కౌంటీ ఛాంపియన్ షిప్: ఛెతేశ్వర్ పుజారా మొదటి మ్యాచ్ లోనే సెంచరీ..

భారత్‌లో ఐపీఎల్ 2023 సందడి నెలకొంది. అయితే ఈ సందడిలో 7,491 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన మెసేజ్‌తో ఆనందం వెల్లివిరిసింది. ఛెతేశ్వర్ పుజారా ఈ సందేశాన్ని పంపించాడు. పుజారా ఐపీఎల్ 2023లో భాగం కాలేదనే సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ లోని హోవ్‌లో కౌంటీ టీం ససెక్స్ తరపున  పుజారా క్రికెట్ ఆడుతున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కూడా ఇంగ్లాండ్‌లోనే జరగాల్సి ఉంది. ఫైనల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని పుజారా టీం ఇండియాకు […]

Share:

భారత్‌లో ఐపీఎల్ 2023 సందడి నెలకొంది. అయితే ఈ సందడిలో 7,491 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన మెసేజ్‌తో ఆనందం వెల్లివిరిసింది. ఛెతేశ్వర్ పుజారా ఈ సందేశాన్ని పంపించాడు. పుజారా ఐపీఎల్ 2023లో భాగం కాలేదనే సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ లోని హోవ్‌లో కౌంటీ టీం ససెక్స్ తరపున  పుజారా క్రికెట్ ఆడుతున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కూడా ఇంగ్లాండ్‌లోనే జరగాల్సి ఉంది. ఫైనల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని పుజారా టీం ఇండియాకు స్పెషల్ సందేశం ఇచ్చాడు.. 

ఇంగ్లాండ్ కౌంటి ఛాంపియన్ షిప్ డివిజన్ -2 లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్నారు.. కాగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన మొదటి మ్యాచ్ లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు.  హోప్ వేదికగా డర్హమ్‌తో ఆడిన మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుతమైన సెంచరీతో దూసుకెళ్లాడు. రెండో రోజు ఆట సందర్భంగా 55వ ఓవర్లో బ్రైడన్ బౌలింగ్ లో వరుసుగా రెండు బౌండరీలు దాటిన పుజారా తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  134 బంతుల్లో పుజారా సెంచరీ కొట్టాడు.

టామ్ క్లార్క్‌తో కలిసి 112 పరుగులు కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు.  ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్ లో 163 బంతులు ఎదుర్కొన్న పుజారా 13 ఫోర్లు , ఒక సిక్స్ తో 115 పరుగులు చేశాడు.  ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లతో పుజారా టాప్స్ స్కోరర్ గా నిలవగా ఒలీవర్ కార్డర్ 41 పరుగులు తో తీసి పర్వాలేదనిపించాడు. అంతకు ముందు డర్హమ్ తన తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.  ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కి ముందు పుజారా అద్భుతమైన ఫామ్ లో ఉండటం, టీం ఇండియాకు కలిసి వచ్చే అంశం. ఆస్ట్రేలియా భారత్ మధ్య జూన్ 7వ తేదీన లండన్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఈసారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కప్ కొట్టాలనే పట్టుదలతో టీమిండియా  ఉంది.

డర్హమ్ చేసిన 376 పరుగులకు సమాధానంగా ససెక్స్ నాలుగు వికెట్లు కేవలం 91 పరుగులకే పడిపోయాయి. టీమిండియా నయా వాల్‌గా పేరుగాంచిన పుజారా ఈ శతాబ్దానికి సరికొత్త స్క్రిప్ట్ రాశాడు. పుజారా కెప్టెన్సీ ఇన్నింగ్స్ తర్వాత రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 332 పరుగులకు చేరుకుంది. మ్యాచ్ ఓడిపోతుందని అనుకున్న సమయానికి పుజారా తన సెంచరీతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేసాడు. ఇంగ్లీష్ గడ్డపై కౌంటీ క్రికెట్లో పుజారా బలమైన ప్రదర్శన కూడా ఈ జూన్‌లో అక్కడ జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు మంచి సంకేతంగా నిలిచింది. ఇంగ్లీష్ పరిస్థితుల్లో పుజారా చేసిన పరుగులు ఆస్ట్రేలియా బౌలర్లకు ఈ టీమిండియా గోడను బద్దలు కొట్టడం అంత సులువు కాదని చెప్పచ్చు. భారత్ మొదటిసారి టెస్ట్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.