‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్’ లోకి అడుగుపెట్టిన మాజీ ఇండియన్ కెప్టెన్ అజంక్యా రహానే

ఈ ఏడాది ప్రస్తుతం జరుగుతున్న IPL సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం అద్భుతమైన బ్యాటింగ్‌తో టేబుల్ టాపర్స్ గా నిల్చిన సంగతి తెలిసిందే. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యం లో ఈ టీం మొదటి మ్యాచ్ నుండి తమ అద్భుతమైన ఫామ్ ని కొనసాగిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్ టాపర్స్ గా నిలవడానికి ప్రధాన కారణాలలో ఒకటి అజంక్యా రహానే అద్భుతమైన బ్యాటింగ్ అని […]

Share:

ఈ ఏడాది ప్రస్తుతం జరుగుతున్న IPL సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం అద్భుతమైన బ్యాటింగ్‌తో టేబుల్ టాపర్స్ గా నిల్చిన సంగతి తెలిసిందే. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యం లో ఈ టీం మొదటి మ్యాచ్ నుండి తమ అద్భుతమైన ఫామ్ ని కొనసాగిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్ టాపర్స్ గా నిలవడానికి ప్రధాన కారణాలలో ఒకటి అజంక్యా రహానే అద్భుతమైన బ్యాటింగ్ అని చెప్పొచ్చు. ఇతని ఫామ్ ని చూసి ప్రత్యర్థులకు వణుకు పుట్టింది, ఈ సీజన్ లో ఆయన ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడితే 199 స్ట్రైక్ రేట్ తో అందరికంటే టాప్ లో ఉన్నాడు. అజంక్యా రహానే అద్భుతమైన ఆట తీరుని గమనించి BCCI అతనిని జూన్ 7 వ తారీఖు నుండి ప్రారంభం అవ్వబొయ్యే ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్’ కి ఎంపిక చేసింది. గాయాలతో టీంకి దూరంగా ఉంటున్న శ్రేయస్ అయ్యర్ స్థానంలోకి రహానే ని తీసుకుంది. 

రహానే తో పాటుగా ఈ IPL సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న శార్దూల్ ఠాకూర్ ని కూడా ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్’ కి ఇండియన్ స్క్వాడ్ లోకి తీసుకుంది BCCI. రహానే మరియు శార్దూల్ ఠాకూర్ మాత్రమే కాకుండా  ఈ ఏడాది మార్చి నెలలో ఆడిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో ఉన్న టీం మేట్స్ మొత్తం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో పాల్గొనబోతున్నారు. ఇక రహానే ఈ IPL సీజన్ లో కేవలం 5 మ్యాచుల నుండి 209 స్కోర్ చేశాడు. అందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఈడెన్ గార్డెన్స్ లో KKR తో జరిగిన మ్యాచులో 71 పరుగులు తీసి నాటౌట్ గా నిల్చిన సంఘటన ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక ఇండియా తరుపున ఆయన ఇప్పటి వరకు 83 టెస్టులు ఆడగా, 4931 పరుగులు చేసాడు. 
ఇందులో 12 సెంచరీలు మరియు 25 అర్థ సెంచరీలు ఉన్నాయి, వీటిల్లో ఆయన బెస్ట్ ఇన్నింగ్స్ లో చేసిన స్కోర్ 188. ఇతగాడికి ఆస్ట్రేలియా టీం మీద మంచి రికార్డు ఉంది, ఇప్పటి వరకు ఆ టీం తో ఇండియా తలపడినప్పుడు రహానే వెయ్యి పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు మరియు 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక రహానే ఇండియా టీంకి కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో ‘బోర్డర్ గవాస్కర్’ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఇండియాకి ఈసారి జరగబోయే ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్’ టోర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకం కాబోతుంది. ఈసారి మన ఇండియన్ స్క్వాడ్ కూడా ఎంతో పటిష్టంగా ఉంది, బౌలింగ్ సైడ్ మరియు బ్యాటింగ్ సైడ్ ఈసారి ప్రత్యర్థులకు చుక్కలు చూపించబోతున్నారు. ఒకసారి మన ఇండియన్ టీం స్క్వాడ్ ని గమనిస్తే రోహిత్ శర్మ (captain) , శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజంక్యా రెహానే, KL రాహుల్ , KS భరత్, రవీంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, ఠాకూర్, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉండకూట్. మరి ఈ టీంతో ఈసారి వరల్డ్ కప్ కొడతామో లేదో చూడాలి.