ఏషియా కప్ 2023 క్రికెట్ జట్టు ఇదే

ఏషియా కప్ 2023 దగ్గరపడుతున్న వేళ, భారత సెలక్టర్లు సోమవారం న్యూఢిల్లీలో టోర్నమెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ప్రకటించిన పేర్లలో ఏషియా కప్ లో కొంతమంది యువ క్రికెటర్ల పేర్లు లిస్టులో వినిపించలేనట్లే కనిపిస్తోంది. అయితే కొంతమంది అభిమానులు తమ అభిమాన యువ క్రికెటర్లను వరల్డ్ కప్ లో కూడా చూడాలని ఉత్సాహపడుతున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ సమావేశం:  అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి […]

Share:

ఏషియా కప్ 2023 దగ్గరపడుతున్న వేళ, భారత సెలక్టర్లు సోమవారం న్యూఢిల్లీలో టోర్నమెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ప్రకటించిన పేర్లలో ఏషియా కప్ లో కొంతమంది యువ క్రికెటర్ల పేర్లు లిస్టులో వినిపించలేనట్లే కనిపిస్తోంది. అయితే కొంతమంది అభిమానులు తమ అభిమాన యువ క్రికెటర్లను వరల్డ్ కప్ లో కూడా చూడాలని ఉత్సాహపడుతున్నట్లు తెలుస్తోంది.

సెలక్షన్ కమిటీ సమావేశం: 

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం న్యూఢిల్లీలో ఆసియా కప్ జట్టుపై చర్చించి ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హాజరయ్యారు. భారత జట్టు తమ కీలక ఆటగాళ్ల గాయంపై ఆందోళనల మధ్య ఆసియా కప్ మరియు ప్రపంచ కప్ కోసం తమ జట్టును ఇంకా ప్రకటించలేదు, పాకిస్తాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే తమ ఆసియా కప్ జట్టులను ప్రకటించాయి. 2023 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియా తాత్కాలిక జట్టును కూడా ప్రకటించాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీ ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టుతో ఆగస్టు 30న ముల్తాన్‌లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ హాజరుకానున్నారు. 

ఐర్లాండ్‌లో భారత T20I జట్టుకు నాయకత్వం వహిస్తున్న పేసర్ జస్ప్రీత్ బుమ్రాను రోహిత్ శర్మ డిప్యూటీగా ప్రకటించాలని భావిస్తున్నారు. హార్దిక్ పాండ్యా స్థానంలో ఆసియా కప్ 2023 టోర్నమెంట్ కోసం ఆయనకు న్యాయకత్వం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 2న కాండీ వేదికగా పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ ఆసియా కప్ లో తప్పకుండా తమదే విజయం అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ జట్టు. విలేకరులతో మాట్లాడిన రోహిత్ శర్మ, తాము కచ్చితంగా గెలిచి వస్తానంటూ, భారతీయులందరికీ తమవైపు నుంచి హామీ ఇచ్చారు.

ఆసియా కప్ 2023 భారత జట్టు: 

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్, కుల్‌దీప్ ప్రసిద్ధ్ కృష్ణ, మరియు సంజు శాంసన్ (బ్యాక్ అప్). 

ఆసియా కప్ 2023 షెడ్యూల్:

30 ఆగస్టు 2023: పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో, పాకిస్థాన్ vs నేపాల్

31 ఆగస్టు 2023: శ్రీలంకలోని క్యాండీలో, బంగ్లాదేశ్ vs శ్రీలంక

2 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని క్యాండీలో, పాకిస్థాన్ vs భారత్

3 సెప్టెంబర్ 2023: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో, బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్

4 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని క్యాండీలో, భారత్ vs నేపాల్

5 సెప్టెంబర్ 2023: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో, ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక

సూపర్ 4లు:

6 సెప్టెంబర్ 2023: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో, A1 vs B2

9 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో, B1 vs B2

10 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో, A1 vs A2

12 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో, A2 vs B1

14 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో, A1 vs B1

15 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో, A2 vs B2

చివరి మ్యాచ్:

17 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో ఫైనల్ మ్యాచ్