అన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయా

ఇలా చేయండి.. ఇక మీకు తిరుగుండదు ప్రతి మనిషి జీవితంలో కష్టసుఖాలు కామన్​గా ఉంటాయి. కానీ కొంత మందికి కష్టాలు మరీ ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారు తమకు శని పట్టుకుందని భావిస్తూ ఉంటారు. శని కూడా ఒక రకమైన దేవుడే. శని పట్టుకుంటే ఏడు సంవత్సరాల దాకా పోదని అంతా నమ్ముతారు. కానీ కొన్ని రకాల పూజలు చేసి, శని చెడు దృష్టి నుంచి మనం తప్పించుకోవచ్చు. అటువంటి పూజలకు తప్పకుండా ఫలితం ఉంటుందని చాలా […]

Share:

ఇలా చేయండి.. ఇక మీకు తిరుగుండదు

ప్రతి మనిషి జీవితంలో కష్టసుఖాలు కామన్​గా ఉంటాయి. కానీ కొంత మందికి కష్టాలు మరీ ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారు తమకు శని పట్టుకుందని భావిస్తూ ఉంటారు. శని కూడా ఒక రకమైన దేవుడే. శని పట్టుకుంటే ఏడు సంవత్సరాల దాకా పోదని అంతా నమ్ముతారు. కానీ కొన్ని రకాల పూజలు చేసి, శని చెడు దృష్టి నుంచి మనం తప్పించుకోవచ్చు. అటువంటి పూజలకు తప్పకుండా ఫలితం ఉంటుందని చాలా మంది జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ పూజలు చేయడం వల్ల మనశ్శాంతి కూడా లభిస్తుందని చెబుతున్నారు. ఆ పూజలేంటో ఓ లుక్కేద్దాం..

కర్మ ఫలమే శని ప్రభావం..

తమ కర్మ ఫలం అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరని అనేక మంది చెబుతూ ఉంటారు. కర్మ ఫలాలను మనతో అనుభవింపజేసేవాడే శని దేవుడుని చాలా మంది విశ్వసిస్తారు. మనిషిపై శని ప్రభావం తగ్గేందుకు రకరకాల పూజలను చేయమని సిఫారసు చేస్తారు. శని దేవుడు కనుక మన విషయంలో కరుణ చూపితే, ఇక మనం అనుకున్న అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయని నమ్ముతారు. అటువంటి వారికి తిరుగుండదట. వారు పట్టిందల్లా బంగారం అవుతుందని చెబుతారు. అలా కాకుండా శని దేవుడి చెడు దృష్టి కానీ మన మీద పడితే ఏ పనులు సక్రమంగా జరగవని.. అందుకే శని అనుగ్రహం తప్పకుండా పొందాలని అంటారు. చాలా దేవాలయాల్లో నవగ్రహ మంటపాలు ఉంటాయి. ఆ నవగ్రహ మంటపాల్లో శని దేవుడు తప్పనిసరిగా ఉంటాడు. శని దేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు అనేక మంది అనేక రకాల పూజలు చేస్తారు. 

శివారాధన చేయండి

శని దేవునికి ఎంతో ప్రీతికరమైన వాటిలో శివలింగం ఒకటని అంతా చెబుతారు. శివలింగాన్ని పూజించడం వల్ల శని ప్రభావం తగ్గిపోతుందని చెబుతారు. శని ప్రభావంతో బాధపడే వారు శివలింగానికి అభిషేకాలు చేయాలని చాలా మంది సూచిస్తారు. అంతే కాకుండా నల్ల నువ్వులు కూడా శని దేవునికి ప్రీతిపరమైన ఆహారాల్లో ఒకటిగా ఉంటూ వస్తున్నాయి. అందుకే నల్ల నువ్వులు ఉన్న ఆహారాలను పశు, పక్షాదులకు పెట్టడం వలన శని దోషాలు తగ్గిపోతాయని అంతా నమ్ముతారు. 

ఆ రోజు ప్రసాదాలు పంచండి

శనివారం రోజు శివాలయంలో ప్రసాదాలు పంచడం వలన మరియు నల్ల నువ్వులను కలిపి కాకులకు ఆహారంగా పెట్టడం వలన కూడా శని దోషం పోతుందని పలువురు పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా సుందరకాండ చదివినా కూడా శని ప్రభావం నుంచి తొందరగా బయటపడొచ్చని పేర్కొంటున్నారు. పూజలు నిర్వహించేటపుడు నల్లని దుస్తులు ధరించి నీలం రంగు పూలతో శనీశ్వరునికి పూజలు చేయాలని చెబుతారు.  శని ప్రభావం ఉందని ఎక్కువగా భావించేవారు ఇలా చేయడం వలన వారికి మానసిక ప్రశాంతతతో పాటుగా అష్టైశ్వర్యాలు కూడా కలిగే చాన్స్ ఉంది.