వ‌ర‌ల్డ్ క‌ప్ టీంను ఫైన‌లైజ్ చేసిన బీసీసీఐ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి ఉన్న పవర్స్ అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలోని అత్యధిక ధనవంతమైన బోర్డుల లిస్టులో బీసీసీఐ మొదటి స్థానంలో ఉటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి బోర్డు ఏదైనా మేజర్ టోర్నీకి జట్టును ప్రకటిస్తుందంటే చాలు చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. అందుకోసమే బోర్డు జాబితాను ప్రకటించే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా కానీ మొదటికే మోసం వస్తుందని అంతా […]

Share:

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి ఉన్న పవర్స్ అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలోని అత్యధిక ధనవంతమైన బోర్డుల లిస్టులో బీసీసీఐ మొదటి స్థానంలో ఉటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి బోర్డు ఏదైనా మేజర్ టోర్నీకి జట్టును ప్రకటిస్తుందంటే చాలు చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. అందుకోసమే బోర్డు జాబితాను ప్రకటించే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా కానీ మొదటికే మోసం వస్తుందని అంతా భావిస్తుంటారు. అటువంటి భారత జట్టులో చోటు దక్కించునేందుకు చాలా మంది పోటీ పడుతుంటారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కానీ కొంత మంది స్టార్స్ ను మాత్రం బోర్డు కన్సిడర్ చేస్తూ ఉంటుంది. వారి విషయంలో చాలా మంది వాదనలను పక్కన పెట్టి మరీ బోర్డు వారిని జట్టులోకి తీసుకుంటుంది. 

15 మంది జట్టును ప్రకటించిన బోర్డు

ఆసియా కప్ ఆడుతున్న జట్టునే కాకుండా త్వరలో జరగబోయే వరల్డ్ కప్ కు కూడా బోర్డు క్రికెట్ జట్టును ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం ఆడుతున్న ఆసియా కప్ స్క్వాడ్ నే కొనసాగించారు. కానీ కొద్ది మార్పులు చేశారు. చాలా రోజుల నుంచి గాయంతో ఎన్సీఏ లో రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను బోర్డు మళ్లీ జట్టులోకి తీసుకుంది. మొన్న ఆసియా కప్ మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాతే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 11 మందితో కూడిన జట్టు వస్తుందని అంతా అంటున్నారు. ఈ జట్టు ప్రకటన ముందే ఉండాల్సి ఉన్నా కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో పలువురు క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. కానీ కొంత మంది మాత్రం ఇదే జట్టు కదా అందులో సస్పెన్స్ ఏం ఉందని కామెంట్ చేస్తున్నారు. 

వారికి నిరాశే… 

టీమిండియా ఆసియా కప్ ఆడుతున్న యువ ఆటగాడు తిలక్ వర్మ, యంగ్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ, కేరళ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ కు వరల్డ్ కప్ లో నిరాశే ఎదురైంది. ఆసియా కప్ రిజర్వ్ ప్లేయర్ గా ఉన్న సంజూ శాంసన్ స్థానంలో బోర్డు ఎవర్ని కూడా ప్రకటించలేదు. ఎన్సీఏలో చికిత్స పొందుతున్న రాహుల్ ను బోర్డు విశ్వసించింది. అతడు ఆసియా కప్ స్వ్కాడ్ లో ఉన్నా కానీ మొదటి మ్యాచ్ కు అం దుబాటులో లేడు. నేపాల్ తో జరిగే రెండో మ్యాచ్ కు రాహుల్ అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో రాహుల్ ను బీసీసీఐ సెలెక్ట్ చేయడం కొందరు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. దీంతో బీసీసీఐ మీద కేఎల్ రాహుల్ మీద విమర్శలు చేసుకుంటూ మెస్సేజెస్ చేస్తున్నారు. 

యంగ్ వర్మకు నిరాశే ఎదురు

మన హైదరాబాదీ కుర్రాడు యంగ్ తిలక్ వర్మ మొన్నే జట్టులోకి వచ్చి ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. దీంతో అందరూ అతడిని ఆసియా కప్ కు కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారని అనుకున్నారు. అనుకున్నట్లుగానే సెలెక్టర్లు మనోడిని ఆసియా కప్ స్వ్కాడ్ లో జత చేశారు. ఇక అంతే కాకుండా అతడికి వరల్డ్ కప్ బెర్త్ కూడా కన్ఫామ్ అని అంతా ఊహించేసుకున్నారు. మనోడికి ఆసియా కప్ బెర్త్ ఇచ్చిన సెలెక్టర్లు వరల్డ్ కప్ బెర్త్ ఇచ్చేందుకు మాత్రం సుముఖత చూపలేదు. మొదటి మ్యాచ్ లో పాక్ తో అర్ధ సెంచరీ చేసి జట్టును ఆదుకున్న యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను సెలెక్ట్ చేశారు. మరో పక్క సీనియర్ స్టార్ బ్యాటర్ రాహుల్ ఎలాగూ కీపింగ్ ఆప్షన్ గా ఉన్నాడని అనుకున్న సెలెక్టర్లు మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పట్ల మొగ్గు చూపలేదు. దీనిపై సంజూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతటి రాజకీయాలు చేస్తారా అని మండిపడుతున్నారు.