రోహిత్ కంటే అతడే బెటర్ అంటున్న ఆస్ట్రేలియా లెజెండ్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కంటే హార్దిక పాండ్య‌నే బెట‌ర్ అని అంటున్నారు ఆస్ట్రేలియా లెజెండ్ మాథ్యూ హేడెన్ఇండియా-పాక్ రైవల్రీ అంటే క్రికెట్ చరిత్రలో ఎంత క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. కానీ ఈ రైవల్రీ విషయంలో మొన్న వరణుడు అడ్డు పడ్డాడు. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ మొదలెట్టగానే ఎంట్రీ ఇచ్చిన వరణుడు కాసేపటికి శాంతించాడు. దీంతో ఆటను కంటిన్యూ చేసిన ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇరగదీస్తారని అనుకున్న కెప్టెన్ శర్మ, సీనియర్ స్టార్ […]

Share:

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కంటే హార్దిక పాండ్య‌నే బెట‌ర్ అని అంటున్నారు ఆస్ట్రేలియా లెజెండ్ మాథ్యూ హేడెన్ఇండియా-పాక్ రైవల్రీ అంటే క్రికెట్ చరిత్రలో ఎంత క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. కానీ ఈ రైవల్రీ విషయంలో మొన్న వరణుడు అడ్డు పడ్డాడు. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ మొదలెట్టగానే ఎంట్రీ ఇచ్చిన వరణుడు కాసేపటికి శాంతించాడు. దీంతో ఆటను కంటిన్యూ చేసిన ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇరగదీస్తారని అనుకున్న కెప్టెన్ శర్మ, సీనియర్ స్టార్ కోహ్లీ, యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, గిల్ లు వెంటవెంటనే పెవిలియన్ కు చేరుకున్నారు. 100 పరుగుల లోపే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇండియాను మరో యువ బ్యాటర్, కీపర్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తమ అర్థ సెంచరీలతో గట్టెక్కించారు. వీరిద్దరి నాక్ వల్ల ఇండియా అంత స్కోరైనా చేయగల్గింది కానీ వీరిద్దరూ లేకపోతే ఇండియాకు చాలా కష్టం అయ్యేది. వీరు కూడా వెంటనే ఔట్ అయి పెవిలియన్ చేరితే భారత కష్టాలు మరింత ఎక్కువగా ఉండేవి.  కాగా పాక్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆసీస్ మాజీ ఆటగాడు స్టార్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసలు కురిపించాడు. అదరగొడతారని అనుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అంతే కాకుండా శుభ్ మన్ గిల్ వంటి స్టార్లు పాక్ పేస్ అటాక్ కు బలైపోయిన వేళలో వీరిద్దరూ నిలదొక్కుకుని పేస్ ను ఎదుర్కొన్న తీరు అమోఘం అని హేడెన్ కొనియాడాడు. ఈ మ్యాచ్ ద్వారా ఇండియాకు ఊహించని మరో హీరో దొరికాడని హేడెన్ అన్నాడు. పాకిస్తాన్ ఛేజింగ్‌ కు మళ్లీ వరణుడు అడ్డు రావడంతో మ్యాచ్ ఫలితం తేలలేదు కానీ లేకపోతే భారత బౌలింగ్ సత్తా గురించి కూడా తెలిసేదని అతడు అభిప్రాయపడ్డాడు. ఇషాన్ రాణించడంతో ప్రపంచ కప్ జట్టు కోసం జట్టు కెప్టెన్ రోహిత్ మరియు ప్రధాన కోచ్ రాహుల్‌ లకు కొన్ని ప్రధాన ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. వాటిలో మొదటిది మిడిల్ ఆర్డర్ సమస్య అని తెలిపాడు. 

కేఎల్ లేని లోటును

భారత జట్టుకు పాక్ తో మ్యాచ్ కు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఫిట్ నెస్ సంబంధిత సమస్యలతో అతడు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇటువంటి తరుణంలో అం తా మిడిల్ ఆర్డర్ ఎలా అని ఆరాటడుతున్నారు. ఈ ప్రశ్నలకు మొన్నటి మ్యాచ్ ద్వారా ఇషాన్ కిషన్ స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. తనెంటో ప్రూవ్ చేసుకున్న కిషన్ హార్దిక్ తో కలిసి క్రూషియల్ పార్ట్ నర్ షిప్ నెలకొల్పాడు. దీంతో జట్టు మేనేజ్ మెంట్ ఈ యువ వికెట్ కీపర్ మీద ఎంతో భరోసా పెట్టింది. అందుకోసమే త్వరలో జరగబోయే వరల్డ్ కప్ కోసం కూడా ఇషాన్ ను సెలెక్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్ మొదటి రెండు మ్యాచెస్ కు స్టార్ బ్యాటర్ రాహుల్ దూరమైన వేళ మేమున్నామంటూ యువ బ్యాటర్ ఇషాన్ కిషన్, ఆల్ రౌండర్ పాండ్యా ముందుకు వచ్చారు. కీలక వికెట్లను కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో తమ విలువను చాటి చెప్పారు. మరో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడంతో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు బ్యాటింగ్ ఆర్డర్ లో డిమోషన్ వచ్చింది. ఎప్పుడైనా కానీ ఓపెనింగ్ వచ్చే అతడు మొన్నటి మ్యాచ్ లో మాత్రం 5వ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చాడు. అప్పటికే ఇండియన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడి ఉంది. ఒక పక్క స్టార్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు చేరారు. అంతే కాకుండా ఇండియన్ బ్యాటర్ల మీద పాక్ పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. అటువంటి సమయంలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ తన విలులేంటో చాటి చెప్పాడు. హార్దిక్ పాండ్యా మరియు ఇషాన్ కిషన్ అద్భుతమైన భాగస్వామ్యంతో ఇండియా గౌరవప్రద స్కోరు సాధించింది. 

వారుంటేనా… 

ఒకానొక దశలో అసలు ఇండియా 150 పరుగులు చేస్తోందా అని అనుమానాలు వ్యక్తం చేసిన భారత ఫ్యాన్స్ చివరికి వచ్చే సరికి మాత్రం ఇండియా 300+ పరుగులు చేస్తుందని నమ్మారు. అంటే అదంతా ఇషాన్ కిషన్ మరియు హార్దిక్ పాండ్యాల బ్యాటింగ్ చలవే. అటువంటిది ఈ ఇద్దరు సెంచరీల దిశగా సాగుతున్న తరుణంలో దురదృష్టవశాత్తు ఔట్ అయ్యారు. ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫెయిల్ అయిన చోట వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సక్సెస్ అయ్యాడు. దీనిపై ఆసీస్ మాజీ బ్యాటర్ హేడెన్ స్పందిస్తూ… రోహిత్ శర్మ చేయలేనిది హార్దిక్ చేశాడని అన్నాడు. ఇంకా హేడెన్ మాట్లాడుతూ… అతను (హార్దిక్ పాండ్యా) 120 పరుగులు చేసి ఉండాల్సిందని, ఇషాన్ కిషన్ అవతలి ఎండ్‌లో ఉన్నాడని అతనికి తెలుసు. కానీ అతను నిజంగా బాగా ఆడాడని కొనియాడాడు. అతడు తన వ్యక్తిగత రికార్డుల కోసం వెళ్లకుండా ఆ పరిస్థితిలో జట్టుకు ఏది అవసరమో అది చేశాడని అన్నాడు. పాండ్యా చక్కగా స్ట్రైక్‌ని రొటేట్ చేస్తూ స్పిన్నర్లకు ధీటుగా ఎదుర్కొన్నాడని తెలిపాడు. అవతలి ఎండ్ లో ఉన్న యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు ఎటువంటి స్ట్రెస్ లేకుండా చేయడంలో పాండ్యా సక్సెస్ అయ్యాడని హేడెన్ తెలిపాడు. తన అభిప్రాయం ప్రకారం.. ఇది కెప్టెన్ నాక్ అని పేర్కొన్నాడు.