐదు నిమిషాలు ఉంది అనగా విషయాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. పరిస్థితులు రిఫరీ తన జేబులో నుంచి రెడ్ కార్డ్ బయటకి తీసే వరకు వెళ్లాయి. అయితే ఈసారి రెఫరీ రెడ్ కార్డు చూపించింది ప్లేయర్ కి కాదు ఏకంగా కోచ్కే…

జరిగింది ఏమిటంటే….

వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ ప్లేయర్ అబ్దుల్లా ఇక్బాల్ త్రో-ఇన్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు స్టిమాక్ క్షణికావేశంలో అతని చేతి నుంచి బంతిని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ కారణంగా పరిస్థితి తలకిందులు అయింది. ఇద్దరితో మొదలైన గొడవ చివరికి 20,000 మంది చుట్టూ మూగేలా చేసింది. స్టిమాక్ ఒక మంచి కోర్చే కాదు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాడు కూడా. కానీ అనుకోకుండా ఒక్క నిమిషం అతను విచక్షణ పక్కన పెట్టి చేసిన పని పెద్ద వివాదానికి దారి తీసింది. చివరికి గొడవను ఆపడానికి రెఫరీ ప్రజ్వల్ ఛెత్రీ మరియు ఇతర మ్యాచ్ అధికారులు జోక్యం చేసుకోవలసి వచ్చింది.

ఎప్పుడైతే కోచ్ స్టిమాక్ అబ్దుల్లా ఇక్బాల్ చేతిలోని బంతిని తీసుకోవడానికి ప్రయత్నించాడు వెంటనే ఇక్బాల్ టీమేట్ రాహిస్ నబీ అక్కడకు పరిగెత్తుకొని రావడమే కాకుండా స్టీమర్ ను గట్టిగా తిట్టాడు కూడా.అయితే వెంటనే అక్కడ పరిస్థితి మారిపోయింది. ఇటు ఆటగాళ్లు అటు కోచ్లు ఎవరు తగ్గేదే లేదు అన్నట్టు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. అయితే అందరిలోకి ఎక్కువగ కోపంగా  పాకిస్తాన్ గోల్ కీపింగ్ కోచ్ మార్సెలో ష్రోడర్ కోస్టా కనిపించారు. అతను ఇండియన్ టీం మేనేజర్ వేలు ధయాళమణిని తన తలతో ఢీ కొట్టాడు. ఇటు రెఫరీలు అటు ఇతర మ్యాచ్ అధికారులు ఎట్టకేలకు అందరిని ఆపగలిగారు.

మహేశ్‌ గావ్లీ ఒపీనియన్…

సెకండ్ హాఫ్ లో టీం బాధ్యతలను అసిస్టెంట్‌ కోచ్‌ మహేశ్‌ గావ్లీ తీసుకున్నారు. ఇతను సెంటర్ బ్యాక్ గా భారత్ జట్టు తరుపున ఎన్నో మ్యాచుల్లో పాల్గొన్నారు. మ్యాచ్ అనంతరం సంఘటన గురించి విలేకరులు గావ్లీని అడిగినప్పుడు.. తప్పు తమ కోచ్ వైపే ఉంది అని అతను అంగీకరించారు. అయితే రెఫరీలు కూడా చాలా కఠినంగా ప్రవర్తించారని గావ్లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

“బాల్ తీసుకోవడానికి ప్రయత్నించినందుకు ఇగోర్ స్టిమాక్ రెడ్ కార్డ్ ఇవ్వడం న్యాయం అయితే మరి అతన్ని అడ్డగించి వెనక్కి నెట్టిన పాకిస్తాన్ ఆటగాళ్లకు కూడా రెఫరీ రెడ్ కార్డు ఇవ్వాలి కదా. మరి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన పనిని రెఫరీ గమనించలేదంటారా.. ఆ టీంలో ఒకళ్ళు మా మేనేజర్ పై దాడి చేశారు.. మరి వాళ్ళలో ఎవరికీ ఎందుకు రెడ్ కార్డు ఇవ్వలేదు..”అని మ్యాచ్ అనంతరం విలేకరులతో జరిగిన సమావేశంలో మహేశ్‌ గావ్లీ జరిగిన సంఘటనపై తీవ్రంగా స్పందించారు.

మరోపక్క పాకిస్తాన్ అసిస్టెంట్ కోచ్ టోర్బెన్ విటాజెవ్స్కీ మాత్రం ఆటలోని పరిస్థితి కారణంగా ప్లేయర్స్ అలా ప్రవర్తించారే తప్ప తమ వైపు నుంచి ఇందులో ఉద్దేశపూర్వకంగా జరిగింది ఏమీ లేదు అని స్పష్టం చేశారు. అయితే మొత్తానికి 4 -0 స్కోర్ తో ఇండియా ఈ మ్యాచ్ లో విజయ పతాకాన్ని ఎగురవేసింది. ఏదిఏమైనాప్పటికీ మరోసారి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్రమైన ఉత్కంఠతను రేపింది.