సుకన్య సమృద్ధిలో రూ.250 పెడితే రూ.65 లక్షలు పొందే బంపర్ ఆఫర్

సుకన్య సమృద్ధిలో రూ.250 డిపాజిట్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసాని కల్పించేందుకు తీసుకువచ్చిన అద్భుతమైన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం సురక్షితం. అంతే కాకుండా మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మంచి రాబడి కూడా వస్తుంది. ప్రతి ఇంటిలో ఆడపిల్ల చదువులు, పెళ్లిళ్ల గురించి ఆందోళన చెందకుండా.. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే విముక్తి పొందేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. ఈ పథకంలో మీరు […]

Share:

సుకన్య సమృద్ధిలో రూ.250 డిపాజిట్ చేయండి

కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసాని కల్పించేందుకు తీసుకువచ్చిన అద్భుతమైన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం సురక్షితం. అంతే కాకుండా మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మంచి రాబడి కూడా వస్తుంది. ప్రతి ఇంటిలో ఆడపిల్ల చదువులు, పెళ్లిళ్ల గురించి ఆందోళన చెందకుండా.. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే విముక్తి పొందేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. ఈ పథకంలో మీరు కేవలం 250 రూపాయల పెట్టుబడిపై రూ. 65 లక్షలు పొందవచ్చు.. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

 ఖాతా ఎలా తెరవాలి? ఎవరు అర్హులు??

సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం రూపొందించారు. మీ కూతురు భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకంలో మీరు తక్కువ మొత్తంతో ఖాతా తెరవచ్చు.  10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆడ పిల్లల ఖాతాను వారి తల్లిదండ్రులు తెరవవచ్చు. ఇందులో కేవలం రూ. 250 పెట్టుబడితో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంటును మీకు సమీపంలోని ఏదైనా బ్యాంకు, లేదా.. పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీరు పెట్టిన డబ్బులకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఆడపిల్లల పేరు మీద మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలో కేవలం ఇద్దరు ఆడపిల్లల పేరు మీద ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒకవేళ కవల పిల్లలు, అంతకంటే ఎక్కువ మంది ఒకే కాన్పులో జన్మించి ఉంటే అప్పుడు రెండు కంటే ఎక్కువ ఖాతాలు ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

ఎన్నేళ్ళు డబ్బులు కట్టాలి.?

సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచిన తర్వాత 15 సంవత్సరాల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. తర్వాత డబ్బులు కట్టాల్సిన పనిలేదు. సుకన్య సమృద్ధి యోజన అకౌంటు మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత, కొంత డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బులు పొందొచ్చు. పదవ తరగతి చదివిన తర్వాత పైచదువుల కోసం కొంత డబ్బును తీసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. ఈ పథకంలో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. 

రూ.250 తో రూ.65 లక్షలు ఎలా.?

సుకన్య సమృద్ధి యోజన పథకంలో కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకంలో ప్రతిరోజు 250 రూపాయలు పెడితే అంటే ఒక నెలకు 12,500 డిపాజిట్ చేయాలి. ఇలా సంవత్సరానికి 1,50,000.. అంటే మొత్తం మీరు 22.50 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతారు. 15 సంవత్సరాల తరువాత, అంటే.. మీ కూతురు మెచ్యూరిటీకి 21 సంవత్సరాల వయసులో మీకు 65 లక్షల రూపాయలు అందుతాయి. ఇందులో మీకు సుమారు 41.15 లక్షల వడ్డీ లభిస్తుంది.