టీమిండియాకు షాక్.. శుభ్‌మన్ గిల్‌కు డెంగ్యూ..

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ను ఈసారి ఎలాగైన కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అక్టోబర్‌ ఎనిమిదిన అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌, కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో పోరుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. కంగారులతో మ్యాచ్‌కు అంతా సిద్ధమే అని భావిస్తున్న వేళ రోహిత్‌ సేనకు పెద్ద షాక్‌ తగిలేలా ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్‌ డెంగీ బారినపడ్డట్లు తెలుస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఎక్కువ పరుగులు సాధించే ఆటగాడిగా గిల్‌ నిలుస్తాడని అంచనాలు ఉన్న వేళ శుభ్‌మన్‌ […]

Share:

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ను ఈసారి ఎలాగైన కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అక్టోబర్‌ ఎనిమిదిన అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌, కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో పోరుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. కంగారులతో మ్యాచ్‌కు అంతా సిద్ధమే అని భావిస్తున్న వేళ రోహిత్‌ సేనకు పెద్ద షాక్‌ తగిలేలా ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్‌ డెంగీ బారినపడ్డట్లు తెలుస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఎక్కువ పరుగులు సాధించే ఆటగాడిగా గిల్‌ నిలుస్తాడని అంచనాలు ఉన్న వేళ శుభ్‌మన్‌ డెంగీ బారిన పడడం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తొలి మ్యాచ్‌ను ఘన విజయంతో ప్రారంభించాలని భావిస్తున్న భారత జట్టుకు గిల్‌కు డెంగి సోకిందన్న వార్త కలవరానికి గురి చేస్తోంది.

ఒకవేళ శుభ్‌మన్‌గిల్‌కు డెంగీ సోకిందన్న వార్త నిజమే అయితే ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు ఈ ఓపెనర్‌ దూరంగా ఉండే అవకాశం ఉంది. గిల్‌కు డెంగీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చిందని, ప్రస్తుతం శుభ్‌మన్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇవాళ గిల్‌కు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారని, అతడు కోలుకోకపోతే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరమైనట్లేనని వెల్లడించాయి. ప్రపంచకప్‌నకు ముందు జరగాల్సిన రెండు వామప్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దవడంతో శుభ్‌మన్ గిల్ ఫీల్డ్‌లో కనిపించలేదు. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న గిల్‌ వన్డేల్లో 1,230 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించాడు. మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌ దూరమవ్వడం భారత్‌కు ఎదురుదెబ్బే అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. 

గిల్‌ దూరమైతే అతని స్థానంలో ఓపెనర్‌గా ఎవరూ బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. గిల్‌ స్థానంలో కె.ఎల్‌. రాహుల్‌ లేకపోతే ఇషాన్‌ కిషన్‌ను బరిలోకి దింపాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తున్నట్టు తెలస్తుంది. లెఫ్ట్‌, రైట్‌ హ్యాండ్‌ కాంబినేషన్లకు ప్రాధాన్యమిస్తే రోహిత్ శర్మతో కలిసి ఇషాన్‌ కిషన్‌.. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. రాహుల్‌ 16 వన్డే మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోగి దిగగా 669 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాబట్టి రాహుల్‌నే రోహిత్‌తో ఓపెనర్‌గా బరిలోకి దింపే ఆలోచన కూడా చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌ ఆడనున్న టీమిండియా ఆక్టోబర్‌ 14న దాయాది దేశం పాకిస్థాన్‌తో రెండో మ్యాచ్‌ ఆడనుంది. ఈ హైటెన్షన్‌ పోరుకు భారత్ సిద్ధమవ్వాల్సి ఉంది. ఈ తరుణంలో గిల్‌ డెంగీ బారినపడడం ఆందోళనకు గురిచేస్తోంది.

రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో జరిగే ఈ ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌ కీలకం కావడంతో భారత్‌ ఏ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని భావిస్తోంది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో అధికంగా గెలిచి ఎలాంటి అవరోధాలు లేకుండా సెమీస్‌ చేరాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. ఇప్పటికే వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా… స్వదేశంలో మూడోసారి ప్రపంచకప్‌ అందుకోవాలన్న తలంపుతో ఉంది.

బ్యాటింగ్ విభాగం

కెప్టెన్​ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ, ఆల్​ రౌండర్ రవీంద్ర జడేజా లాంటి సీనియర్​ ఆటగాళ్ల మార్గదర్శకంలో టీమ్ఇండియా బలంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఫిట్​గా ఉన్న కోహ్లీ.. తన శతకాల వేటను కొనసాగించే అవకాశం ఉంది. తన పుల్​, కట్​ షాట్​లతో బౌండరీలు దాటించేందుకు రోహిత్​ సైతం సిద్ధంగానే ఉన్నాడు. మిస్టర్ 360గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్​, కేఎల్ రాహుల్​, శ్రేయస్ అయ్యర్​, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్​, రవీంద్ర జడేజాతో బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది. 

బౌలింగ్ విభాగం

కొద్ది రోజులుగా తడబాటులో ఉన్న బౌలింగ్ విభాగం పూర్తి సన్నద్ధతతో కనిపిస్తోంది. ఆరు నెలల సుదీర్ఘ విశ్రాంతి అనంతరం టీమ్​లోకి వచ్చిన స్టార్ బౌలర్ బూమ్రా.. తొలి మ్యాచ్​లోనే అదరగొట్టి అదుర్స్ అనిపించాడు. ఆసియా కప్​లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో తన పరాక్రమాన్ని చూపించిన సిరాజ్​.. నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. మహ్మద్ షమీ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​, కుల్దీప్​ యాదవ్​తో బౌలింగ్ పటిష్ఠంగా ఉంది. ఆల్​రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య కూడా ఉండడం భారత్​కు కలిసొచ్చే అంశం.