17 సంవత్సరాల క్రితం దొంగిలించబడిన ప్రపంచపు మొట్టమొదటి తమిళ బైబిల్ ఎక్కడ ఉందో తెలిసింది

అప్పటి తంజావూరు పాలకుడు తులాజీ రాజా సెర్ఫోజీ బైబిల్‌ను ష్వార్ట్జ్ అనే మరో మిషనరీకి బదిలీ చేశాడు భారతదేశం ఎంతో పురాతనమైన సంస్కృతీ గల దేశం. మన దేశంలో జాతి, సంస్కృతి భేదాలు లేకుండా అన్ని మతాలు, సంస్కృతులకు చెందిన ఎన్నో చారిత్రిక వస్తువులు, కళా ఖండాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన గొప్ప గొప్ప కళాఖండాలు, చారిత్రిక వస్తువులు ఎన్నో దేశాలకు అక్రమ రవాణా ద్వారా తరలించబడ్డాయి. అయితే వీటిని కనిపెట్టడానికి, జాడ తెలుసుకోవడానికి మన […]

Share:

అప్పటి తంజావూరు పాలకుడు తులాజీ రాజా సెర్ఫోజీ బైబిల్‌ను ష్వార్ట్జ్ అనే మరో మిషనరీకి బదిలీ చేశాడు

భారతదేశం ఎంతో పురాతనమైన సంస్కృతీ గల దేశం. మన దేశంలో జాతి, సంస్కృతి భేదాలు లేకుండా అన్ని మతాలు, సంస్కృతులకు చెందిన ఎన్నో చారిత్రిక వస్తువులు, కళా ఖండాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన గొప్ప గొప్ప కళాఖండాలు, చారిత్రిక వస్తువులు ఎన్నో దేశాలకు అక్రమ రవాణా ద్వారా తరలించబడ్డాయి. అయితే వీటిని కనిపెట్టడానికి, జాడ తెలుసుకోవడానికి మన దేశంలోని పోలీసులు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని వస్తువులను కనిపెట్టడంలో విజయం సాధిస్తున్నారు కూడా. అటువంటి సంఘటనే తమిళనాడు పోలీసు శాఖలో చోటుచేసుకుంది. ఇది పోలీసు శాఖ విజయంగా భావించవచ్చు.

ప్రపంచంలోనే మొట్టమొదటి తమిళ బైబిల్ 2005లో తంజావూరు నుండి దొంగిలించబడింది. అయితే అది లండన్‌లోని కింగ్స్ కాలేజీలో కనుగొనబడింది. పోలీసులు గత 17 సంవత్సరాలుగా బైబిల్ జాడ కనిపెట్టలేకపోయారు. అయితే ఇప్పుడు తమిళనాడు పోలీసులు అది ఎక్కడ ఉందన్నదాన్ని కనుగొన్నారు. ఈ గ్రంథాలు 300 సంవత్సరాల నాటివి. తమిళ భాషలోకి కొత్తనువాదం 1715లో జరిగింది. తమిళనాడులోని తరగంబాడిలో డానిష్ క్రిస్టియన్ మిషనరీ బార్తోలోమేయస్ జీగెన్‌బాల్గ్ దీనిని తమిళంలోనికి అనువాదం చేశారు. 

భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి ప్రొటెస్టంట్ మిషనరీలలో ఒకటైన జీగెన్‌బాల్గ్ ద్వారా తమిళంలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ నిర్మించబడింది. దానిని ఆయనే ముద్రించారు. నివేదికల ప్రకారం.. అప్పటి తంజావూరు పాలకుడు తులాజీ రాజా సెర్ఫోజీ బైబిల్‌ను ష్వార్ట్జ్ అనే మరో మిషనరీకి బదిలీ చేశాడు. ఆ బైబిల్లో తంజావూరు పాలకుడి సంతకం కూడా ఉంది.

ఈ బైబిల్ తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో.. తంజావూరులోని సరస్వతి మహల్ మ్యూజియంలో ఉంచబడింది. కాగా.. 2005లో తంజావూరు వెస్ట్ స్టేషన్‌లో బైబిల్ పోయిందని ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో ఏమీ తేలలేదు. 2017లో ఐడల్ వింగ్ సీఐడీ తాజా దర్యాప్తు ప్రారంభించింది. ఆ కాలంలో తమిళ బైబిల్ దొంగిలించబడిన రోజున అక్టోబర్ 7, 2015న సందర్శించిన విదేశీ పర్యాటకులు ఆ  సరస్వతి మహల్ మ్యూజియంను సందర్శించినట్లు ఈ బృందం గుర్తించింది. వీరే ఆ బైబిల్ పోవడానికి కారకులని ఊహిస్తున్నారు. 

డానిష్ మిషనరీ  జిగెన్‌బాల్గ్ బైబిల్‌ని కొట్టేయడానికే ఆ సందర్శకులు తంజావూరు నగరానికి వచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక ప్రకటనలో ఇచ్చిన నివేదికను బట్టి, పోలీసులు ఇలా చెప్పినట్లు తెలుస్తోంది, “విదేశీ సందర్శకులపై అనుమానం వచ్చినప్పుడు, ప్రపంచంలోని వివిధ మ్యూజియంల వెబ్‌సైట్‌లు, కలెక్టర్ వెబ్‌సైట్‌లు, జిగెన్‌బాల్గ్‌ బైబిల్‌తో సంబంధమున్న సంస్థలలో ఐడల్ వింగ్ దర్యాప్తు కొనసాగించింది.

ఆ తరువాతి పరిశోధన, వారిని కింగ్స్ కళాశాల వెబ్‌సైట్‌కి తీసుకెళ్లింది. అక్కడ వారు కింగ్ జార్జ్ III యొక్క వ్యక్తిగత సేకరణ ఉందని చూశారు. అక్కడ, వారు అసలు తమిళ బైబిల్‌ను కూడా గుర్తించారు.

అయితే యునెస్కోతో ఒప్పందం చేసుకొని, సరస్వతి మహల్ మ్యూజియంకు ఆ బైబిల్‌ను తిరిగి తీసుకురావడానికి ఐడల్ వింగ్ వివిధ చర్యలను చేపట్టింది.

ఇదే విధంగా మన దేశంలోని పోలీసులు మిగిలిన కళాఖండాలను కూడా ఇదేవిధంగా కనిపెట్టి మనదేశానికి తిరిగి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.