బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబుల్ హసన్ ఆటలోనే కాదు, రాజకీయాల్లోనూ భేష్ అనిపించుకున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన సాధారణ ఎన్నికల్లో షకీబ్ అల్ హసన్ ఘన విజయం సాధించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ అధికార అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా-1 నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్‌పై షకీబ్ అల్ హసన్ 1,50,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో హుస్సేన్‌కు 45,993 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇన్నాళ్లు మైదానంలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబ్ ప్రజాజీవితంలో భాగం కానున్నాడు. వన్డే వరల్డ్ కప్ అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టిన అతడు.. తొలిసారే సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) ఘన విజయం సాధించాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మగుర 1(Magura 1) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షకీబ్ భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఇక బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఎంపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్ రెండో కెప్టెన్‌గా ఎంపీగా షకీబ్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ముష్రఫే ముర్తాజా(Musharfe Mortaza) ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఎంపీగా గెలిచిన వెంటనే వివాదంలోకి
షకీబుల్ హసన్ తాజాగా ఎంపీగా గెలిచిన తర్వాత వార్తల్లోకి ఎక్కాడు. ఓ అభిమానిని కొట్టడం వివాదాస్పదం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక బంగ్లా సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీకి భారీ మెజార్టీ లభించింది. 300 సీట్లకు గాను ఆ పార్టీ ఏకంగా 200 సీట్లను గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. మరి షకీబ్ అభిమానిని కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
షకీబ్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నానని ప్రకటించగానే అతడి క్రికెట్ కెరీర్ ముగిసిందని కొందరు ప్రచారం మొదలెట్టారు. దాంతో, వాళ్లకు చెక్ పెట్టేందుకు అతడు ప్రచార సభల్లో జనాన్ని అడిగాడు. ‘నేను రిటైర్ అవ్వాలా? ‘అని ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అడిగిన షకీబ్.. ‘నేను ఇంకా క్రికెట్‌కు వీడ్కోలు పలకలేదు. అలాంటప్పుడు ఈ వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారు’ అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. 19 ఏండ్లకే ప్రీమియర్ స్పోర్ట్స్ అకాడమీలో చేరిన షకీబ్ 2006లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే ప్రపంచంలోని ఉత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఎదిగాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన తొలి ఆల్‌రౌండర్‌గా షకీబ్ గుర్తింపు సాధించాడు.
ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 66 టెస్టులు, 247 వన్డేలు, 117 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 39 సగటుతో 4,454 పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్‌లో 233 వికెట్లు పడగొట్టాడు. 247 వన్డేల్లో 37 సగటుతో 7,570 పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్‌లో 317 వికెట్లు తీశాడు. టీ20ల్లో 23 సగటుతో 2,382 పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్‌లో 140 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.