PCB: కొట్టుకున్న పాకిస్థాన్ ప్లేయర్స్.. పీసీబీ రియాక్షన్ ఇదీ

పాకిస్థాన్ టీమ్(Pakistan Team) ప్లేయర్స్ కొట్టుకున్నారా? వాళ్ల కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam)పై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందా? పాక్ మీడియాలో వచ్చిన ఈ కథనాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పందించింది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ లో ఇద్దరు ప్లేయర్స్ కొట్టుకున్నారన్న వార్త కలకలం రేపుతోంది. వరల్డ్ కప్ 2023లో వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు పాక్ మీడియా(Pak Media) వెల్లడించింది. దీనిపై తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) […]

Share:

పాకిస్థాన్ టీమ్(Pakistan Team) ప్లేయర్స్ కొట్టుకున్నారా? వాళ్ల కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam)పై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందా? పాక్ మీడియాలో వచ్చిన ఈ కథనాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పందించింది.

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ లో ఇద్దరు ప్లేయర్స్ కొట్టుకున్నారన్న వార్త కలకలం రేపుతోంది. వరల్డ్ కప్ 2023లో వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు పాక్ మీడియా(Pak Media) వెల్లడించింది. దీనిపై తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సోషల్ మీడియా ఎక్స్ ద్వారా స్పందించింది. మీడియా ఇలాంటి పుకార్లు మానుకోవాలని సూచించింది.

ఇండియా, ఆస్ట్రేలియా చేతుల్లో పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో బాబర్ ఆజం కెప్టెన్సీ(Babar Azam’s captaincy)పై టీమ్ విభేదాలు వచ్చాయని, టీమ్ రెండుగా చీలిపోయినట్లు పాక్ మీడియాలోని కొందరు జర్నలిస్టులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాదు ఇద్దరు ప్లేయర్స్ కొట్టుకున్నట్లు కూడా వాళ్లు చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను సోమవారం (అక్టోబర్ 23) ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ తర్వాత వెల్లడించనున్నట్లు కూడా తెలిపారు.

అయితే ఈలోపే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ద్వారా ఈ వార్తలను ఖండించింది. “ఓ వర్గం మీడియా వ్యాప్తి చేస్తున్న పుకార్లలో వాస్తవం లేదు. టీమ్ సమష్టిగానే ఉందని పీసీబీ హామీ ఇస్తోంది. ఈ వార్తల వెనుక ఎలాంటి ఆధారాలు లేవు” అని పీసీబీ స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్(Worldcup) లో నెదర్లాండ్స్( Netherlands), శ్రీలంక(Srilanka)పై వరుస విజయాలు సాధించిన తర్వాత ఇండియా, ఆస్ట్రేలియాలతో ఓడిపోయింది. దీంతో కెప్టెన్ బాబర్ ఆజంపై టీమ్ లోని కొందరు ప్లేయర్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. బాబర్ ను వాళ్లు పూర్తిగా దూరం పెడుతున్నారని, అసలు పట్టించుకోవడం లేదని పాక్ జర్నలిస్టులే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 

కెప్టెన్సీ ఒత్తిడి

వరుస ఓటములపై పాక్‌ సారధి బాబర్‌ ఆజమ్‌(Babar Azam) స్పందించాడు. ప్రపంచకప్‌లో తమ ద్వారాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని.. ఆజామ్‌ స్పష్టం చేశాడు. క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చని.. కానీ తాము చివరి వరకు అత్యుత్తమ క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించాడు. తమకు ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని… అన్ని మ్యాచ్‌లు గెలిచేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామని బాబర్‌ తెలిపాడు. ప్రపంచకప్‌లో అన్ని మ్యాచ్‌లు గెలిచి ముందుకు సాగుతామని వివరించాడు. తమ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తామని అన్నాడు.

కెప్టెన్సీ ఒత్తిడి మీ బ్యాటింగ్ ప్రదర్శనను ప్రభావితం చేస్తుందా అన్న ప్రశ్నకు కూడా బాబర్‌ స్పందించాడు. తనపై కానీ తన బ్యాటింగ్‌పై కానీ కెప్టెన్సీ ఒత్తిడి అస్సలు లేదని తేల్చి చెప్పాడు. తాను వంద శాతం కెప్టెన్సీని సమర్థంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నానని.. ఇప్పుడు అదే చేస్తున్నానని బాబర్‌ అన్నాడు. తాము ఫీల్డింగ్ చేసేటప్పుడు కెప్టెన్సీ గురించి మాత్రమే ఆలోచిస్తానని.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టు కోసం ఎలా పరుగులు చేయాలనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.మీ ఓటముతో దేశం మొత్తం విచారంలో మునిగిపోయిందని… వారికి ఏం సమాధానం చెప్తారన్న ప్రశ్నకు బాబర్‌ స్పందించాడు. వచ్చే మ్యాచుల్లో విజయం కోసం శక్తివంతన లేకుండా ప్రయత్నిస్తామని తెలిపాడు.

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాక్‌ పీకల మీదకు తెచ్చింది. ఆడిన అయిదు మ్యాచుల్లో తొలి రెండు మ్యాచులను గెలిచిన పాకిస్థాన్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. భారత్‌, ఆస్ట్రేలియా, అఫ్గాన్‌ చేతుల్లో భంగపాటుకు గురైన పాక్‌… ఇప్పుడు సెమీస్‌ చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. హ్యాట్రిక్ ఓటమితో పాక్‌ సెమీస్(Semis) ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్‌ 4లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక్క మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయినా పాక్‌ ఆశలు గల్లంతే. ఇప్పటికీ సెమీఫైనల్‌ చేరుకోవడానికి పాక్‌కు అవకాశమైతే ఉంది. కానీ ఈ అవకాశం చాలా క్లిష్టంగా ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ మ్యాచుల్లో పాక్‌కు కఠిన సవాల్‌ ఎదురు కావచ్చు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి ఎదురైనా ఈ మహా సంగ్రామంలో పాక్‌ కథ ముగిసినట్లే.