ఇన్‌స్టాగ్రామ్ బయో చేంజ్ చేసిన భువ‌నేశ్వ‌ర్ కుమార్

టీమిండియా భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది. టీమిండియా తరపున బెస్ట్ స్వింగ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం చేసిన తొలి బంతికే వికెట్ తీసి తన ఎంట్రీని ని గ్రాండ్ గా చాటుకున్నాడు… . ఆ తర్వాత స్వింగ్ కింగ్ గా భారత క్రికెట్ లో కొన్నేళ్లు తన హవా చూపించాడు. క్రమంగా మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ గా మారిన […]

Share:

టీమిండియా భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది.

టీమిండియా తరపున బెస్ట్ స్వింగ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం చేసిన తొలి బంతికే వికెట్ తీసి తన ఎంట్రీని ని గ్రాండ్ గా చాటుకున్నాడు… . ఆ తర్వాత స్వింగ్ కింగ్ గా భారత క్రికెట్ లో కొన్నేళ్లు తన హవా చూపించాడు. క్రమంగా మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ గా మారిన భువీ.. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయడమే కాదు నకుల్ బాల్ తో బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఇక ఐపీఎల్ లో అయితే ఈ స్వింగ్ బౌలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాణ్యమైన బౌలింగ్ తో ఎప్పుడూ పర్పుల్ క్యాప్ క్యాప్ రేస్ లో ఉంటాడు. ఎంతో మందికి ఫేవరేట్ బౌలర్ గా మారిన భువనేశ్వర్ తాజాగా తన రిటైర్మెంట్ విషయంపై సంకేతమిచ్చాడు.

నవంబర్ 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో భువనేశ్వర్ కుమార్ చోటు దక్కించుకున్నాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన భువీ 3 వికెట్లు పడగొట్టాడు. నేపియర్ వేదికగా న్యూజిలాండ్‌తో చివరి టీ20 మ్యాచ్ ఆడిన భువీ.. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు అతణ్ని పక్కనబెట్టారు. ఈ ఏడాది బీసీసీఐ కాంట్రాక్ట్‌లోనూ భువీ పేరు కనిపించలేదు. త్వరలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లోనూ బీసీసీఐ అతణ్ని భాగం చేయలేదు. 

ఇంస్టాగ్రామ్ బయో మార్చేశారు…..

భువీ ఇన్‌స్టా ఖాతాలో ‘ఇండియన్ క్రికెటర్’ అని ఉండేది. కానీ   అతడు తాజాగా ‘క్రికెటర్’ అన్న పదాన్ని తొలగించి కేవలం ‘ఇండియన్’ను మాత్రమే ఉంచాడు.  దీంతో అభిమానుల్లో  భువీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడన్న ఆందోళనలు మొదలయ్యాయి. భువీ  బయోను ఎడిట్ చేయకముందు, చేసిన తర్వాత స్క్రీన్ షాట్స్ వైరల్ అవడంతో  సోషల్ మీడియాలో ఈ చర్చ మొదలైంది.  

 33 ఏండ్ల భువీ.. భారత జట్టు తరఫున చివరిసారి  2022 టీ20 వరల్డ్ కప్‌లో ఆడాడు.  ఆ తర్వాత  ఆలిండియా సెలక్షన్ కమిటీ  సీనియర్లు   రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ వంటి సీనియర్ ఆటగాళ్లను పక్కనబెట్టిన విషయం తెలిసిందే.  ఈ జాబితాలో  భువీ కూడా ఉన్నాడు. టెస్టులు, వన్డేలలో  సెలక్టర్లు భువీని ఎప్పుడో పక్కనబెట్టిన విషయం తెలిసిందే. టీ20లలో  కూడా  అతడిని  జాతీయ జట్టులోకి తీసుకోవడం కష్టమే అని తేలడంతో  ఇక అతడు  అంతర్జాతీయ స్థాయి నుంచి తప్పుకోవడమే బెటర్ అన్న  వాదనలు వినిపించాయి. అదీగాక టీ20లలో అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి వంటి యువ బౌలర్లకు అవకాశాలు ఇచ్చేందుకు టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. 

 

భారత్ తరఫున 21 టెస్టుల్లో 61 వికెట్లు,117 వన్డేల్లో 132 వికెట్లు, 48 టీ20ల్లో 49 వికెట్లు పడగొట్టాడు. మూడు ఫార్మాట్ లలో 5 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్ భువీనే కావడం విశేషం. ఐర్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు భువీ గుడ్ బై చెబుతాడని తెలుస్తోంది. అయితే భువీ అభిమానులు మాత్రం బీసీసీఐ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పని తాను చేసు పోయేవాళ్ళని బీసీసీఐ గుర్తించరని విచారం వ్యక్తం చేస్తున్నారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్లో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని.. అతడు భారత అత్యుత్తమ బౌలర్లలో ఒకడని ఈ సందర్భంగా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.