బ్యాటర్లు ఇంకా బాధ్యతగా ఆడాల్సింది: హార్దిక్‌ పాండ్యా

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇండియా ప్రదర్శనపై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన ఏ మాత్రం సంతోషించని విధంగా ఉందని ఆదివారం పేర్కొన్నారు. బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడాల్సి ఉండేదన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 155/8 చేయగా, ఇండియా 152/7 మాత్రమే చేసింది. చిన్న లక్ష్యాన్ని కూడా చేధించలేక ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఇండియా మరోసారి అధ్వాన్నమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చింది. ఆతిథ్య […]

Share:

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇండియా ప్రదర్శనపై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన ఏ మాత్రం సంతోషించని విధంగా ఉందని ఆదివారం పేర్కొన్నారు. బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడాల్సి ఉండేదన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 155/8 చేయగా, ఇండియా 152/7 మాత్రమే చేసింది. చిన్న లక్ష్యాన్ని కూడా చేధించలేక ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఇండియా మరోసారి అధ్వాన్నమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చింది. ఆతిథ్య జట్టు రెండు వికెట్ల తేడాతో గెలుపొందడంతో భారత్‌ పేలమైన ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. కాగా, మొదటి టీ20లో ఇండియా 145/9 కంటే రెండో టీ20లో కాస్త మెరుగ్గా ఆడిందని చెప్పవచ్చు.

ఐదు టీ20 సీరిస్‌ మ్యాచ్‌లో వరుసగా ఇండియా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంపై మ్యాచ్ అనంతరం కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడాడు. ‘‘నేను హానెస్ట్‌ గా ఉంటే అది మంచి బ్యాటింగ్‌ ప్రదర్శనను రాబట్టుకోలేను. అయితే, ఒకవైపు వికెట్లు పడిపోతున్నాయి. ట్రాక్‌ రికార్డ్‌ స్లోగా ఉంది. మేము ఇంకా మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాల్సి ఉండేది. ఒకవేళ అలాచేసి ఉంటే 160 ప్లస్‌ లేదా 170 వరకు కొట్టేవాళ్లం. జట్టులోని బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నాడు. ‘‘ప్రస్తుత జట్టులో మేము మా టాప్‌ సెవెన్‌ బ్యాటర్లను బాగా నమ్మాలి. వారిని ఆడించాలి. బౌలర్లు మీ ఆట తీరుతో గెలుస్తారని ఆశిస్తున్నాను. మేము సరైన బ్యాలెన్స్‌ కలిగి ఉన్నామని చెప్పడానికి కొత్త మార్గాలను కనుగొనాలి. అదే సమయంలో బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడాలి” అని హార్దిక్‌ సూచించాడు. తిలక్ వర్మ తన అరంగేట్రం సిరీస్‌లో ఆడుతూ భారత్‌కు ఎక్కువ పరుగులు చేశాడు. అతను బ్యాటింగ్‌ చేస్తున్న విధానం చూస్తున్నాం. యువకులు ఆత్మ విశ్వాసంతో , నిర్భయంగా వస్తున్నారు.

2-0 తో వెనకబడిన టీమ్ ఇండియా 

శుభమన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ పరుగులు చేయడంలో విఫలమవడంతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0–2తో వెనుకబడింది. కాగా, ఇండియాపై వరుసగా రెండో టీ20 కూడా గెలవడంపై వెస్టిండీస్‌ కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మేము చాలా గుడ్‌ పొజిషన్‌లో ఉన్నామని, ఇదే విధంగా మిగతా మ్యాచ్‌లు కూడా ఆడేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.

కాగా, వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఇండియా 0–2 తేడాతో వెనుకబడి ఉంది. వరుస రెండు మ్యాచుల్లోనూ ఓడిపోవడంతో సిరీస్‌ను ప్రమాదంలో పడేసింది. మూడో టీ20లోనైనా గెలిచి రేసులో నిలుస్తుందో లేదో చూడాలి. వెస్టిండీస్‌తో భారత్‌ ఆటగాళ్ల ప్రదర్శన నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ పాండ్యా.. తొలిసారే గుజరాత్‌ టైటాన్స్‌ ను చాంపియన్స్‌ గా నిలిపాడు. అయితే, ఇప్పుడు విండీస్‌తో సిరీస్‌లో మాత్రం అతను తీసుకుంటున్ననిర్ణయాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు మూడో మ్యాచులోనైనా తప్పులు సరిదిద్దుకొని బరిలోకి దిగి, కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. లేకపోతే, సిరీస్‌ రేస్‌ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి  ఏర్పడింది. 

కాగా, మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ ఇండియాకు కీలక బ్యాటర్‌‌గా మారిన శుభ్‌మన్‌ గిల్‌ విండీస్‌ సిరీస్‌లో మాత్రం తేలిపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో 3, రెండో మ్యాచ్‌లో 7 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. నాణ్యమైన బౌలింగ్ వేస్తున్న యుజ్వేంద్ర చాహల్‌తో పూర్తి ఓవర్లను హార్దిక్‌ వేయించలేదు. అక్షర్‌‌ పటేల్‌ను తీసుకున్నప్పటికీ అతడికి బౌలింగ్‌ ఇవ్వలేదు. అసలు రాణించకలేక పోతున్న ముఖేశ్‌ కుమార్‌‌తో మాత్రం బౌలింగ్‌ చేయించాడు. హార్దిక్‌ కూడా వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులను నియంత్రించడంలో విఫలం అవుతున్నాడు. మూడో టీ20లోనైనా మంచి ప్రదర్శన ఇచ్చిగెలవడానికి టీమ్‌ ఇండియా ప్రయత్నిస్తోంది.