వైఎస్సార్‌సీపీ ప్ర‌త్య‌ర్ధి ఓట్ల‌ను డిలీట్ చేస్తోంది: టీడీపీ

మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా సరే తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అటు అధికార పార్టీ వైఎస్సార్‌సీపీతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలలో తమ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు బురదదజల్లే ప్రయత్నం చేస్తుండగా.. మరొకవైపు ప్రతిపక్ష పార్టీలు చేయని పనులను ఎత్తి చూపిస్తూ అధికార పార్టీ తాము ప్రవేశపెట్టిన […]

Share:

మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా సరే తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అటు అధికార పార్టీ వైఎస్సార్‌సీపీతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలలో తమ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు బురదదజల్లే ప్రయత్నం చేస్తుండగా.. మరొకవైపు ప్రతిపక్ష పార్టీలు చేయని పనులను ఎత్తి చూపిస్తూ అధికార పార్టీ తాము ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను మరొకసారి ప్రజలకు గుర్తు చేస్తూ 175 సీట్లు టార్గెట్ గా ముందుకి అడుగు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించే దిశగా ప్రతిపక్ష పార్టీలు రకరకాల మేనేఫెస్టోలను కూడా ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే అధికార పార్టీ వైఎస్ఆర్సిపి కూడా తన మేనిఫెస్టోను ఎన్నికలకు ముందు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తన మేనఫెస్టోని రూపొందించి ప్రజలకు పథకాల వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు బాగా తెలుసు అని ఎవరికి వారు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోని తాజాగా అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం శ్రేణులు రకరకాలుగా విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగానే ఎన్నికల సలహా సంస్థ ఐ పాక్ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించడానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ తెలుగుదేశం తాజాగా ఆరోపణలు చేసింది. ప్రకాశం జిల్లా కొండేపి లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీఎస్ అధికార ప్రతినిధులు ఆనం వెంకటరమణారెడ్డి,  నీలాయపాలెం విజయకుమార్ లు  మాట్లాడుతూ గ్రామ , వార్డు వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని అధికార వైఎస్ఆర్సిపి పార్టీ రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తోందని వారు ఆరోపించారు. ఇక ఏమాత్రం టెండర్ ప్రక్రియ చేయకుండానే పరిమిత అనుభవం ఉన్న కన్సార్టియం కు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం డేటా కాంట్రాక్ట్ ను అప్పగించిందని ఏపీ ప్రజల నుండి సేకరించిన డేటాను నిర్వహించడానికి ఎటువంటి మార్గదర్శకాలు కానీ ఎటువంటి సైబర్ ప్రోటోకాల్ ఏర్పాటు చేయలేదని ఎత్తిచూపారు. ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ కన్సార్టియం యొక్క భద్రత ఆధారాలు కూడా సరిగ్గా లెక్క చేయబడలేదు అంటూ కూడా హేళన చేశారు.

దీనిపై స్పందించిన అధికార ప్రతినిధులు.. ఇది  వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచడం పై సందేహాలను లేవనెత్తుతుందని కూడా వెల్లడించారు ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కపట నాయకుడిగా అభివర్ణిస్తున్నారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే ఆధార్ నంబర్లను సేకరిస్తున్నారని కూడా ఆరోపించారు. ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారని దీని వల్ల మహిళల భద్రత  ప్రమాదంలో పడుతుందని జగన్ తప్పుడు ఆరోపణ చేశారని.. ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సారథ్యంలో రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత వివరాలతో కూడిన కుటుంబాల సమగ్ర వివరాల సేకరణకు శ్రీకారం చుట్టారని కూడా తెలుగుదేశం ఆరోపించింది. ఇక మహిళల భద్రత శ్రేయస్సు కోసమే ఎటువంటి ఆటుపోట్లు జరగకుండా అన్ని విషయాలలో భద్రత కల్పిస్తామని అధికార పార్టీ చెబుతుండగా తాము చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్పా అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. మరి దీనిపై ఎవరు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.