Cricket: కోహ్లీ టీ-షర్ట్ తీసుకున్న బాబర్ అజం

ఇండియా(India) – పాకిస్తాన్(Pakistan) మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ (Cricket) ఆటగాడు విరాట్ కోహ్లీ(Kohli) దగ్గర నుంచి పాకిస్తాన్ క్రికెట్ (Cricket) ఆడతాడు బాబర్ అజం(Babar Azam), కోహ్లీ(Kohli)కి సంబంధించి టి షర్ట్స్ తీసుకున్న విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీని గురించి చాలామంది చాలా రకాలుగా స్పందించడం జరిగింది, అయితే పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్ (Wasim Akram) ఈ విజువల్స్ గురించి కొన్ని వాక్యాలు చేశారు.  వసీం అక్రమ్ వాక్యాలు:  శనివారం జరిగిన, […]

Share:

ఇండియా(India) – పాకిస్తాన్(Pakistan) మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ (Cricket) ఆటగాడు విరాట్ కోహ్లీ(Kohli) దగ్గర నుంచి పాకిస్తాన్ క్రికెట్ (Cricket) ఆడతాడు బాబర్ అజం(Babar Azam), కోహ్లీ(Kohli)కి సంబంధించి టి షర్ట్స్ తీసుకున్న విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీని గురించి చాలామంది చాలా రకాలుగా స్పందించడం జరిగింది, అయితే పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్ (Wasim Akram) ఈ విజువల్స్ గురించి కొన్ని వాక్యాలు చేశారు. 

వసీం అక్రమ్ వాక్యాలు: 

శనివారం జరిగిన, క్రికెట్ (Cricket) ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌ (Match)లో పాకిస్తాన్ భారత్‌తో తలబడి విజయాన్ని సాధించలేకపోయింది. భారతదేశం టోర్నమెంట్‌లో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా ప్రతి ఒక్క ఆటగాడు తనదైన శైలిలో ఆడి విజయాన్ని సాధించారు. పాకిస్థాన్ అభిమానులు తమ జట్టు ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని సందర్భంలో, వారి కెప్టెన్ (Captain) బాబర్, భారత ఆటగాడు విరాట్ కోహ్లీ(Kohli) కలిసి, క్రికెట్ (Cricket) గ్రౌండ్ లో కనిపించిన ఒక విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కోహ్లి బాబర్‌కు రెండు టీమ్ ఇండియా షర్టులను ఇవ్వడాన్ని చూసి పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ (Wasim Akram) తనదైన శైలిలో స్పందించడం జరిగింది.

బాబర్ నిజానికి క్రికెట్ (Cricket) మైదానంలో, కెమెరాల ముందు, ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ అవుతున్న టెలివిజన్ సెట్‌లలో పదేపదే ప్లే అవుతున్న విజువల్స్ లో,కోహ్లీ(Kohli) నుంచి టీ-షర్టులు తీసుకోడాన్ని అక్రమ్ విమర్శించారు. ఒకవేళ బాబర్ కోహ్లీ(Kohli)ని షర్టులు అడగాల్సి వచ్చినా, అది కెమెరాలకు దూరంగా, డ్రెస్సింగ్ రూమ్‌లో చేసి ఉండాల్సిందని అక్రమ్ అన్నాడు. అంతేకాకుండా, ఒకవేళ నిజానికి మీ అంకుల్ వాళ్ళ కొడుకు విరాట్ కోహ్లీ(Kohli) షర్ట్ కావాలంటే.. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి విరాట్ కోహ్లీ(Kohli)ని అడిగితే సరిపోయేది అని, ప్రపంచావ్యాప్తంగా టెలికాస్ట్ అవుతున్న క్రికెట్ (Cricket) మ్యాచ్ గ్రౌండ్ లో, ఇలా విరాట్ కోహ్లీ(Kohli) దగ్గర నుంచి టీ షర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు వసీం అక్రమ్ (Wasim Akram). 

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్: 

ఆట తర్వాత, బాబర్ తన జట్టు మ్యాచ్‌ (Match)లో రాణించలేకపోయిందని ఒప్పుకోవడం జరిగింది. పాకిస్థాన్ లక్ష్యం 280-290 పరుగులు కాగా, కేవలం 191 పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం గమనార్హం. నిజానికి తాము భారతతో తలబడడానికి తమదైన శైలిలో ఆట ప్రారంభించామని, తను అలాగే ఇమామ్‌ బరిలో కలిసికట్టుగా ఆడేందుకు బాగా ప్రయత్నించామని, అంతా బాగుంది అనుకున్న వేళ అకస్మాత్తుగా తెలియకుండానే, తమ టీం కుప్పకూలిపోయిందని, సరైన ప్రణాళిక వేసుకున్నప్పటికీ.. తాము అనుకున్న 280-290 లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా భారత్ ఆటగాడు రోహిత్ (Rohit) నిజంగా చాలా అద్భుతంగా ఆడాడని మంచి ఇన్నింగ్స్ తెచ్చి పెట్టాడని, మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ (Captain) మాట్లాడాడు. 

తమ భారత జట్టులో కూడా బౌలర్లు తమ ఆట తీరును చాలా చక్కగా ప్రదర్శించారని తమ జట్టులో ఉన్న ఆరుగురు సభ్యులు ముఖ్యంగా బరిలో దిగిన వెంటనే బాల్ తో ప్రతాపం చూపించారని, ఒక కెప్టెన్ (Captain) గా తమ జట్టులో బాగా ఆడే ఆటగాళ్లను ప్రోత్సహించే బాధ్యత తన మీద ఉందని, మరొకసారి గుర్తు చేసుకున్నాడు రోహిత్ శర్మ (Rohit).

వరల్డ్ కప్ సంగతులు: 

గురువారం ప్రారంభమైన టోర్నమెంట్ 45 రోజుల పాటు అంటే ఈ నెలలో అక్టోబర్ 5 నుండి మొదలైన వరల్డ్ కప్ (World Cup), నవంబర్ 19 వరకు జరగనుండగా అందులో, దేశవ్యాప్తంగా 10 వేదికలలో జరిగే 10 జట్ల మధ్య 48 మ్యాచ్‌ (Match)లను చూసేందుకు కనీసం 25 లక్షల మంది అభిమానుల రాక కనిపిస్తుంది. ఒక్కో జట్టు మిగతా అందరితో ఒకసారి తలపడాల్సి ఉంది. ఈ ఏడాది టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పాల్గొంటున్నాయి. అహ్మదాబాద్‌లో రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ (Match)లు మరియు ఒక కప్ ఫైనల్‌నాకౌట్ దశకు కేవలం నాలుగు జట్లు మాత్రమే చేరుకుంటాయి.