ఇది క‌దా స‌క్సెస్ అంటే..

ఇది క‌దా స‌క్సెస్ అంటే..! చెస్ మాస్టర్ ప్రజ్ఞానంద గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అతడు దేశం గర్వించే ఎన్నో విజయాలను సాధించాడు. ఒక్క విషయంలో ప్రజ్ఞానంద తప్పకుండా మెచ్చుకుని తీరాలి. అతడి వయసు ఎంతో చిన్నది అయినా కానీ అతడు వయసులో తనకంటే ఎంతో పెద్దవారిని కూడా మట్టికరిపించాడు. చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ గా ఎదిగి అందరి చేతా ప్రశంసలు అందుకున్నాడు.  తల్లితో ప్రజ్ఞానంద.. వైరల్ అవుతున్న ఫొటోలు అజర్ బైజాన్ లోని బాకులో […]

Share:

ఇది క‌దా స‌క్సెస్ అంటే..! చెస్ మాస్టర్ ప్రజ్ఞానంద గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అతడు దేశం గర్వించే ఎన్నో విజయాలను సాధించాడు. ఒక్క విషయంలో ప్రజ్ఞానంద తప్పకుండా మెచ్చుకుని తీరాలి. అతడి వయసు ఎంతో చిన్నది అయినా కానీ అతడు వయసులో తనకంటే ఎంతో పెద్దవారిని కూడా మట్టికరిపించాడు. చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ గా ఎదిగి అందరి చేతా ప్రశంసలు అందుకున్నాడు. 

తల్లితో ప్రజ్ఞానంద.. వైరల్ అవుతున్న ఫొటోలు

అజర్ బైజాన్ లోని బాకులో జరుగుతున్న FIDE ప్రపంచకప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సెమీ ఫైనల్ లోకి ప్రవేశించాడు. సడన్ డెత్ ట్ర బ్రేక్ లో మన దేశానికే చెందిన అర్జున్ ఎరిగైసిని ప్రజ్ఞానంద ఓడించాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద తన పేరు మీద ఓ రికార్డును రాసుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు సెమీస్ వరకు చేరుకున్న ఇండియన్ కేవలం విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే. ఇప్పుడు సెమీస్ చేరిన ప్రజ్ఞానంద విశ్వనాథన్ తర్వాత సెమీస్ చేరిన రెండో ఇండియన్ గా నిలిచాడు. ఈ క్షణంలో ప్రజ్ఞానంద తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి తల్లి నాగలక్ష్మి తన కొడుకు ఇంటర్వ్యూ ఇస్తున్నపుడు పక్కనే ఉండి భావోద్వేగానికి గురైన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను షేర్ చేస్తున్న పలువురు ప్రజ్ఞానంద టాలెంట్ చూసి మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో అతడి తల్లి నాగలక్ష్మికి కూడా మెచ్చుకుంటున్నారు. మదర్ ఎఫెక్షన్ అంటే ఇలాగే ఉంటుందని ట్వీట్లు చేస్తున్నారు.  

అమ్మా నీకు వందనం

గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తన తల్లితో కలిసి ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన తన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ తల్లికి థ్యాంక్స్ చెప్పాడు. ఆయన మాట్లాడుతూ… తన తల్లి తనకు ఎప్పుడూ తనకు మద్దతిస్తుందని తెలిపాడు. ఒక వేళ గేమ్ ఓడిపోయినా కానీ ఆమె తనను శాంతింపజేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆయన పేర్కొన్నాడు. ఆమె నాకు పెద్ద సపోర్టర్ అని తెలిపాడు. కేవలం నాకు మాత్రమే కాదు.. నా సోదరునికి కూడా సపోర్ట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.  ఈ విజయం తర్వాత ప్రజ్ఞానంద వచ్చే ఏడాది పోటీలకు అర్హత సాధించాడు. ఇతడు సెమీస్ లో అమెరికా ఆటగాడు ఫాబియానో కరువానాతో తలపడనున్నాడు. ఈ మ్యాచ్ కనుక గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద గెలిస్తే అతడు ఫైనల్ గడప తొక్కనున్నాడు. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ముగ్గురు ఆటగాళ్లు 2024 ఈవెంట్ కు అర్హత సాధించారు. ఇతడు అర్హత సాధించడంతో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అర్హత సాధించిన వ్యక్తిగా ప్రజ్ఞానంద నిలిచాడు. 

తల్లి ప్రేమ అంటే అదే… 

ప్రజ్ఞానంద ను అతని తల్లి నాగలక్ష్మిని చూసిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు తల్లి ప్రేమ అంటే అలాగే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. కొడుకును అతడు సాధించిన విజయాన్ని చూసి మురిసిపోతున్న తల్లి సింప్లీ సూపర్బ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏ తల్లికైనా తన కొడుకు సాధించిన విజయం చాలా గర్వంగా ఉంటుందని అంటున్నారు. ఆ విజయం పెద్దది అయినా చిన్నది అయినా కానీ ఆ తల్లి సంతోషం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుందంటూ ట్వీట్లు చేస్తున్నారు. వీరి ప్రేమకు సెల్యూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తల్లి ప్రేమకు సెల్యూట్ అంటూ చెబుతున్నారు. ప్రజ్ఞానంద వంటి టాలెంటెడ్ సన్ ను కని దేశానికి ఇచ్చినందుకు నాగలక్ష్మి మీరు చాలా గ్రేట్ అంటున్నారు.