తనకది ఎంతో ఆనందమని తెలిపిన కార్తిక్

టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ గురించి క్రికెట్ ప్రేమికులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దినేష్ కార్తిక్ అనగానే ఎవరికైనా సరే 2019 నిదాహస్ ట్రోఫీనే గుర్తుకు వస్తుంది. ఆ రోజు కనుక కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే.. ఇండియాకు ఓటమి తప్పేది కాదు. కానీ కార్తిక్ మెరుపు వేగంతో పరుగులు చేసి ఇండియాను గట్టెక్కించాడు. మొన్న జరిగిన టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో కూడా కార్తిక్ ఉన్నాడు. ధోనీ మానియా వల్ల కార్తిక్‌కు పెద్దగా అవకాశాలు […]

Share:

టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ గురించి క్రికెట్ ప్రేమికులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దినేష్ కార్తిక్ అనగానే ఎవరికైనా సరే 2019 నిదాహస్ ట్రోఫీనే గుర్తుకు వస్తుంది. ఆ రోజు కనుక కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే.. ఇండియాకు ఓటమి తప్పేది కాదు. కానీ కార్తిక్ మెరుపు వేగంతో పరుగులు చేసి ఇండియాను గట్టెక్కించాడు. మొన్న జరిగిన టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో కూడా కార్తిక్ ఉన్నాడు. ధోనీ మానియా వల్ల కార్తిక్‌కు పెద్దగా అవకాశాలు రాలేదని అందరూ ఒప్పుకుని తీరాల్సిన విషయం. కార్తిక్ కూడా చాలా సార్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆటగాడిగా అటో ఇటో కెరియర్ సాగుతుందనుకుంటే ఇతగాడి పర్సనల్ లైఫ్‌లో మరిన్ని ఆటుపోట్లు ఉన్నాయి. ఇతడి భార్య సహచర క్రికెటర్ మురళీ విజయ్‌ను వివాహం చేసుకుంది. మురళీ, దినేష్ కార్తిక్ ఇద్దరూ కూడా తమిళనాడు ఆటగాళ్లే కావడం విశేషం. 

తాను ఆస్వాదిస్తున్నాడు…. 

ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్న డీకే.. ఓ ప్రముఖ స్పోర్ట్స్ చానెల్‌లో క్రికెట్ కామెంటరీ ఇస్తున్నాడు. ఎంతో ఫన్నీగా డీకే కామెంటరీ ఉంటుంది. తన కామెంటరీ వెటరన్ క్రికెటర్ ధోనీకి కూడా నచ్చిందని దినేష్ తెలిపాడు. ఇక ప్రస్తుతం డీకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్-బ్యాటర్ గా ఉన్నాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న డీకే.. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కామెంటరీ చేస్తున్నాడు. 37 ఏళ్ల కార్తీక్ రాబోయే IPLలో బెంగళూరు కీపర్‌గా కనిపించనున్నాడు. తన కామెంటరీని ధోనీ కూడా ఆస్వాదించాడని.. ఈ వెటరన్ క్రికెటర్ ఇటీవల పేర్కొన్నాడు. ధోనీ ప్రశంసించడంతో తన కామెంటరీ తనకు కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందని దినేష్ తెలిపాడు. నేను చేస్తున్న కామెంటరీని ప్రస్తుతం ఆస్వాధిస్తున్నానని తెలిపాడు. గేమ్ గురించి విశ్లేషిస్తూ మాట్లాడటాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. అంతే కాకుండా క్రీడను చూస్తున్న ప్రతి ఒక్కరికీ అర్థవంతమైన విధంగా డీకే కామెంటరీ చేస్తాడు. జనాలు తన కామెంటరీని చూసేందుకు ఇష్టపడుతున్నారని.. వారికి మరింత అర్థమయ్యేలా మాట్లాడేందుకు (వివరించేందుకు) ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు.

హిట్టర్ రోల్‌లో

2022 సీజన్‌కు ముందు కార్తిక్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2022 నుంచి కార్తిక్ లైఫ్ మొత్తం టర్న్ అయింది. నేను ఎల్లప్పుడూ ఒక పరిస్థితిని నా స్వంత మార్గంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను, నేను అనుకున్న విధంగా దానిని వ్యక్తీకరించడానికి ప్రయత్నించానని, అని అతను RCB పోడ్‌కాస్ట్‌లో వివరించాడు. తన కామెంటరీనీ మెల్లమెల్లగా అర్థమయ్యేలా చెప్తున్నానని తెలిపాడు. తాను కనీసం ఊహించనని వ్యక్తి నుంచి అంటే MS ధోని నుంచి నాకు అతిపెద్ద ప్రశంసలు వచ్చాయని పేర్కొన్నాడు. ధోనీ తనకు కాల్ చేసి నీ కామెంటరీ బాగుంది అనడంతో దానిని నేను నిజంగా ఆస్వాదించానని తెలిపాడు. 

ధోనీకిష్టమైన కామెంటరీ.. 

దినేష్ కార్తిక్ ఈ మధ్య కామెంటరీ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇరవై సంవత్సరాల నుంచి బ్యాటు పట్టి మైదానంలో క్రికెట్‌తో అలరించిన కార్తిక్.. మరో సారి కామెంటేటర్ అవతారం ఎత్తాడు. ఆర్సీబీ నిర్వహించిన పాడ్ కాస్ట్‌లో అనేక విషయాలను పంచుకున్నాడు. కార్తిక్ చివరిసారి RCBతో ఆడిన సీజన్ లో పరుగుల వరద పారించాడు. ఈ ప్రదర్శనతో అతడికి టీ20 వరల్డ్ కప్‌కు వెళ్లే చాన్స్ వచ్చింది. ఇది అతనికి ఫినిషర్‌గా భారత జట్టులో చోటు సంపాదించి పెట్టింది. ఇక డీకే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. దాదాపు దశాబ్ద కాలంగా భారత బ్యాటింగ్ మాస్ట్రో ఆధిపత్యం అసమానమైనదని కార్తీక్ అన్నాడు.

విరాట్ గొప్ప తనం అదే

ఒక వ్యక్తిగా విరాట్ కోహ్లీ ఏమి సాధించాడని చాలా మంది అంటుంటారని.. అతను గత 10 సంవత్సరాలుగా జట్టును ముందుండి నడిపించాడు. దాదాపు ఒక దశాబ్దం పాటు అతని ఆధిపత్యం కొనసాగింది. అంతకు మించి ఒక వ్యక్తి ఏమీ చేయనవసరం లేదని కార్తిక్ తెలిపాడు. మూడు వేరు వేరు ఫార్మాట్‌లు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలన్నాడు. అంతే కాకుండా మూడు ఫార్మాట్లలో ఆడటం చాలా కషమని.. అటువంటిది విరాట్‌కు అన్ని ఫార్మాట్లలో 50 సగటు ఉండడం గొప్ప విషయమని చెప్పాడు.