ఆంటోనియో రూడిగర్‌ని జాత్యహంకారపు మాటలతో దుర్భాషలాడిన ఫ్యాన్స్

స్పానిష్ లీగ్‌లో క్యాడిజ్‌తో జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ తరపున ఆడిన ఆంటోనియో రూడిగర్‌ను అభిమానులు జాతిపరంగా దుర్భాషలాడారు. స్పానిష్ మీడియా ఈ దుర్వినియోగానికి సంబంధించిన వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాడ్రిడ్ మద్దతుదారుగా కనిపించిన వ్యక్తికి.. తన షర్టును ఇవ్వడానికి స్టాండ్స్‌కు వెళ్లిన తర్వాత జర్మన్ డిఫెండర్ రూడిగర్‌పై కాడిజ్ అభిమానులు జాత్యహంకార పదాలతో దూషించినట్టు ఆ వీడియోలో ఉంది. అదే విధంగా నల్లజాతీయుడైన అతనిపై కొన్ని వస్తువులు కూడా విసిరారు. క్యాడిజ్‌పై […]

Share:

స్పానిష్ లీగ్‌లో క్యాడిజ్‌తో జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ తరపున ఆడిన ఆంటోనియో రూడిగర్‌ను అభిమానులు జాతిపరంగా దుర్భాషలాడారు. స్పానిష్ మీడియా ఈ దుర్వినియోగానికి సంబంధించిన వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాడ్రిడ్ మద్దతుదారుగా కనిపించిన వ్యక్తికి.. తన షర్టును ఇవ్వడానికి స్టాండ్స్‌కు వెళ్లిన తర్వాత జర్మన్ డిఫెండర్ రూడిగర్‌పై కాడిజ్ అభిమానులు జాత్యహంకార పదాలతో దూషించినట్టు ఆ వీడియోలో ఉంది. అదే విధంగా నల్లజాతీయుడైన అతనిపై కొన్ని వస్తువులు కూడా విసిరారు.

క్యాడిజ్‌పై జట్టు విజయం సాధించిన తర్వాత తనపై కేకలు వేస్తున్న కొంతమంది మాడ్రిడ్ అభిమానులతో రూడిగర్ మాట్లాడాడు. ఆ తర్వాత తన చొక్కా ఇచ్చి కొంతమంది మద్దతుదారులకు పాదాభివందనం చేశారు. అటు మాడ్రిడ్ సిబ్బందిలో సభ్యులుగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. అతన్ని అక్కడి నుండి తీసుకెళ్లడానికి వచ్చారు. అయితే మాడ్రిడ్ 2-0 తో విజయం సాధించిన తర్వాత ఈ సంఘటన జరిగింది.

స్పానిష్ సాకర్ ఈ సీజన్‌లో జాత్యహంకారంతో అట్టుడుకుతోంది. రుడిగర్ సహచరుడు వినిసియస్ జూనియర్ కూడా అనేక మ్యాచ్‌లలో టార్గెట్ అయ్యాడు. ఈ నెల ప్రారంభంలో.. బ్రెజిలియన్ ఫార్వార్డ్ ప్లేయర్ ఆంటోనియో..  ఒక మ్యాచ్ సందర్భంగా కోతి అని అన్నాడని ఆరోపిస్తూ.. మల్లోర్కా అభిమానిపై కేసు నమోదయింది. కాగా.. అదే అభిమాని మరో లీగ్ మ్యాచ్‌లో విల్లారియల్ మిడ్‌ఫీల్డర్ సాము చుక్వేజ్‌ను కూడా అవమానించాడని ఆరోపించారు.

వినిసియస్‌ మరియు ఇతర ఆటగాళ్లకు జరిగిన అవమానాలపై స్పానిష్ లీగ్.. అధికారులకు అనేక ఫిర్యాదులు చేసింది, అయితే కొన్ని పెండింగ్ లో ఉండగా, మిగతా వాటిని ఆరోపణ రహితమని తిరస్కరించారు. అయితే లీగ్ మాడ్రిడ్ మ్యాచ్‌లలో నేరస్థులను గుర్తించడానికి మానిటర్ల సంఖ్యను కూడా పెంచింది.  బూతు పదాలతో దూషించిన ఆరోపణలపై విచారణ చేస్తున్న వల్లాడోలిడ్ ఇటీవల 12 మంది సీజన్-టికెట్ హోల్డర్‌లను సస్పెండ్ చేసింది.

కాగా.. కొన్ని సంవత్సరాల క్రితం అథ్లెటిక్ బిల్బావో ఫార్వర్డ్ ఇనాకి విలియమ్స్‌పై ఎస్పాన్యోల్ మద్దతుదారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్పెయిన్‌లో ఒక క్రీడాకారుడిని జాతిపరంగా దుర్భాషలాడిన అభిమానిపై మొదటి విచారణ ఈ సంవత్సరం జరుగుతుందని భావిస్తున్నారు.

1993లో మార్చి 3న జన్మించిన  ఆంటోనియో రూడిగర్ ఒక జర్మన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అతను లా లిగా క్లబ్ రియల్ మాడ్రిడ్ మరియు జర్మనీ జాతీయ జట్టుకు సెంటర్- బ్యాక్‌ స్థానంలో ఆడుతున్నాడు.

2015లో అతను రోమాలో చేరాడు. ఆ తరువాత  2017లో చెల్సియాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.అక్కడ అతను తన మొదటి సీజన్‌లో FA కప్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత అతని రెండవ సీజన్‌లో UEFA యూరోపా లీగ్, 2021లో UEFA ఛాంపియన్స్ లీగ్‌ను గెలుచుకున్నాడు. ఇక 2022లో యూరోపియన్ ఛాంపియన్స్ రియల్ మాడ్రిడ్ తరపున ఆడేందుకు సంతకం చేశాడు. 

కాగా.. అతను మే 2014లో జర్మనీ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. సీజన్‌లో అతను గాయపడిన కారణంగా .. UEFA యూరో 2016ను కోల్పోవలసి వచ్చింది. అయితే అతను 2017 FIFA కాన్ఫెడరేషన్ కప్‌ను గెలుచుకున్న జట్టులో భాగమయ్యాడు. దీంతో అతను 2018లో జరిగిన ప్రపంచ కప్ కోసం జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. UEFA యూరో 2020 మరియు 2022 ప్రపంచ కప్‌లో కూడా పాల్గొన్నాడు.