India Vs New zealand: న్యూజిల్యాండ్‌పై గెలిచేనా?

భారత్  (India) క్రికెట్ జట్టు వరల్డ్ కప్  (World Cup) మ్యాచ్  (Match)లలో తమదైన శైలిలో ఆడి అదరగొడుతుంది. అక్టోబర్ 22 మధ్యాహ్నం మొదలైన భారత్ – న్యూజిలాండ్ (India Vs New zealand) మధ్య పోటీ ఆసక్తిగా మారనుంది. కచ్చితంగా న్యూజిలాండ్  (New Zealand) మీద విజయం సాధించడం కోసం భారత జట్టు తనదైన శైలిలో కృషి చేయడానికి సిద్ధమవుతోంది. టాస్ గెలుచుకున్న భారత్  (India), ఫీల్డింగ్ ఎంచుకోగా. న్యూజిలాండ్  (New Zealand) మొదటి బ్యాటింగ్ […]

Share:

భారత్  (India) క్రికెట్ జట్టు వరల్డ్ కప్  (World Cup) మ్యాచ్  (Match)లలో తమదైన శైలిలో ఆడి అదరగొడుతుంది. అక్టోబర్ 22 మధ్యాహ్నం మొదలైన భారత్ – న్యూజిలాండ్ (India Vs New zealand) మధ్య పోటీ ఆసక్తిగా మారనుంది. కచ్చితంగా న్యూజిలాండ్  (New Zealand) మీద విజయం సాధించడం కోసం భారత జట్టు తనదైన శైలిలో కృషి చేయడానికి సిద్ధమవుతోంది. టాస్ గెలుచుకున్న భారత్  (India), ఫీల్డింగ్ ఎంచుకోగా. న్యూజిలాండ్  (New Zealand) మొదటి బ్యాటింగ్ చేస్తూ, తన ఆట తీరును కొనసాగిస్తోంది. భారత్ – న్యూజిలాండ్ (India Vs New zealand) మ్యాచ్  (Match) మీద ఆశలు పెట్టుకున్న భారత తప్పకుండా విజయం సాధించాలని చూస్తుంది.

ఇండియా – న్యూజిలాండ్ మ్యాచ్ నేడే: 

న్యూజిలాండ్  (New Zealand)‌పై భారత్  (India)‌కు 58-50 హెడ్-టు-హెడ్ రికార్డ్ ఉంది, కానీ ICC ఈవెంట్‌ల విషయానికి వస్తే, భారత్  (India) కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. 2003 ప్రపంచ కప్‌  (World Cup)లో విజయం సాధించిన తర్వాత ప్రారంభమైన ICC ఈవెంట్‌లో భారత్  (India) న్యూజిలాండ్‌ (India Vs New zealand)ను ఓడించి 20 సంవత్సరాలు అయ్యింది. ఓవరాల్‌గా వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ (India) పై న్యూజిలాండ్  (New Zealand) 5-3 ఆధిక్యంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ, భారత జట్టు విజయంపై దృష్టి సారించిన జట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. 

Also Read: IND vs NZ: ఒకరికి తేనెటీగ కాట్లు.. మరొకరికి గాయం..

జట్టుపైనే దృష్టి: 

న్యూజిలాండ్  (New Zealand) కూడా ఇప్పటివరకు ప్రపంచ కప్‌  (World Cup)లో మరి ప్రత్యేకమైన ఆటతీరును చూపించినప్పటికీ, ఇప్పటివరకు టోర్నమెంట్‌లో చాలా వరకు వారి కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఆడ లేనట్లు తెలుస్తోంది. విలియమ్సన్ మరికొద్ది వారాల పాటు అవుటయ్యే అవకాశం ఉంది, అయితే ఈ సమయంలో బ్యాటింగ్ విషయంలో న్యూజిలాండ్  (New Zealand) జాగ్రత్తగా ఉన్నట్లు కనిపిస్తోంది.

కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత బ్యాటింగ్ లైనప్ లెక్కకు మిక్కిలిగా ఉంది. ప్రస్తుతం శర్మ 265 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, 259 పరుగులతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరుతో పాటు, ఇప్పటివరకు జరిగిన మ్యాచ్  (Match)లలో చూసుకుంటే, భారత బ్యాటింగ్ లైనప్ నిలకడగా రాణిస్తోంది, బ్యాటర్లు సగటున 100కు పైగా కొట్టారు. వారి ఆధిపత్యం ఏమిటంటే, వారు ప్రతి గేమ్‌లో 42 ఓవర్లలోపు నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించగలిగారు.

హార్దిక్ పాండ్యా  ప్లేస్ లో..: 

హార్దిక్ పాండ్యా  (Hardik Pandya) గాయం కారణంగా భారత్  (India)‌కు రెండు విభాగాల్లో రీప్లేస్మెంట్ కనిపించాల్సిన అవసరం ఏర్పడింది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ (Ishankishan), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రధాన పోటీదారులు. ఇద్దరు ఆటగాళ్లు ప్రత్యేకించి ఇటీవలి కాలంలో మిడిల్ ఆర్డర్‌లో మంచి ప్రదర్శన కనబరిచారు. జట్టుకు భిన్నమైన కోణాన్ని అందించగలరు. అయితే, రాహుల్ ద్రవిడ్ ఈ పోటీకి తన ఆప్షన్స్ గురించి చెప్పడం జరిగింది. బౌలింగ్ విషయానికి వస్తే, మహ్మద్ షమీ ఉన్నాడు, అతను డెత్ ఓవర్లలో చాలా చురుకుగా ఆడే ఆటగాడు. మరొక ఆప్షన్ విషయానికి వస్తే, శార్దూల్ ఠాకూర్, అతను తన బౌలింగ్‌తో ప్రపంచ కప్ గ్రౌండ్ లో చాలా బాగా ఆడే ఆటగాడు, కానీ అతని బ్యాటింగ్ ఆట తీరు మీదే ప్రయారిటీ ఇవ్వడానికి చూశారు. 

ఏది ఏమైనాప్పటికీ ప్రస్తుతం హార్దిక్ పాండ్యా  (Hardik Pandya) రీప్లేస్మెంట్ విషయంలో, ప్రతి ఒక్కరు సలహా మేరకు తుది నిర్ణయంగా.. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.