బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2023

చెన్నై సూపర్ కింగ్స్ కు ఆ ప్లేయర్ భారీ షాక్ ఐపీఎల్ ఫైనల్ కు దూరం కానున్న బెన్ స్టోక్స్ లార్డ్స్‌లో ఐర్లాండ్‌తో జరిగే టెస్టుకు సిద్ధమయ్యే క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ఈ నాలుగు రోజుల టెస్ట్ యాషెస్‌కు ముందు ఇంగ్లాండ్ ఆడే చివరి టెస్ట్. అలాగే IPL ఫైనల్ ముగిసిన నాలుగు రోజుకే అంటే జూన్ 1నే ఈ టెస్ట్ ప్రారంభమవుతుంది. […]

Share:

చెన్నై సూపర్ కింగ్స్ కు ఆ ప్లేయర్ భారీ షాక్

ఐపీఎల్ ఫైనల్ కు దూరం కానున్న బెన్ స్టోక్స్

లార్డ్స్‌లో ఐర్లాండ్‌తో జరిగే టెస్టుకు సిద్ధమయ్యే క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ఈ నాలుగు రోజుల టెస్ట్ యాషెస్‌కు ముందు ఇంగ్లాండ్ ఆడే చివరి టెస్ట్. అలాగే IPL ఫైనల్ ముగిసిన నాలుగు రోజుకే అంటే జూన్ 1నే ఈ టెస్ట్ ప్రారంభమవుతుంది. దీంతో స్టోక్స్ ఐపీఎల్ చివరి మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు. డిసెంబర్ వేలంలో ఆల్ రౌండర్ స్టోక్స్ని చెన్నై సూపర్ కింగ్స్ £ 1.6 మిలియన్లకు కొనుగోలు చేసింది. దీనిపై స్టోక్స్ మాట్లాడుతూ.. నేను ఐపీఎల్ నుంచి తిరిగి రావడానికి మరియు ఐర్లాండ్ గేమ్ ఆడటానికి మధ్య తగినంత సమయం కేటాయించుకునేలా చూసుకుంటాను అని స్టోక్స్ చెప్పాడు.

జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో మరియు జో రూట్‌లు మార్చి 31 నుండి మే 28 వరకు జరిగే IPLలో పాల్గొనే ఇంగ్లండ్ టెస్ట్ జట్టులోని ఇతర సభ్యులు. గత ఏడాది న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ మే 29న ఐపీఎల్ ఫైనల్‌లో ఆడడం నుంచి నాలుగు రోజుల తర్వాత లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టుకు వెళ్లాడు.

జూన్ 16న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న సిరీస్‌కు సిద్ధంగా ఉండేందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఏం చేయాలని భావిస్తున్నారో వారితో చర్చిస్తానని స్టోక్స్ చెప్పాడు.

“వేసవిలో జరిగే ఆ ఐదు గేమ్‌లు చాలా పెద్దవి. కుర్రాళ్లకు ఏమి కావాలో వారే ఆలోచించాలి” అని స్టోక్స్ అన్నాడు.

“ఐర్లాండ్ గేమ్‌లో ఏదైనా జరగితే యాషెస్ కోసం జట్టులోని ఎవరినైనా ఆటగాడిని కోల్పోతామా అని కూడా మీరు ఆలోచించాలి. ఐర్లాండ్ మ్యాచ్ లో ఆడాలా లేదా ఆటగాళ్లు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఏది ముఖ్యమో వాళ్లకే తెలుసు. 2022 ఎడిషన్‌ లో స్టోక్స్ ఆడలేదు. ఆ  తర్వాత స్టోక్స్ ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్‌కి తిరిగి రానున్నాడు.

2021లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన అతని చివరి గేమ్‌లో వేలి గాయం తలెత్తింది. దీంతో చివరికి రెండు ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. దీంతో ఆ సంవత్సరం చివర్లో క్రికెట్ నుండి కొంత కాలం పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది.

శుక్రవారం న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ రెండో టెస్టుకు ముందు వెల్లింగ్టన్‌లో స్టోక్స్ మాట్లాడాడు. మౌంట్ మౌంగానుయ్‌లో జరిగిన తొలి టెస్టులో 267 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండు ఆటగాళ్లు చూస్తున్నారు. ఇది వారి ఆరో వరుస విజయం. బేసిన్ రిజర్వ్‌లో స్టోక్స్ సేన గెలిస్తే 19 ఏళ్లలో ఇంగ్లండ్ వరుసగా ఏడు టెస్టుల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి.

“మేము ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇక్కడ నుండి రెండో టెస్టుకి బయలుదేరుతాము అని స్టోక్స్ చెప్పాడు. నాలుగు వారాలు చాలా బాగా గడిచాయి. పిచ్‌లో మరియు బయటా మేము గొప్ప సమయాన్ని గడిపాము. ఫలితంతో సంబంధం లేకుండా మేము మంచి ఉత్సాహంతో బయలుదేరాము. అలాగే వేసవిలో యాషెస్ కోసం ఎదురుచూస్తాము.

ఆదివారం ముగిసిన తొలి టెస్టులో వేగంగా పుంజుకున్న ఇంగ్లాండ్ పేస్ బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ మరియు ఆలీ రాబిన్సన్‌లు ఫిట్‌నెస్ సాధించారు.