బ‌స్సు ఆప‌నందుకు రాయి విసిరిన మ‌హిళ‌

కర్ణాటకలో చెందిన ఒక ఆవిడ బస్ స్టాప్ లో బస్సు ఆపలేదని ఆగ్రహంతో బస్సు మీదకి రాయి విసిరింది. గంటలు గంటలు ఎదురు చూసిన తన ఉన్న బస్సు స్టాప్ లో బస్సు ఆపకపోవడం వల్ల ఆగ్రహానికి గురై బస్సు మీదకి రాయి విసిరింది. తర్వాత పోలీసులు ఆమె నుంచి 5000 రూపాయలు ఫైన్ కట్టించుకున్నారు.  వివరాల్లోకి వెళ్తే లక్ష్మి అనే కర్ణాటకకి చెందిన మహిళ, కొప్పల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న హులిగి ప్రాంతంలో హులిగమ్మ అనే […]

Share:

కర్ణాటకలో చెందిన ఒక ఆవిడ బస్ స్టాప్ లో బస్సు ఆపలేదని ఆగ్రహంతో బస్సు మీదకి రాయి విసిరింది. గంటలు గంటలు ఎదురు చూసిన తన ఉన్న బస్సు స్టాప్ లో బస్సు ఆపకపోవడం వల్ల ఆగ్రహానికి గురై బస్సు మీదకి రాయి విసిరింది. తర్వాత పోలీసులు ఆమె నుంచి 5000 రూపాయలు ఫైన్ కట్టించుకున్నారు. 

వివరాల్లోకి వెళ్తే లక్ష్మి అనే కర్ణాటకకి చెందిన మహిళ, కొప్పల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న హులిగి ప్రాంతంలో హులిగమ్మ అనే పేరు గల దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళింది. అయితే తను బస్ స్టాప్ దగ్గర గంటలసేపు వెయిట్ చేసినప్పటికీ, బస్సు ఆపలేదు అని లక్ష్మీ పేర్కొంది. బస్టాప్ దగ్గర వచ్చిన బస్సు కొప్పల్- హోసపేట నాన్ స్టాప్ బస్సు ఆపలేనందున, బస్సు మీదకు ఆగ్రహంతో రాయి విసిరింది. రాయి విసిరిన కారణంగా బస్సు కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనంతరం బస్సు ఆగిన తర్వాత లక్ష్మీ ఎక్కగానే, ఆ బస్సు డ్రైవర్ మునిర్బద్ పోలీస్ స్టేషన్కు బస్సును తీసుకువెళ్లాడు. అయితే పోలీసులు ఆమెకు 5000 రూపాయలు ఫైన్ విధించారు. లక్ష్మీ బస్సు మీదకి రాయ విసిరినందుకు క్షమాపణలు చెప్పి 5000 రూపాయలు ఫైన్ కట్టింది. మళ్లీ అదే బస్సులో తన గ్రామానికి తిరిగి వెళ్ళింది. 

బస్ డ్రైవర్ మాటల్లో:

లక్ష్మి మరియు ఆమె సహచరులు రాంగ్ సైడ్‌లో నిలబడ్డారని బస్సు డ్రైవర్-కమ్-కండక్టర్ ముత్తప్ప పేర్కొన్నాడు. వారు నిలబడి ఉన్న ప్రదేశానికి ఎదురుగా వారు నుంచో వలసిన బస్ స్టాప్ఉందని డ్రైవర్-కమ్-కండక్టర్ చూపించాడు.

“వాళ్ళు ఇల్కల్ వెళ్ళాలి, మేము హోసపేట వైపు వెళుతుండగా, వారు రోడ్డుకు రాంగ్ సైడ్ లో నిలబడి ఉన్నారు, కానీ ఎదురుగా ఉన్న బస్టాప్ దగ్గర వాళ్లు అసలు నిలబడి ఉండాలి, మా బస్సు నాన్ స్టాప్ సర్వీస్ కాబట్టి, మేము దారిలో ఎక్కడా డే ఆపకూడదని రూల్ ఉంది. అదే విధంగా, మేము అక్కడ బస్సు ఆపకుండా వెళ్లిపోయాం కానీ, ఈ సమయంలోనే ఆమె బస్సుపై రాయి విసిరింది” అని ముత్తప్ప చెప్పాడు. 

అయితే ఏదేమైనాప్పటికీ, గంటలు గంటలు బస్ స్టాప్ లో నిలబడి బస్సు కోసం ఎదురు చూసి బస్సు ఆపకపోవడంతో ఆగ్రహానికి గురై ఆ బస్సు మీద కంప్లైంట్ ఇవ్వడం మానేసి బస్సు మీదకి రాయి విసరడం అనేది తప్పు. ఎందుకంటే ఒకవేళ ఆ రాయి ప్రయాణికులకు తగిలి ఉంటే, అది మరో నేరంగా భావించి ఆమె జైలు పాలు అయ్యేది. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న, కాస్త ఓపికగా ఉండే ఆలోచించాలి. లేదంటే ఇదేవిధంగా మనం మన డబ్బు నీ ఫైన్ రూపంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా, ప్రయాణికుల కోసం సర్వీస్ చేస్తున్న బస్సులు, అవి నాన్ స్టాప్ అయినా అవ్వచ్చు, బస్సులు ఎక్కువగా తిరగ లేని ప్రదేశంలో, నాన్ స్టాప్ బస్ అయినప్పటికీ ఆపితే అది వారి మంచితనాన్ని బయటపడుతుంది. 

ఓపిక వహించడం వల్ల చాలా ఇబ్బందుల నుంచి బయటపడే వాళ్ళం అవుతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ గ్రామానికి ఎక్కువ బస్సు లేకపోవడం కూడా గమనార్హం. చాలా ఊర్లకు బస్సులు కూడా ఎప్పుడో గాని వెళ్ళలేని పరిస్థితి 2023లో కూడా ఉన్నందుకు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు ప్రజలు. ఈ సంఘటనతో అయినా సరే, ఆ యువతీ గ్రామానికి బస్సు అనేది వేస్తారని పబ్లిక్ ఊహిస్తుంది.