ధోనీ చెప్పినట్టు వింటే చాలు: రహానే

అజింక్య రహానే ఒకప్పుడు టీమిండియాకు మంచి క్లాస్ బ్యాటర్. మంచి బ్యాటింగ్‌తో ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. తర్వాత ఫామ్ కోల్పోవడంతో అతని అవకాశాలు సన్నగిల్లాయి. గత ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టు తరఫున ఆడిన రహానేని.. ఆ ఫ్రాంచైజీ కొనసాగించలేదు. దీంతో అతన్ని మినీ వేలానికి విడుదల చేసింది. ఇక ఇతన్ని కొనుక్కున్న చెన్నై అతనితో అద్భుతాలే సృష్తోంది. కోల్‌కతా పైన కోపమో, లేదా మళ్ళీ ఇండియా జట్టులో చోటు సంపాదించాలనో.. కానీ, ఆదివారం కోల్‌కతాలోని […]

Share:

అజింక్య రహానే ఒకప్పుడు టీమిండియాకు మంచి క్లాస్ బ్యాటర్. మంచి బ్యాటింగ్‌తో ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. తర్వాత ఫామ్ కోల్పోవడంతో అతని అవకాశాలు సన్నగిల్లాయి. గత ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టు తరఫున ఆడిన రహానేని.. ఆ ఫ్రాంచైజీ కొనసాగించలేదు. దీంతో అతన్ని మినీ వేలానికి విడుదల చేసింది. ఇక ఇతన్ని కొనుక్కున్న చెన్నై అతనితో అద్భుతాలే సృష్తోంది. కోల్‌కతా పైన కోపమో, లేదా మళ్ళీ ఇండియా జట్టులో చోటు సంపాదించాలనో.. కానీ, ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్‌లో  తన మాజీ జట్టు బౌలర్లను చెడుగుడు ఆదుకున్నాడు. కేవలం 29 బంతుల్లో 71 పరుగులు చేసి కేకేఆర్ బౌలర్లను ఊచ కోతకోశాడు. ఇక ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే.. రహానేని కేవలం రూ.50 లక్షల బేస్ ధరకు CSK జట్టు దక్కించుకుంది. ఇతర జట్లన్నీ వద్దనుకున్న సమయంలో చెన్నై జట్టు అతడిలోని ప్రతిభను గుర్తించి సొంతం చేసుకోగా, అందుకు తగ్గట్టుగా న్యాయం చేస్తున్నాడు.

ఇక మ్యాచ్ అనంతరం అజింక్య రహానే మీడియాతో మాట్లాడాడు. ‘‘నేను నా బ్యాటింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేశాను. కానీ, నాలోని అత్యుత్తమ క్రికెటర్ ఇంకా బయటకు రాలేదని నేను భావిస్తున్నాను. ఇదే ఫామ్‌ను నేను రానున్న మ్యాచుల్లో కొసాగించాలని అనుకుంటున్నాను’’ అని తెలిపాడు. నేను ఇలా ఒత్తిడి లేకుండా ఆడటం వెనుక మహి భాయ్ పాత్ర ఉందని తెలిపాడు. ‘‘చెన్నె టీంలో అంతిమంగా నాకు ఆడే అవకాశం లభించింది. ఏడాది, రెండేళ్ల క్రితం పరిశీలిస్తే కనీసం ఆడేందుకు కూడా నాకు అవకాశం రాలేదు. ఆడే అవకాశం రానప్పుడు.. నేను కూడా ఆడగలనని, నేను అలాంటి షాట్లు ఆడగలనని ఎలా చూపించగలను’’ అని రహానే ప్రశ్నించాడు.

‘‘మహేంద్ర సింగ్ ధోనీ టీంలో ఆడడం అంటే గొప్పగా నేర్చుకోవడమే అని అన్నాడు. గతంలో ధోనీ నాయకత్వంలో జాతీయ జట్టుకు ఆడాను. కానీ, ధోనీ నాయకత్వం వహిస్తున్న చెన్నై టీం కోసం ఆడడం మాత్రం ఇదే మొదటిసారని, అతడు ఏది చెప్పినా వినాలి అనే భావనతో ఉన్నానని అన్నారు. నేను మాట్లాడకుండా.. నా బ్యాటుని మాత్రమే మాట్లాడనివ్వాలని అనుకుంటున్నాను. నేను వేరే వారి బ్యాటింగ్ కాపీ కొట్టకుండా నా ఆటనే ఆడుతున్నాను. ఒకరి విధానానికి మద్దతుగా నిలవడం ఎంతో  అవసరం’’ అని చెప్పిన రహానే.., తనకు ధోనీ భాయ్ పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టు వివరించాడు.

ఇదిలా ఉండగా అదే మ్యాచులో కోల్‌కతాపై చెన్నై 49 పరుగుల తేడాతో వియయం సాధించింది. రహానె (71 పరుగులు నాటౌట్,  29 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లు ), శివమ్‌ దూబె (50 పరుగులు; 21 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కాన్వే (56 పరుగులు; 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్ము దులిపి దంచి కొట్టడంతో మొదట చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లక్ష్య ఛేదన ప్రారంభించిన కేకేఆర్.. జేసన్‌ రాయ్‌ (61; 26 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు), రింకూ సింగ్‌ (53 పరుగులతో నాటౌట్‌; 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) గట్టిగానే పోరాడినా.. కోల్‌కతా 8 వికెట్లకు కేవలం 186 పరుగులే చేయగలిగింది. ఇంకా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు మ్యాచుల్లో విజయం సాధించిన  చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కాగా నైట్‌రైడర్స్‌కు మాత్రం ఇది వరుసగా నాలుగో ఓటమి.