నేల పైనే నిద్రించిన DCW చీఫ్

DCW చీఫ్ స్వాతి మలివాల్ గురించి తెలియని నెటిజన్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఢిల్లీ మంత్రుల పేర్లయినా చాలా మందికి తెలియకపోవచ్చు కానీ వుమెన్ కమిషన్ చీఫ్ మాత్రం అందరికీ సుపరిచితం. ఇప్పటికే ఎన్నో వివాదాలతో కాలం వెళ్లదీసిన చీఫ్ తాజాగా మరో వివాదంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఢిల్లీలో మైనర్ బాలికపై అత్యాచారం జరగ్గా.. ఆ బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను కలిసేందుకు స్వాతి మలివాల్ ప్రయత్నించగా.. ఢిల్లీ పోలీసులు […]

Share:

DCW చీఫ్ స్వాతి మలివాల్ గురించి తెలియని నెటిజన్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఢిల్లీ మంత్రుల పేర్లయినా చాలా మందికి తెలియకపోవచ్చు కానీ వుమెన్ కమిషన్ చీఫ్ మాత్రం అందరికీ సుపరిచితం. ఇప్పటికే ఎన్నో వివాదాలతో కాలం వెళ్లదీసిన చీఫ్ తాజాగా మరో వివాదంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఢిల్లీలో మైనర్ బాలికపై అత్యాచారం జరగ్గా.. ఆ బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను కలిసేందుకు స్వాతి మలివాల్ ప్రయత్నించగా.. ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె ఆసుపత్రి ఆవరణలోనే బైఠాయించారు. రాత్రి కూడా ఆవరణలోనే నిద్రించారు. బాధితురాలితో తనను మాట్లాడించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తానని స్వాతి మలివాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ పోలీసులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 

ఏం జరిగిందంటే… 

ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి మైనర్ బాలికను దాదాపు ఏడాది నుంచి రేప్ చేస్తూ వస్తున్నాడు. ఇన్నాళ్లూ గుట్టుగా సాగిన వ్యవహారం రీసెంట్ గా వెలుగు చూసింది. ఢిల్లీ మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధిలో డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ ఖాఖా నవంబర్ 2020 నుంచి 2021 వరకు ఓ మైనర్ బాలిక మీద అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ బాలికను అధికారులు ఆసుపత్రికి తరలించారు. దామోదర్ ఖాఖా దంపతుల మీద కేస్ నమోదు చేసిన పోలీసులు రీసెంట్ గా ఆ దంపతులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. 2020లో ఆ మైనర్ బాలిక తండ్రి మరణించడంతో ఆ బాలికకు బంధువు అయిన దామోదర్ బాలిక బాగోగులు చూస్తానని చెప్పి.. ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి పలు మార్లు ఆమె మీద అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక ఓ సారి గర్భం కూడా దాల్చింది. అప్పుడు దామోదర్ భార్య సీమా రాణి ఆ మైనర్ బాలికకు అబార్షన్ పిల్స్ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఆసుపత్రి వద్ద రగడ… 

ఈ విషయం బయటకు రావడంతో అధికారులు ఆ దంపతుల మీద కేస్ నమోదు చేసి… ఆ బాలికను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి ఆవరణలో పోలీస్ బందోబస్త్ కూడా ఏర్పాటు చేశారు. ఆ మైనర్ బాలికను చూసేందుకు DCW చీఫ్ స్వాతి మలివాల్ వచ్చారు. కానీ అక్కడి పోలీసులు ఆమె బాలికను కలుసుకునేందుకు అనుమతించలేదు. ఢిల్లీ పోలీసులు అతడిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని DCW పోలీసులను ఆదేశించింది. తర్వాత స్వాతి మలివాల్ ఆ బాలికను కలిసేందుకు వెళ్లగా పోలీసులు లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో DCW చీఫ్ స్వాతి నిరసనకు దిగారు. బాలికను కలిసేందుకు తనను అనుమతించాలని ఆమె డిమాండ్ చేశారు. 

వారిని అనుమతించారుగా… 

DCW చీఫ్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ… బాలికకు అందే వైద్యం గురించి బాలిక పరిస్థితి గురించి తాను తప్పక తెలుసుకోవాలని వాగ్వాదానికి దిగారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) చైర్ పర్సన్ ను అనుమతించినపుడు DCW కి చీఫ్ అయిన తనను ఎందుకు అనుమతించరని ఆమె పోలీసులను ప్రశ్నించింది. బాలిక తల్లిని కలిసి ఆమె మాట్లాడినపుడు నేను మాట్లాడితే వచ్చే నష్టం ఏంటన్నారు. 

సీరియస్ అయిన సీఎం

ఈ ఘటన మీద ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు. ఆ అధికారిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నరేష్ కుమార్ అధికారి సస్పెన్షన్ కు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సదరు డిపార్ట్ మెంట్ ఆ అధికారిని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ అమల్లో ఉన్నపుడు ఆ అధికారి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా డిపార్ట్ మెంట్ హెడ్ క్వార్డర్స్ ను దాటి వెళ్లేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేశారు.