జికా వైరస్ కలకలం..

ఒకేసారి డెంగీ, మలేరియా, లెప్టో వ్యాధులు సోకి ఒక బాలుడు ముంబైలో మరణించాడు. ఈ ఘటన మరవక ముందే ముంబైలో జికా వైరస్ కలకలం మొదలైంది. ముంబైలో రెండో వైరస్ కేసుల నమోదైంది. 15 ఏళ్ల బాలిక జ్వరంతో ఆస్పత్రిలో చేరగా, పరీక్షలు నిర్వహించి జికా వైరస్ గా తేల్చారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ముంబైలో రెండో జికా వైరస్ కేసు నమోదైందని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మంగళవారం తెలిపింది. […]

Share:

ఒకేసారి డెంగీ, మలేరియా, లెప్టో వ్యాధులు సోకి ఒక బాలుడు ముంబైలో మరణించాడు. ఈ ఘటన మరవక ముందే ముంబైలో జికా వైరస్ కలకలం మొదలైంది. ముంబైలో రెండో వైరస్ కేసుల నమోదైంది. 15 ఏళ్ల బాలిక జ్వరంతో ఆస్పత్రిలో చేరగా, పరీక్షలు నిర్వహించి జికా వైరస్ గా తేల్చారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ముంబైలో రెండో జికా వైరస్ కేసు నమోదైందని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మంగళవారం తెలిపింది. అంతకుముందు ఆగస్టు 23న తొలి కేసు నమోదైంది.

తూర్పు ముంబైలోని కుర్లాకు చెందిన 15 ఏళ్ల బాలికకు జికా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. వ్యాధి తాలూకు లక్షణాలతో బాధపడుతున్న బాలిక ఆగస్టు 20న జ్వరం, తలనొప్పితో బాధపడుతున్న బాలిక మొదటగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఆ తరువాత ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.  జికా వైరస్‌ను తొలిసారిగా 1947లో ఉగాండాలోని జికా ఫారెస్ట్‌లో తొలిసారిగా గుర్తించారు.

2015లో అమెరికాలో, బ్రెజిల్‌తో పాటు పలు దేశాలకు సైతం వైరస్‌ సోకింది. ఆఫ్రికా, నైరుతి ఆసియా, పెసిఫిక్​ ద్వీపాల్లో జికా వైరస్​ కలకలం సృష్టించింది. 2016లో బ్రెజిల్​లో ఈ వైరస్‌ కారణంగా సంక్షోభం ఏర్పడగా.. ఆ దేశాన్ని సంక్షోభాన్ని కుదిపేసింది. భారత్‌లో కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. జికా వైరస్‌ సాధారణంగా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏడిస్‌ దోమల కారణంగా సోకుతుంది. మనిషిని కుడితే.. జికా సోకే ప్రమాదం ఉంటుంది.

జికా వైరస్ ప్రధానంగా ఏడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మహిళలకు గర్భధారణ సమయంలో ఈ వైరస్ సోకితే పుట్టే పిల్లలు కొన్ని లోపాలతో పుట్టే అవకాశం ఉంది. జ్వరం, శరీంపై దద్దుర్లు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కళ్లు ఎర్రబడటం, కండరాల నొప్పులు జికా వ్యాధి లక్షణాలుగా ఉంటాయి. జికా వ్యాధికి వ్యాక్సిన్ లేదు. దీనికి సరైన మందులు కూడా లేవు. అయితే లక్షణాలను అనుసరించి చికిత్స చేస్తారు. అంతకుముందు చెంబూర్ కు చెందిన 79 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

అసలు జికా వైరస్ వ్యాధి అంటే ఏంటి?

ఈడెస్ ఈజిప్టి, ఏడెస్ ఆల్బోపిక్టస్ వంటి ఇన్‌ఫెక్టెడ్‌ ఏడెస్ దోమ జాతులు కుట్టడం ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ గర్భిణి నుంచి ఆమె పిండానికి కూడా వ్యాపిస్తుంది. బిడ్డ పుట్టుకతో వచ్చే లోపాలతో జన్మించవచ్చు. ఇది లైంగిక చర్యల ద్వారా కూడా సంక్రమించవచ్చు. 1947లో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఉగాండాలోని జికా ఫారెస్ట్ పేరు పెట్టారు. రీసస్ మకాక్ కోతిలో వైరస్ గుర్తించారు. ఆఫ్రికాలో మనుషులకు జికా వైరస్‌ సోకిన కేసులను 1952లో గుర్తించారు.

వ్యాధి లక్షణాలు

జికా వైరస్ సోకిన చాలా మంది వ్యక్తుల్లో లక్షణాలు కనిపించవు. వ్యాధి సోకిన మూడు నుంచి 14 రోజుల తర్వాత లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. దద్దుర్లు, జ్వరం, కండరాలు, కీళ్ల నొప్పులు, కండ్లకలక, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా రెండు నుంచి ఏడు రోజుల వరకు ఉంటాయి. ఈ లక్షణాలు ఇతర ఆర్బోవైరల్, నాన్-ఆర్బోవైరల్ వ్యాధులలో కూడా కనిపిస్తాయి కాబట్టి.. జికా వైరస్ సోకిందని నిర్ధారించడానికి ల్యాబ్‌ టెస్ట్‌ అవసరం. ఆర్బోవైరల్ వ్యాధులు అంటే దోమలు, పేలు వంటి ఆర్థ్రోపోడ్‌ల కాటు ద్వారా ప్రజలకు వ్యాపించే వైరస్‌ల వల్ల కలిగే అంటువ్యాధులు.

వ్యాధి తీవ్రత

సాధారణంగా చాలా మంది ప్రజలు తాము జికా వైరస్‌ బారిన పడినట్లు గుర్తించరు. ఎందుకంటే ఆస్పత్రికి వెళ్లాలనే స్థాయిలో వారిలో సమస్యలు కనిపించవు. ఈ వ్యాధిలో మనుషులు ప్రాణాలు కోల్పోవడం అరుదుగా జరుగుతుంది. జికా వైరస్ సాధారణంగా ఒక వారం పాటు సోకిన వ్యక్తి రక్తంలో ఉంటుంది. జికా వైరస్‌ సోకిన లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

జికా వైరస్ ఎలాంటి సమస్యలకు దారి తీస్తుంది?

గర్భిణులకు జికా వైరస్ సోకితే.. బిడ్డకు మైక్రోసెఫాలీ లేదా ఇతర పుట్టుకతో వచ్చే వైకల్యాలు ఉండవచ్చు. వీటిలో హై మజిల్‌ టోన్‌, వినికిడి లోపం, అవయవాల సంకోచాలు, కంటి సమస్యలు ఉన్నాయి. ముందస్తుగా ప్రసవం అయ్యే అవకాశం కూడా ఉంది. WHO ప్రకారం.. గర్భధారణ సమయంలో జికా వైరస్ సోకిన మహిళలకు జన్మించిన ఐదు నుంచి 15 శాతం మంది పిల్లలు జికా సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నారు. 

జికా వైరస్ వ్యాధిని ఎలా నివారించవచ్చు?

ప్రజలు దోమలు కుట్టకుండా చర్యలు తీసుకోవాలి. లైంగిక సంపర్కం సమయంలో కండోమ్‌ల వంటివి ఉపయోగించడం ద్వారా జికా వైరస్‌ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. జికా వైరస్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. దోమలను ఆకర్షించకుండా ఉండేందుకు లేత రంగు దుస్తులు ఎంపిక చేసుకోవాలి. వ్యక్తిగత వస్తువులను పెర్మెత్రిన్ అనే క్రిమిసంహారక మందులతో క్లీన్ చేయాలి. 

ప్రజలు ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కింద రిజిస్టర్ అయిన క్రిమి సంహారక మందులను ఉపయోగించవచ్చు. ప్రజలు తమ రెండు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దోమ తెరలు తప్పక వినియోగించాలి. గర్భిణులు కూడా దోమతెరల్లోనే పడుకోవాలి. ఏడిస్ దోమలు నీరు నిల్వ ఉన్నచోట సంతానోత్పత్తి చేస్తాయి. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.