Amitabh Bachchan: ఫైనల్ మ్యాచ్ చూడొద్దంటూ అమితాబ్ బచ్చన్ కి విజ్ఞప్తి

ఎందుకో.. ఏమిటో.. చూసేయండి..

Courtesy: Aishwarya rai

Share:

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇటీవల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కనిపిస్తున్నారు. ఇటీవల ఐశ్వర్య గురించి మాట్లాడిన పాకిస్తాన్ ఆటగాడికి తనదైన శైలిలో వార్నింగ్ ఇవ్వడం జరిగింది అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). అయితే ఇటీవల జరిగిన క్రికెట్ మ్యాచ్ లో భారత్ (India) ఫైనల్స్ (Final) లోకి వెళ్లిన సందర్భంలో, ఒక ప్రత్యేకమైన ట్వీట్ చేశారు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). 

మ్యాచ్ చూడొద్దంటూ అమితాబ్ బచ్చన్ కి విజ్ఞప్తి: 

దేశం అందుకున్న భారీ విజయంలో, భారత్ (India) 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి 2023 ప్రపంచకప్‌లో ఫైనల్‌ (Final)కు అర్హత సాధించింది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)‌తో సహా పలువురు ప్రముఖులు టీమిండియా (India) విజయంపై అభినందనలు తెలిపారు. అయితే, అతను X లో చేసిన పోస్ట్ చూసిన చాలా మంది.. చివరి ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌ను చూడవద్దని అభిమానులు అతనికి అనేక హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. భారత క్రికెట్ జట్టు మ్యాచ్‌లను, తాను చూడనప్పుడు ఎప్పుడూ గెలుస్తుందని, బిగ్ బి  తన ట్వీట్ ద్వారా తెలిపారు.

బుధవారం జరిగిన ICC ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌ (Final)లో న్యూజిలాండ్‌పై టీమ్ భారత్ (India) విజయం సాధించిన కొన్ని నిమిషాల తర్వాత, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తన Xలో, “నేను చూడనప్పుడు మనం గెలుస్తాము!” అని భారత్ (India) విజయం గురించి ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ ట్వీట్ చూసిన చాలా మంది కూడా, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఫైనల్ (Final) మ్యాచ్ చూడొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 

పాకిస్తాన్ క్రికెటర్ కు వార్నింగ్ ఇచ్చిన అమితాబ్: 

పాకిస్తాన్ (Pakistan) క్రికెటర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా విమర్శనాత్మక వాక్యాలు చేస్తూ బుక్ అయిపోతున్నారు. పాకిస్తాన్ (Pakistan) క్రికెటర్లు తమ తోటి పాకిస్తాన్ (Pakistan) క్రికెటర్లను విమర్శించిన సంఘటనలు బయటికి వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ ఆటగాడు, అబ్దుల్ రజాక్ (Abdul Razzaq) క్రికెట్ గురించి మాట్లాడుతూ ఐశ్వర్యారాయ్ ప్రస్తావన తీసుకుని వచ్చాడు. దీనికి సంబంధించి చాలా మంది నెటిజెన్లు అతనిపైన ఆరోపణల వెలువలు కురిపించారు. తాను చేసిన వాక్యాలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కూడా చెప్పాడు, పాకిస్తాన్ (Pakistan) ఆటగాడు అబ్దుల్ రజాక్ (Abdul Razzaq). 

ఈ వ్యాఖ్యపై ఐశ్వర్య ఇంకా స్పందించనప్పటికీ, సంఘటన జరిగినప్పటి నుండి బిగ్ బి ఒక ట్వీట్‌ను పంచుకున్నారు.

ట్విటర్‌ లో, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) చేతులు జోడించిన ఎమోజీని పోస్ట్‌ చేస్తూ ఆ పక్కనే ఇలా వ్రాశారు, దీనికి ఏ పదం కన్నా ఎక్కువ అర్థం ఉన్నది.. అంటూ ఎవరికి ఉద్దేశించి, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పోస్ట్ చేశారో తెలియనప్పటికీ, రజాక్ (Abdul Razzaq)‌తో సంఘటనలకు సంబంధించి అది అస్పష్టంగా అర్థం అవుతుంది అందరికీ. బుధవారం ఉదయం, పాకిస్తాన్ (Pakistan) క్రికెటర్ SAMAA టీవీలో కనిపించాడు, అందులో అతను ఐశ్వర్యకు క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో షేర్ జరిగింది. అయితే క్రికెట్ గురించి తమ ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నప్పుడు, తన టంగ్ స్లిప్ అయిపోవడం, పొరపాటున ఐశ్వర్య పేరు తీసుకువచ్చినందుకు ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించాడు రజాక్ (Abdul Razzaq)‌. ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి తను ప్రయత్నించినప్పటికీ, తాను క్షమాపణ చెబుతున్నట్టు వెల్లడించాడు పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ ఆటగాడు అబ్దుల్ రజాక్ (Abdul Razzaq). 

వరల్డ్ కప్

క్రికెటర్ విరాట్ కోహ్లీ (Kohli) 50వ సెంచరీ కొట్టి విజయం సాధించిన తర్వాత భారత్ (India) వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చారిత్రాత్మకంగా మారింది. సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఆ జట్టు ఇప్పుడు నవంబర్ 19న జరిగే ఫైనల్‌ (Final)లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.