రక్షాబంధన్ నాడు రక్త సంబంధాన్ని గుర్తు చేసిన మహిళ

రాఖీ పండుగ నాడు అక్క, చెల్లి తమ అన్నదమ్ములకు పవిత్రమైన రాఖీ కట్టి తమ అనుబంధాన్ని చాటిచెబుతూ ఉంటారు. రక్షాబంధన్ అంటేనే, తమ అక్క చెల్లెళ్లకు రక్షగా తమ అన్నదమ్ములు ఎన్నటికీ బాధ్యతతో ఉంటారని హామీ ఇస్తున్నట్టు. ఇటీవల ఒక అక్క తన తమ్ముడి కోసం ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చేందుకు సిద్ధపడి తనదైన శైలిలో మరొకసారి రక్షాబంధన్ నాడు అక్క చెల్లెలు, అన్నదమ్ముల మధ్య ఉన్న బంధాన్ని మరొకసారి గుర్తు చేసింది.  అక్క ఇచ్చిన బహుమతి:  […]

Share:

రాఖీ పండుగ నాడు అక్క, చెల్లి తమ అన్నదమ్ములకు పవిత్రమైన రాఖీ కట్టి తమ అనుబంధాన్ని చాటిచెబుతూ ఉంటారు. రక్షాబంధన్ అంటేనే, తమ అక్క చెల్లెళ్లకు రక్షగా తమ అన్నదమ్ములు ఎన్నటికీ బాధ్యతతో ఉంటారని హామీ ఇస్తున్నట్టు. ఇటీవల ఒక అక్క తన తమ్ముడి కోసం ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చేందుకు సిద్ధపడి తనదైన శైలిలో మరొకసారి రక్షాబంధన్ నాడు అక్క చెల్లెలు, అన్నదమ్ముల మధ్య ఉన్న బంధాన్ని మరొకసారి గుర్తు చేసింది. 

అక్క ఇచ్చిన బహుమతి: 

రాయపూర్ త్రిక్రపార ప్రాంతంలో నివసిస్తున్న షీలా బాయ్ పాల్ అనే మహిళకు, తన తమ్ముడు ఓం ప్రకాష్ అంటే అపారమైన ప్రేమ. అయితే గత సంవత్సరం ఓం ప్రకాష్ దంగర్కు కిడ్నీ వ్యాధి కారణంగా డయాలసిస్ చేయాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే ఒక కిడ్నీ 80 శాతం డామేజ్ అయినట్లు. మరొకటి 90% వరకు డ్యామేజ్ అయిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇక ఆయన బ్రతకాలంటే కేవలం కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ మాత్రమే మార్గం అంటూ హాస్పటల్ ఇచ్చిన సలహాను కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. అంతేకాకుండా గుజరాత్ లో ఉన్న ఒక హాస్పిటల్ లో చేర్పించారు. 

కానీ ఓం ప్రకాష్ కు సరిపోయే కిడ్నీ దొరకడం కష్టమని కిడ్నీ దాతలు ముందుకు వస్తే తప్పిస్తే ఓం ప్రకాష్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరపడం కుదరదని చెప్పారు డాక్టర్లు. ఇంకేముంది తమ్ముడు అంటే అపారమైన ప్రేమ ఉన్న షీలా బాయ్ తన కిడ్నీ ఇచ్చేందుకు స్వతహాగా ముందుకొచ్చింది. కుటుంబ సభ్యులు కూడా తమ్ముడు మీద ఉన్న అక్క ప్రేమను చూసి చలించిపోయారు. డాక్టర్లు షీలాబాయికి పరీక్షలన్నీ చేశారు, మొత్తం పరీక్షలు చేయగా, ఆమె కిడ్నీ తన తమ్ముడికి సరిపోతుంది అనే సంతోషకరమైన వార్త చెప్పారు. 

అయితే సంవత్సరం నుంచి బాధపడుతున్న ఓం ప్రకాష్ ఎట్టకేలకు కిడ్నీ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం దొరికింది. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం డాక్టర్లు సెప్టెంబర్ 3న ఆపరేషన్ జరుగుతుందని చెప్పగా.. ఓం ప్రకాష్ అలాగే తన అక్క షీలా బాయ్ గుజరాత్ లో సర్జరీ కోసం వేచి ఉన్నారు. ఈ రక్షాబంధన్ నాడు, తన తమ్ముడికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చి తన ప్రేమను చాటి చెప్పింది షీలాబాయి. అంతేకాకుండా తన తమ్ముడంటే తనకి ఎంతగానో ఇష్టమని తను సంతోషంగా నూరేళ్లు జీవించాలని తను కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడిందని చెప్పకువచ్చింది. రక్షాబంధన్ నాడు ప్రత్యేకించి షీలా బాయ్ అలాగే తన తమ్ముడు ఓం ప్రకాష్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచారు. అంతేకాకుండా తన తమ్ముడికి రక్షాబంధన్ కట్టి తను నూరేళ్లు సంతోషంగా ఉండాలని దీవించింది అక్క. 

మోదికి పాకిస్తానీ చెల్లి: 

పాకిస్తాన్ కి చెందిన ఖమర్ మొహ్సిన్ షేక్, పెళ్లి తర్వాత అహ్మదాబాద్ లో సెటిల్ అయ్యారు. ఆమె 30 సంవత్సరాలుగా తనకి ఎంతగానో ఆప్తుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒక అన్నయ్యగా భావించి ఆమె ప్రతిఏటా రాఖి కట్టడం ఆనవాయితీగా చేసుకుంది. అంతేకాకుండా ఆమె మోదీ తెలిసినప్పటి నుంచి, మోదీని ఒక ప్రధానమంత్రిగా చూడాలని ఎంతగానో ఆశ పడినట్లు కూడా చెప్పింది. గత రెండు సంవత్సరాలుగా నరేంద్ర మోదీని కలవలేకపోయాను అని, మహమ్మారి కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా తన అన్నని కలుసుకోలేకపోయానని, ఈ సంవత్సరం తప్పకుండా ఢిల్లీకి వచ్చే తన అన్న చేతికి రాఖీ కట్టి తన అనుబంధాన్ని చాటిచెప్పింది. తన అన్న మంచితనం వల్లే, ప్రధానమంత్రి మోదీ అంచులంచెలుగా ఎదుగుతున్నాడని ప్రస్తావించింది.