కోడి ర‌క్తంతో ప్లానేసి.. 3 కోట్లు దోచేసింది

అయితే చాలామంది ఈ ప్రస్తుతం సులభంగా డబ్బు సంపాదించడానికి అడ్డదారులు వెతుకుతూ ఉన్నారు. అదే కోవకు చెందింది మౌనిక కూడా. ఒక బిజినెస్ మాన్ని ట్రాప్ చేసి సుమారు 10 కోట్లు. 2019 నుంచి జరుగుతున్న ట్రాప్ మిస్టరీకి ఎట్టకేలకు ముగింపు దొరికింది.  అసలు విషయం ఏమిటి?:  2016లో ఒక బిజినెస్ మాన్ అనిల్ అనే వ్యక్తిని కలవడం జరుగుతుంది. గోవాలో కలుసుకున్న వారి ఇద్దరూ వారి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. అయితే అప్పటినుంచి […]

Share:

అయితే చాలామంది ఈ ప్రస్తుతం సులభంగా డబ్బు సంపాదించడానికి అడ్డదారులు వెతుకుతూ ఉన్నారు. అదే కోవకు చెందింది మౌనిక కూడా. ఒక బిజినెస్ మాన్ని ట్రాప్ చేసి సుమారు 10 కోట్లు. 2019 నుంచి జరుగుతున్న ట్రాప్ మిస్టరీకి ఎట్టకేలకు ముగింపు దొరికింది. 

అసలు విషయం ఏమిటి?: 

2016లో ఒక బిజినెస్ మాన్ అనిల్ అనే వ్యక్తిని కలవడం జరుగుతుంది. గోవాలో కలుసుకున్న వారి ఇద్దరూ వారి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. అయితే అప్పటినుంచి ఈ బిజినెస్ మాన్ అలాగే అనిల్ టచ్ లో ఉన్నారు. 64 సంవత్సరాలు ఉన్న బిజినెస్ మాన్ అనిల్ ని పూర్తిగా నమ్మాడు. అంతేకాకుండా వాళ్లు పలుమార్లు కలవడం కూడా జరిగితే ఇరువైపుల నుంచి ఫ్రెండ్షిప్ ఇంకా బలపడింది. 

ఇదే అదునుగా తీసుకున్న అనిల్, బిజినెస్ మాన్ ని ఎలాగైనా ట్రాక్ చేసి డబ్బు కొట్టేయాలనుకున్నాడు. పథకంలో భాగంగా 2019లో ఆ బిజినెస్ మాన్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటున్నాడు అని తెలుసుకొని, అనిల్ అక్కడికి రావడం జరిగింది. అయితే పథకంలో భాగంగా తన స్నేహితులైన, మౌనిక మరియు స్వప్నలను కూడా బిజినెస్ మాన్ తో డిన్నర్ చేయడానికి పిలవచ్చా అని అడుగుతాడు. 

స్వప్న మరియు మౌనికలు విషయం చెప్పిన తర్వాత బిజినెస్ మాన్ మామూలుగా సరే అంటాడు. అయితే వారు కూడా తమతో పాటు ఫైవ్ స్టార్ హోటల్ కి వచ్చి డిన్నర్ చేసిన అనంతరం అందరూ కలిసి బిజినెస్ మాన్ రూమ్ కి వెళ్లడం జరుగుతుంది. అయితే హోటల్ కింద ఫ్లోర్లో ఏదో మర్చిపోయాం అని చెప్పి, అనిల్ మరియు స్వప్న కిందకి వెళ్తారు, అదే సమయంలో మౌనిక వాష్ రూమ్ లోకి వెళుతుంది. రూమ్ లో బిజినెస్ మాన్ కూడా ఉంటాడు. అయితే స్వప్న రూమ్ కి వచ్చి తలుపు కొడుతుంది, కరెక్ట్ గా అదే సమయానికి మౌనిక బాత్రూంలో నుంచి బట్టలు లేకుండా, ఒక దుప్పటి కప్పుకుని, రక్తం మరకలతో అరుస్తూ తలుపుతీస్తుంది. మరోపక్క స్వప్న ఏం జరిగింది అని అమాయకంగా అడుగుతూ జరిగిందంతా ఫోన్లో వీడియో కూడా తీస్తుంది. 

మరో పక్క బిజినెస్ మాన్ ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక అయోమయంలో పడతారు. సరిగ్గా అదే సమయానికి అనిల్ వచ్చి రాగానే బిజినెస్ మాన్ తన స్నేహితుడికి జరిగిందంతా చెప్తాడు. కానీ అనిల్ కూడా ఈ పథకంలో భాగం కాబట్టి, అనిల్ స్వప్న మరియు మౌనిక ముగ్గురు కలిసి బిజినెస్ మాన్ ని బ్లాక్ మెయిల్ చేస్తారు. 10 కోట్లు తమకి కావాలి అని, లేదంటే ఫోన్లో ఉన్న వీడియో వైరల్ అవుతుందని బెదిరిస్తారు. 

ఇదంతా విన్న బిజినెస్ మాన్, అనిల్ పన్నాగం తెలుసుకుంటాడు. వీడియో బయటికి వెళ్తే పరువు పోతుంది అని భావించిన బిజినెస్ మాన్ 50 లక్షలు ఇస్తానని ఒప్పుకుంటాడు. 50 లక్షలు తీసుకున్న తర్వాత కూడా మౌనిక స్వప్నలు చాలా సార్లు బిజినెస్ మాన్ ని బెదిరించి 2019 నుంచి ఇటీవల మే, జూన్ సమయాల మధ్యలో కూడా బెదిరించి సుమారు కొన్ని కోట్లు బంగారం కూడా తీసుకున్నట్లు సమాచారం. 

అయితే ఈ బెదిరింపులు ఇంకా తట్టుకోలేని బిజినెస్ మాన్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే గురించి ఆరా తీసిన పోలీసులకు విషయాలు బయటపడ్డాయి. మౌనిక, స్వప్న, అనిల్ అనే ముగ్గురు పథకం ప్రకారమే బిజినెస్ మాన్ ని ట్రాప్ చేసి, కోడి రక్తం ఉపయోగించి సీన్ క్రియేట్ చేశారని స్పష్టంగా తెలుసుకున్నారు. 

అయితే ముందుగా స్వప్నా మరియు అనిల్ దొరికినప్పటికీ మౌనిక తప్పించుకోగలిగింది, ఇటీవల జూన్ 2023న పోలీసులు ప్లాన్ వేసి మౌనికని ఎలాగైతే పట్టుకున్నారు.