ఘ‌ట్‌కేస‌ర్‌లో దారుణం

ఈమధ్య కాలం లో వార్తలు చూడాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడ చూసిన కుట్రలు కుతంత్రాలు,హత్యలు,మానభంగాలు ఇవే కనిపిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా తయారు అవుతున్నప్పటికీ క్రైమ్ రేట్ ఏమాత్రం కూడా తగ్గడం లేదు. ఇకపోతే రీసెంట్ గా తెలంగాణ ప్రాంతం లోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఒక సంఘటన యావత్తు తెలుగు ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈశ్వరమ్మ అనే మహిళ వేరే వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని, తన భర్త […]

Share:

ఈమధ్య కాలం లో వార్తలు చూడాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడ చూసిన కుట్రలు కుతంత్రాలు,హత్యలు,మానభంగాలు ఇవే కనిపిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా తయారు అవుతున్నప్పటికీ క్రైమ్ రేట్ ఏమాత్రం కూడా తగ్గడం లేదు. ఇకపోతే రీసెంట్ గా తెలంగాణ ప్రాంతం లోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఒక సంఘటన యావత్తు తెలుగు ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈశ్వరమ్మ అనే మహిళ వేరే వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని, తన భర్త తుకప్ప ని హత్య చేసింది. ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడికి కూడా ఈ హత్య లో భాగం ఉంది. ఈశ్వరమ్మ తన భర్త తుక్కప్ప తో కలిసి చాలా కాలం నుండి సంగారెడ్డి లో జీవనం కొనసాగిస్తుంది. అయితే ఇంతలోనే ఆమె శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక శ్రీనివాస్ తో కలిసి తన భర్త తుక్కప్ప అడ్డుని తొలగించుకోవాలని ఈశ్వరమ్మ పెద్ద స్కెచ్ వేసింది.

మాయమాటలు చెప్పి భర్త ని ఏమార్చిన ఈశ్వరమ్మా:

గత కొంతకాలం నుండి అనారోగ్యం తో బాధపడుతున్న తుకప్ప ని మెరుగైన వైద్యం అనే సాకుతో కౌకూరు దర్గా వద్దకు తీసుకొచ్చింది ఈశ్వరమ్మా. ఇక ఆ తర్వాత ఘట్కేసర్ లో డాక్టర్ దగ్గరకి వెళదామని తుకప్ప కి మాయమాటలు చెప్పి యంనం పేట చౌరస్తా వద్దకు తీసుకొచ్చింది ఈశ్వరమ్మా.తీరా అక్కడికి చికిత్స కోసం తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ అందుబాటులో లేడని అబద్దాలు చెప్పింది. ఇక తర్వాత రూమ్ లో విశ్రాంతి తీసుకుంటున్న తుకప్ప కోసం మద్యం దుకాణం మద్యం కొనుగోలు చేసింది. తుకప్ప కి ప్రతీ రోజు మందు తాగే అలవాటు బాగా ఉంది. అయితే ఘట్కేసర్ బస్టాండ్ సమీపం లో ఉన్న ఫర్టిలైజర్ దుకాణం లో ప్రియుడు శ్రీనివాస్ పురుగుల మందు కొని తీసుకొచ్చాడు. అప్పుడు ఈశ్వరమ్మా ఆ పురుగుల మందుని బ్రాందీ లో కలిపి భర్త తుకప్ప కి త్రాగించింది. ఆ తర్వాత అస్వస్థతతో బాధపడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తుకప్ప ని ఏమి తెలియనట్టుగా చుట్టుపక్కన ఉన్నవారి సహాయం తో గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లింది.

పోలీసుల విచారణ లో బయటపడ్డ అసలైన ట్విస్ట్ :

అప్పటికే తుకప్ప మరిణించాడు. డాక్టర్లు అనుమానం తో పోస్ట్ మార్టం చెయ్యగా అసలు విషయం మొత్తం బయటపడింది. పోస్ట్ మార్టం రిపోర్టు లో పురుగుల మంది బ్రాందీ లో కలిపి ఇచ్చారు అని తేలడం తో పోలీసులు ఈశ్వరమ్మా, శ్రీనివాస్ ని అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టారు . అనుమానిత మరణం గా పోలీసులు దీనిని పరిగణించి సెక్షన్ 174 ఆఫ్ CRPC క్రింద కేసుని నమోదు చేసారు. పోలీసుల విచారణ లో తేలింది ఏమిటంటే ఈశ్వరమ్మ తుకప్ప కి రెండవ భార్య అట. గత నెల 18 వ తారీఖునే శ్రీనివాస్ – ఈశ్వరమ్మ కి తుకప్ప ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చారని, ఆ తర్వాత ప్లాన్ పరంగానే ఈ హత్య కి పాల్పడ్డారని పోలీసులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మరోపక్క ఈశ్వరమ్మ చేసిన ఈ నీచమైన పనికి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇలాంటి ఆడవాళ్ళని కఠినంగా శిక్షించాలి, మళ్ళీ ఇలాంటి తప్పులు చెయ్యాలంటే వణుకుపుట్టే లాగ చెయ్యాలి అంటూ సోషల్ మీడియా ద్వారా తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు.