గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ప్రమాదంలో యువకుడు మృతి 

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదం వల్ల చనిపోయే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఆదివారం గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతికేళ్ల యువకుడు మృతి చెందాడు.  ప్రమాదం ఎలా జరిగింది:  పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, మరణించిన యువకుడు పేరు మధు. ఇతను ఇతని స్నేహితుడితోపాటు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గచ్చిబౌలి లో ఉన్న బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద డివైడర్ ని ఢీ […]

Share:

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదం వల్ల చనిపోయే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఆదివారం గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతికేళ్ల యువకుడు మృతి చెందాడు. 

ప్రమాదం ఎలా జరిగింది: 

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, మరణించిన యువకుడు పేరు మధు. ఇతను ఇతని స్నేహితుడితోపాటు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గచ్చిబౌలి లో ఉన్న బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద డివైడర్ ని ఢీ కొట్టి పడిపోయారని తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న మధు చనిపోయినట్లు.. తనతో పాటు ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.

ప్రమాదాలలో ఎక్కువగా యూత్: 

ఇలాంటి రోడ్డు ప్రమాదాలు భారతదేశంలో నలుమూలలా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యూత్ తమ ద్విచక్ర వాహనాలతో విచ్చలవిడిగా అతివేగంతో తిరగడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, పోటీ పడుతూ వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పోలీసులు, కొంతమంది రష్ గా డ్రైవ్ చేస్తున్న వారికి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరగడం యూత్ కి చేసే పొరపాటు వల్లే ఇప్పుడు అనేకమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

ద్విచక్ర వాహనాలే కాక కార్ లో కూడా అతివేగంగా వెళ్తూ, పోటీ పడుతూ వెళ్లడం వల్ల, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఇది ఇతర వాహనదారులకి చాలా ప్రమాదకరం. యూత్ ఇప్పుడు మద్యపానానికి మరియు చెడు వ్యసనాలకి అలవాటు పడి వారి మైకంలో ఏం చేస్తున్నారో తెలియక ఇతర వాహనాలన్నిటి ఢీ కొడుతున్నారు. ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి.

ఇలాగే మరొక ప్రమాదం: 

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఆ యువకుడు మద్యం సేవించి వాహనం నడిపినట్లు మరియు మత్తు పదార్థాలు తీసుకున్నట్లు ఆ మైకంలో తను అతివేగంగా వచ్చి డివైడర్ ని ఢీ కొట్టినట్లు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే మృతి చెందాడని తెలిపారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నప్పటికీ సమాజంలో యువత మార్పు చెందలేకపోతున్నారు. దీనిపై చాలా కీలక అంశాలను ప్రభుత్వం చర్చించిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది.

ప్రముఖ సినీ నటుడు రవితేజ తమ్ముడు కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పోలీస్ వారు తెలిపిన సమాచారం ప్రకారం అతను మత్తు పదార్థాలు తీసుకున్నట్లు మరియు మద్యం సేవించి ఉన్నట్లు అయితే ఆ మత్తులో దాదాపు 140 కిలోమీటర్ల పైగా వేగంతో కారులో దూసుకుని వెళ్లి స్తంభాన్ని ఢీకొన్నట్లు చెప్పారు. ఆ ప్రమాదంలో అతను వెంటనే చనిపోయినట్లు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో వస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. యూత్ విషయంలో కీలక అంశాలు చర్చించేలాగా కొత్త విధానాలు రావాలి ఇలా చేసినట్లయితే మనం రోడ్డు ప్రమాదాలు నుండి బయటపడొచ్చు. ఇప్పుడు జరిగిన సంఘటనలో, యువకుడు రాత్రి పూట ప్రయాణించడమే పొరపాటుగా మారింది. రాత్రులు స్పీడ్ గా ప్రయాణాలు చేయడం ఎవరికి మంచిది కాదు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అంటున్నారు. మనకి తెలియకుండా మన ఎదురుగా వచ్చేది కూడా కనిపించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిసింది.