కనువిందు చేస్తున్న యశో భూమి అందాలు 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఉన్న ఫస్ట్ ఫేస్ ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యశో భూమి ఓపెనింగ్ జరిగింది. సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో నిర్మించిన యశో భూమి ప్రత్యేకతలు ఎన్నో. ఓపెనింగ్ జరిగిన రోజు యశో భూమి లోపల అందాలు చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారని చెప్పుకోవాలి. అంతేకాకుండా, ఇటువంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలతో భారతదేశం మరింత ముందుకు సాగుతోందని, ఇక మనకి ఏది అడ్డు […]

Share:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఉన్న ఫస్ట్ ఫేస్ ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యశో భూమి ఓపెనింగ్ జరిగింది. సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో నిర్మించిన యశో భూమి ప్రత్యేకతలు ఎన్నో. ఓపెనింగ్ జరిగిన రోజు యశో భూమి లోపల అందాలు చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారని చెప్పుకోవాలి. అంతేకాకుండా, ఇటువంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలతో భారతదేశం మరింత ముందుకు సాగుతోందని, ఇక మనకి ఏది అడ్డు ఉండదని మోదీ ప్రసంగించారు.

యశో భూమి విశేషాలు: 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా ద్వారకలో యశోభూమి పేరుతో భారత అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, ₹ 5,400 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫస్ట్ ఫేస్ ప్రస్తుతం ప్రారంభించారు. కన్వెన్షన్ సెంటర్ 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించినట్లు అంచనా. ఇందులో ప్రధాన ఆడిటోరియం, గ్రాండ్ బాల్‌రూమ్, మొత్తం 11,000 మంది ప్రతినిధులు ఒకేసారి సమావేశం అయ్యే 13 సమావేశ గదులతో సహా, 15 మీటింగు రూమ్స్ ఉన్నట్టు సమాచారం.

‘యశోభూమి’ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు, మోదీ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రతి ఒక్కరిని కూడా కొనియాడారు. ముఖ్యంగా ఇందులో ఆధునిక మురుగునీటి శుద్ధి వ్యవస్థ ఉంది, రెయిన్వాటర్ హార్వెస్టింగ్ కోసం కంట్రోలర్స్, కాంప్లెక్స్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి ప్లాటినం సర్టిఫికేషన్ పొందింది, అంటూ మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

కట్టుదిట్టమైన సెక్యూరిటీ: 

మోదీ పుట్టినరోజు సందర్భంగా జరగబోయే యశో భూమి ఇనోగ్రేషన్ దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ పోలీసులు శనివారం జాతీయ రహదారి-48 (NH-48)పై సాధ్యమయ్యే ఆంక్షలు వివరిస్తూ ట్రాఫిక్ రూల్స్ అనేవి కొన్ని జారీ చేశారు. NH-48 నుండి నిర్మల్ ధామ్ నాలా లేదా అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ 2 (UER-II) రోజంతా అలాగే ఉంటుందని, ప్రయాణికులు ఈ మార్గంలో వెళ్లే అనుమతి ఉండదని పేర్కొన్నారు పోలీసులు.

విమర్శలు కురిపించిన కాంగ్రెస్: 

ఇక మరోవైపు చూసుకుంటే..ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రారంభంపై ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు కురిపించే అవకాశాన్ని వదిలిపెట్టలేదు కాంగ్రెస్. అంతేకాకుండా మన ప్రధానమంత్రి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరో జిమ్ముక్కు లాంటిది చేస్తున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా కుల జనాభా గణన విషయంలో బిజెపి ఎందుకు మౌనం వహిస్తుందో అంటూ కాంగ్రెస్ నిలదీసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ ప్రజలు మళ్లీ మోసపోరని, ఇది ప్రధాని మోదీ పదవీ విరమణకు సమయం అని అన్నారు.

ఆదివారం, మోదీ సంప్రదాయ కళాకారులు మరియు చేతివృత్తుల కోసం ₹13,000 కోట్ల ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించారు. ఢిల్లీలోని ద్వారకలో అత్యాధునిక ‘యశోభూమి’ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (IICC) ఫస్ట్ ఫేస్ ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా జరిగిన పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభోత్సవంలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని, హస్తకళాకారులకు పీఎం విశ్వకర్మ పథకం గుర్తింపునిస్తుందని అన్నారు.

రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, 2014 నుండి చిన్న-స్థాయి కళాకారులను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించామని.. PM విశ్వకర్మ పథకం చిన్నస్థాయి కళాకారులకు గుర్తింపును ఇస్తుందని.. ఈ పథకం కింద, హస్తకళాకారులకు శిక్షణ కూడా అందించబడుతుందని.. తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా శిక్షణ సమయంలో, హస్తకళాకారులకు రోజుకు ₹500 అందజేయబడుతుందని..వారికి వారి స్వంత వ్యాపారం ప్రారంభించడానికి, అతి తక్కువ వడ్డీ రేటు ఉన్న రుణాలు కూడా అందించడం జరుగుతుందని.. రాజ్ నాథ్ సింగ్ వివరంగా తెలియజేశారు.