Young Indian: యంగ్ ఇండియన్, AJL మీద మనీలాండరింగ్ కేసు

కాంగ్రెస్ కి సంబంధం ఏమిటి?

Courtesy: Twitter

Share:

Young Indian: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల, యంగ్ ఇండియన్ (Young Indian), AJL మీద మనీలాండరింగ్ మీద రూ.751.9 కోట్లు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ప్రకటించింది. ఇదే సందర్భంలో యంగ్ ఇండియన్ (Young Indian) అదేవిధంగా కాంగ్రెస్ (Congress) మధ్య ఉన్న సంబంధాలు బయటపడుతున్నట్లు, దీనికి సంబంధించి కాంగ్రెస్ (Congress) ఏ విధంగా స్పందించింది అనే దాని గురించి వార్తలు వినిపిస్తున్నాయి. 

యంగ్ ఇండియన్, AJL మీద మనీలాండరింగ్ కేసు: 

యంగ్ ఇండియన్ (Young Indian), అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌పై మనీలాండరింగ్ కేసులో రూ. 751.9 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన వివరాలను వెంటనే సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక పబ్లిషర్ అయిన AJL ఆస్తులకు, ఆరోపణలకు గాంధీ కుటుంబంతో ముడిపడి ఉన్న యంగ్ ఇండియన్ (Young Indian) కూడా ED స్కానర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ED ప్రకటనపై ప్రతిస్పందిస్తూ, కాంగ్రెస్ (Congress) బిజెపిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది, అయితే బీజేపీకి చాలా రాష్ట్రాలలో ఓటమి తప్పదు అని తెలుసుకుని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ (Congress) ఆరోపించింది. 

ED ప్రతినిధి మాట్లాడుతూ, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) భారతదేశంలోని ఢిల్లీ, ముంబై మరియు లక్నో వంటి అనేక నగరాల్లో ఉన్న స్థిరాస్తుల రూపంలో కొన్ని కోట్లు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. రూ. 661.69 కోట్లు, యంగ్ ఇండియన్ (Young Indian) (YI) AJL యొక్క ఈక్విటీ షేర్లలో పెట్టుబడి రూపంలో రూ. 90.21 కోట్ల మేరకు బయటపడినట్లు వెల్లడించారు. జూన్ 26, 2014లో ఒకరి నుంచి అందిన ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత ED మనీ-లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.

కేసులు నమోదు: 

ఐపీసీ సెక్షన్ 406, 420 (మోసం), 403 (నిజాయితీ లేని ఆస్థిని దుర్వినియోగం చేయడం), 120-బి (నేరపూరిత కుట్ర) కింద నేరారోపణలకు పాల్పడ్డారని, యంగ్ ఇండియాతో సహా ఏడుగురు నిందితులు ప్రాథమికంగా నేరాలకు పాల్పడ్డారని న్యాయస్థానం పేర్కొంది. యంగ్ ఇండియన్ (Young Indian) ద్వారా AJL వందల కోట్ల విలువైన ఆస్తులను సంపాదించడానికి నిందితులు నేరపూరిత కుట్ర పన్నారని న్యాయస్థానం పేర్కొంది అని ED ప్రతినిధి తెలిపారు.

ED ప్రకారం, వార్తాపత్రికలను ప్రచురించడం కోసం AJLకి భారతదేశంలోని వివిధ నగరాల్లో రాయితీ ధరలపై భూమిని అప్పజెప్పేసారు. AJL 2008లో దాని ప్రింటింగ్ కి సంబంధించిన కార్యకలాపాలను మూసివేసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఆస్తులను ఉపయోగించడం ప్రారంభించింది. AJL ఆల్ ఇండియా కాంగ్రెస్ (Congress) కమిటీ (AICC)కి 90.21 కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించవలసి వచ్చింది. అయితే, AICC AJL నుండి రూ.90.21 కోట్ల రుణాన్ని రికవరీ చేయడం జరగలేదని, రూ. 50 లక్షలు చెల్లించడానికి ఎటువంటి ఆదాయ వనరు లేకుండా కొత్తగా ఇన్కార్పొరేటెడ్ కంపెనీ, యంగ్ ఇండియన్ (Young Indian)‌కు రూ. 50 లక్షలకు విక్రయించింది. ఇలా చాలావరకు రుణాన్ని చెల్లించే విషయంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెలువడ్డాయి. 

ఈ విషయం మీద కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే ట్విట్టర్లో పేర్కొంటూ, ED అనౌన్స్ చేసిన AJLకు సంబంధించిన రిపోర్టులు చూస్తుంటే, బీజేపీ ఓటమికి భయపడి ఇవన్నీ చేయిస్తుందని స్పష్టంగా కనిపిస్తున్నాయని మాట్లాడారు. మరి ముఖ్యంగా ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, అదేవిధంగా మిజోరంలో ఓడిపోతామని భావించి, ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉందని బిజెపి మీద ఆరోపించారు.