ఇంగ్లాడ్ క్రికెటర్ బెన్ స్ట్రోక్ కొత్త రికార్డు

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్, ఆ మ్యాచ్లో తొలి సిక్స్ కొట్టిన వెంటనే చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. స్టోక్స్ తన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ క్రికెట్‌లో ఇయాన్‌ బోథమ్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తర్వాత ఆ రేంజ్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన ఆటగాడు బెన్‌ స్టోక్స్‌. ఈ మధ్యే కెప్టెన్‌గా కూడా ప్రమోషన్‌ పొందిన ఈ క్రికెటర్ టెస్టుల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టు […]

Share:

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్, ఆ మ్యాచ్లో తొలి సిక్స్ కొట్టిన వెంటనే చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. స్టోక్స్ తన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఇంగ్లాండ్ క్రికెట్‌లో ఇయాన్‌ బోథమ్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తర్వాత ఆ రేంజ్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన ఆటగాడు బెన్‌ స్టోక్స్‌. ఈ మధ్యే కెప్టెన్‌గా కూడా ప్రమోషన్‌ పొందిన ఈ క్రికెటర్ టెస్టుల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును తన పేరిట లిఖించుకుని చరిత్ర సృష్టించాడు.  109 సిక్సర్లతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో అతడు న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెక్ కల్లమ్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 

టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాట్స్‌మెన్

మెకల్లమ్ 101 మ్యాచుల్లో 107 సిక్సులు కొడితే.. స్టోక్స్ మాత్రం 90 మ్యాచుల్లో 109 సిక్సులు కొట్టి ఈ జాబితాలో టాప్ ప్లేసులోకి వెళ్లిపోయాడు. ఇక తర్వాతి స్థానాల్లో గేల్ (100), ఆడమ్ గిల్ క్రిస్ట్ (98), జాక్వెస్ కల్లీస్ (97) వరసగా ఉన్నాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే న్యూజిలాండ్ కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాటర్‌గా ఆటలో వేగం తీసుకొచ్చిన మెకల్లమ్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ ప్రధాన కోచ్‌‌గా ఉన్నాడు. అతడు వచ్చిన తర్వాత 10 టెస్టుల్లో 9 మ్యాచుల్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం టెస్టు ఛాంపియన్ షిప్ టేబుల్‌లో 124 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. 90వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బెన్ స్టోక్స్ 12 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 5,652 పరుగులు చేశాడు. 

రికార్డు బ్రేక్ చేసిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌ వైపు చూస్తూ బెన్ స్టోక్స్ సిగ్నల్ ఇచ్చాడు. అక్కడ మెకల్లమ్ చిరునవ్వు నవ్వుతూ చప్పట్లు కొడుతూ కనిపించాడు.

బెన్ స్టోక్స్ పెర్ఫార్మన్స్

ఇంగ్లాండ్ టీమ్ గురించి చెప్పుకుంటే ఓ ఆరేడేళ్ల ముందు వరకు చాలా నిదానంగా ఆడేది. ఎప్పుడైతే తమ గేమ్‌లో వేగం పెంచారో అప్పటి నుండి మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. టీ20ల్లో ఎలా ఆడతారో వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ కూడా అలానే ఆడుతూ ప్రత్యర్థి జట్లను భయపెడుతోంది. అంతెందుకు ఈ టెస్టునే తీసుకుంటే.. తొలి ఇన్నింగ్స్‌లో 58.2 ఓవర్లలో 325-9 పరుగులు చేసింది. అదే స్కోరు దగ్గర డిక్లేర్ చేసింది. ఈ పరుగులన్నీ కూడా టెస్టు ప్రారంభమైన తొలిరోజే చేయడం విశేషం. రెండో ఇన్నింగ్స్ లో కూడా అలానే ఆడింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి రెండు టెస్టుల్లోనూ కూడా విజయం సాధించింది. ఈ విజయాల్లో కూడా  స్టోక్స్‌ కీలకపాత్ర పోషించాడు. తొలి టెస్ట్‌లో రూట్‌తో కలిసి, రెండో టెస్ట్‌లో బెయిర్‌స్టోతో ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా రెండో టెస్ట్‌లో బెయిర్‌స్టో, స్టోక్స్‌ కలిసి సృష్టించిన విధ్వంసంతో చివరి రోజు ఇంగ్లండ్‌ అనూహ్య విజయం సాధించింది.

ఐదు రోజుల టెస్టు క్రికెట్ అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫార్మాట్. టీ20లు వచ్చిన తర్వాత దీనికి ఆదరణ కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ రీసెంట్ టైంలో టెస్టుల్లో కూడా వేగం పెరిగింది. స్టార్ బ్యాటర్ల దగ్గర నుంచి టెయింలెండర్ల వరకు ప్రతి ఒక్కరూ రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ చేస్తున్నారు. అలా స్టోక్స్ కూడా తాజాగా ఓవల్‌‌లో జరుగుతున్న ఈ టెస్టులో ఓ మాదిరిగా ఆడాడు. కానీ సిక్సుల విషయంలో మాత్రం సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో వైరల్‌గా మారింది.