సచిన్ టెండూల్కర్.. బిల్ గేట్స్‌తో సమావేశం

ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మంగళవారం సమావేశం అయ్యారు. ముంబైలో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. బిల్ గేట్స్‌తో సమావేశమైన చిత్రాలను కూడా సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలి టెండూల్కర్ కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు ట్విట్టర్ లో షేర్ […]

Share:

ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మంగళవారం సమావేశం అయ్యారు. ముంబైలో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. బిల్ గేట్స్‌తో సమావేశమైన చిత్రాలను కూడా సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలి టెండూల్కర్ కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు ట్విట్టర్ లో షేర్ చేసిన ఫొటోలను బట్టి చూడవచ్చు.

ట్విట్టర్‌లో షేర్ చేసిన చిత్రాలకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్యాప్షన్ ఇలా రాశారు. ‘దాతృత్వం మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి మాట్లాడుకున్నాం. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్.. ఆర్థికంగా పేద నేపథ్యం పిల్లలకు సరైన ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. అని ట్విట్టర్ లో చేసిన పోస్టులో సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు.

మనమంతా జీవితాంతం విద్యార్థులమే: సచిన్ టెండూల్కర్

మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దీని గురించి ఇంకా మాట్లాడుతూ, ‘ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలకు మరిన్ని చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం చూపించవచ్చు. మా ఫౌండేషన్ పని చేస్తున్న పిల్లల ఆరోగ్య సంరక్షణతో సహా దాతృత్వంపై దృక్పథాన్ని పొందేందుకు ఈ రోజు ఒక గొప్ప అభ్యాస అవకాశం దొరికింది. ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘మనం అంతా జీవితాంతం విద్యార్థులమే. మీ అంతర్దృష్టికి ధన్యవాదాలు బిల్ గేట్స్. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఆలోచనలను పంచుకోవడం ఒక శక్తివంతమైన మార్గం. అని సచిన్ టెండూల్కర్ అన్నారు.

మేము కలిసి పని చేస్తూనే ఉంటాము: బిల్ గేట్స్

పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. పిల్లల ఆరోగ్య సంరక్షణను మెరుగు పరచడానికి సచిన్ టెండూల్కర్ చేసిన ప్రయత్నాలపై బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణలో మీ పని గురించి తెలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. నేను ఆశాజనకంగా ఉన్నాను. కలిసి పనిచేస్తే మనం ‘సెంచరీ ఆఫ్ డెవలప్‌మెంట్’ని సృష్టించగలము! అని బిల్ గేట్స్ అన్నారు. 

సోషల్ మీడియా యూజర్లు సచిన్ టెండూల్కర్, బిల్ గేట్స్ చిత్రాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక వినియోగదారు, ‘ఇద్దరు దిగ్గజాలు కలిసి’ అని రాశారు. కాగా ‘వావ్.. లెజెండ్స్‌ ఇన్‌ వన్‌ ఫ్రేమ్‌’ అని మరొకరు రాశారు. ఇంకొకరు మీరు ఇద్దరు ఇలా అనేక మంచి పనులు చేయాలి, మిమ్మల్ని చూసి అనేకమంది స్ఫూర్తి పొందాలి,  తద్వారా ప్రపంచంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు అనేక మంది ముందుకు రావాలి అని రాశారు. మరొకరు మిమ్మల్ని ఇద్దర్ని లెజెండ్లు అని పిలవడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు.. మీరు ఎక్కడున్నా లెజెండ్సే అంటూ రాశారు. లెజెండ్స్ ఎప్పుడూ లెజెండరీ పనుల గురించే ఆలోచిస్తారు. అందుకే వారు లెజెండ్స్ అయ్యారు అని మరొక యూజర్ కామెంట్ చేశాడు.

కోవిడ్ తర్వాత తొలిసారి భారత పర్యటన

బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సామాజిక మరియు ఆర్థిక సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పనులు చేస్తుంది. ఈ ఫౌండేషన్ సాయంతోనే సచిన్ మరియు బిల్ గేట్స్ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత బిల్ గేట్స్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.