వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పులు

అయితే ప్రస్తుతం భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్, అక్టోబర్ 15 నుంచి 14 కి మారినట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు కూడా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి డేట్, టైమింగ్ లో తప్పిస్తే ఇంకా వేరే వాటిలో మార్పు ఉండకపోవచ్చు అంటూ బీసీసీఐ స్పష్టం చేసింది. ఓడిఐ వరల్డ్ కప్: భారతదేశ ప్రజలు ముఖ్యంగా క్రికెట్ ప్రేమికులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మరింత ముందుకు జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని […]

Share:

అయితే ప్రస్తుతం భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్, అక్టోబర్ 15 నుంచి 14 కి మారినట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు కూడా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి డేట్, టైమింగ్ లో తప్పిస్తే ఇంకా వేరే వాటిలో మార్పు ఉండకపోవచ్చు అంటూ బీసీసీఐ స్పష్టం చేసింది.

ఓడిఐ వరల్డ్ కప్:

భారతదేశ ప్రజలు ముఖ్యంగా క్రికెట్ ప్రేమికులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మరింత ముందుకు జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి షెడ్యూల్లో మాత్రమే మార్పులు ఉంటాయని, బీసీసీఐ సెక్రటరీ జె షాహ్ స్పష్టం చేశారు.

అయితే మూడు క్రికెట్ బోర్డులు, వరల్డ్ కప్ షెడ్యూల్లో అడ్జస్ట్మెంట్ కోసం ఐసీసీ కి లేఖ రాసినట్లు, అందుకే ప్రస్తుతం డేట్ అలాగే టైమింగ్ లో మార్పులు వచ్చినట్లు బీసీసీఐ సెక్రెటరీ చెప్పారు. అయితే టైమింగ్ అలాగే డేట్ విషయంలో మార్పులు తర్వాత జరగబోయే మ్యాచ్ లకు మధ్యలో నాలుగు నుంచి ఐదు రోజులు గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే షెడ్యూల్లో మార్పుల కోసం ఐసీసీ మెంబర్స్ రిక్వెస్ట్ చేశారో వాళ్ళ వివరాలైతే బిసిసిఐ సెక్రటరీ ప్రస్తుతానికి అయితే వెల్లడించలేదు. 

నవరాత్రి పండుగ ఒక కారణం:

అయితే క్రికెట్ వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసేందుకు నవరాత్రి పండుగ కూడా ఒక కారణమని తెలుస్తోంది. అయితే అహ్మదాబాద్ లోకల్ పోలీస్ వారు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని, అక్టోబర్ 15న అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటుందని, వారి తరఫునుంచి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అక్టోబర్ 15వ రోజున నవరాత్రి పండుగ కూడా వచ్చినందువల్ల ఆరోజు రద్దీ అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఉద్దేశపడి, రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. 

అభిమానులలో కాస్త అసంతృప్తి:

అయితే ఇప్పటికే వరల్డ్ కప్ చూసేందుకు చాలా మంది అభిమానులు ప్రపంచ దేశాల నుండి వచ్చేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకున్నారు. అయితే అక్టోబర్ 15న ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం అభిమానులు ఫ్లైట్ టికెట్స్ అలాగే హోటల్ బుకింగ్స్ చేసుకోవడం కారణంగా, ఇప్పుడు వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసిన తర్వాత అభిమానులలో కాస్త అసంతృప్తి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ అలాగే హోటల్ విషయాలలో అభిమానులు కూడా మార్పులు చేసుకోవలసిన అవసరం ఉన్నందున, ఇబ్బందికి గురవుతున్నారు అభిమానులు.

చివరిసారిగా జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్:

పాకిస్థాన్ చివరిసారిగా 2016లో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌లో ఆడింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన 2019 ప్రపంచ కప్ సందర్భంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన చివరి ODI ఎన్‌కౌంటర్ ఇది, ఆ సమయంలో భరత్ పాకిస్తాన్ మీద భారీ విజయాన్ని సాధించింది. 

అయితే ఇప్పుడు అక్టోబర్లో జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కూడా కచ్చితంగా పాకిస్తాన్ మీద ఇండియా అత్యధికంగా రన్స్ చేసి విజయం సొంతం చేసుకుంటుందని అభిమానులు తమ అభిప్రాయాన్ని బయటపెడుతున్నారు. అయితే అక్టోబర్లో జరగనున్న మ్యాచ్ కోసం ఇప్పటినుంచే క్రికెటర్లు కసరత్తుల మొదలుపెట్టారు. అహ్మదాబాద్ లో జరగనున్న మ్యాచ్ చూడటానికి కనీసం లక్షలకు పైగా అభిమానులు రానున్నట్లు తెలుస్తుంది.