కోహ్లీ కోసం అనుష్క శర్మ పోస్టు

కోహ్లి భార్య , బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన ఆనందాన్ని తెలియజేసింది. కోహ్లీ సెంచరీ చేశాడనే ఆనందంతో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.  కోహ్లీ ఫోటో పై హార్ట్ సింబల్ పెట్టింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు ద్వారా 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు కేవలం 180 బంతుల్లోనే 29వ టెస్టు సెంచరీని […]

Share:

కోహ్లి భార్య , బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన ఆనందాన్ని తెలియజేసింది. కోహ్లీ సెంచరీ చేశాడనే ఆనందంతో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.  కోహ్లీ ఫోటో పై హార్ట్ సింబల్ పెట్టింది.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు ద్వారా 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు కేవలం 180 బంతుల్లోనే 29వ టెస్టు సెంచరీని అందుకున్న కోహ్లి తన ప్రతిభను ప్రదర్శించాడు. మ్యాచ్‌లో 1వ రోజు ఒకే సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టుకు అతని సెంచరీ కీలక సమయంలో ఉపయోగపడింది.

జులై 21న విరాట్ కోహ్లి తన పేరును క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిపాడు,కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఈ చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది.

ఇంకా 500 అంతర్జాతీయ మ్యాచ్‌‌ల్లోనే 76 సెంచరీలు పూర్తి చేశాడు.

వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో ఆడడం ద్వారా అన్ని ఫార్మాట్లలో కలిపి 500 మ్యాచ్ ఆడిన కోహ్లీ ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ఒకటిగా నిలిచాడు. అలాగే 500 మ్యాచ్ లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో 206 బంతులు ఆడిన కోహ్లీ 10 ఫోర్ల సహాయంతో 121 పరుగులు చేశాడు.

2018 డిసెంబర్ నుంచి టెస్టుల్లో సెంచరీ చేయని విరాట్.. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత శతక్కొట్టాడు.2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌లో సెంచరీ కొట్టిన కోహ్లీ.. అప్పటి నుంచి విదేశీ గడ్డపై టెస్టుల్లో సెంచరీ చేయనే చేయలేదు. ఇప్పుడు వెస్టిండీస్ టూర్‌లో భాగంగా ఆ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో శతకం చేశాడు. ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో.. 181 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో కోహ్లీ తన సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 29వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 76వ అంతర్జాతీయ సెంచరీ. తన 500వ మ్యాచ్‌లో కోహ్లీ ఈ శతకం బాదడం మరింత విశేషంగా నిలిచింది

87 వ్యక్తిగత పరుగులతో రెండో రోజు ఆటని ప్రారంభించిన కోహ్లీ.. నిదానంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. సరిగ్గా 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. ఫోర్ కొట్టి సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. ఆపై కాస్త జోరు పెంచాలని భావించాడు. కానీ.. 121 వ్యక్తిగత పరుగుల వద్ద కోహ్లీ రనౌట్ అయ్యాడు. అల్జారీ జోసెఫ్ అతడ్ని రనౌట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు లంచ్ సమయం కల్లా భారత్ 108 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లీ శతక్కొట్టడంతో పాటు ఓపెనర్లు అర్థశతకాలతో అద్భుతంగా రాణించడం, జడేజా సైతం హాఫ్ సెంచరీతో చెలరేగడు.

 విరాట్‌ కోహ్లీ మళ్లీ ఫామ్‌ లోకి వచ్చాడు. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ లో విరాట్‌ కేహ్లీ సెంచరీ

కొట్టాడు. అంతకు ముందు 2018 డిసెంబర్‌ లోఆస్ట్రేలియా టూర్‌లో కీహ్లీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. అప్పటి నుంచి కేహ్లీ మళ్లీ సెంచరీ చేయలేదు. ఐదేండ్ల తర్వాత మళ్లీ విండీస్‌ తో జరుగుతున్న టెస్టులో కోహ్లీ ఫామ్‌ లోకి రావడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.