డేటింగ్ యాప్ ద్వారా అత్యాచారికి గురైన యువతి 

ఈమధ్య కాలంలో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా సామూహిక అత్యాచారాలు దేశంలో అంతకంతకు హద్దు మీరుతున్నాయి. ఇలాంటి సంఘటనే జూన్ 29న చోటు చేసుకుంది. గురుగ్రామ్ లోని డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తిని కలవడానికి, హోటల్ కి వెళ్ళగా, ఆమె సామూహిక అత్యాచారానికి గురైంది. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  జరిగిన సంఘటన:  గురుగ్రామ్కి చెందిన ఒక యువతి, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి, జూన్ 29న హోటల్ […]

Share:

ఈమధ్య కాలంలో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా సామూహిక అత్యాచారాలు దేశంలో అంతకంతకు హద్దు మీరుతున్నాయి. ఇలాంటి సంఘటనే జూన్ 29న చోటు చేసుకుంది. గురుగ్రామ్ లోని డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తిని కలవడానికి, హోటల్ కి వెళ్ళగా, ఆమె సామూహిక అత్యాచారానికి గురైంది. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

జరిగిన సంఘటన: 

గురుగ్రామ్కి చెందిన ఒక యువతి, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి, జూన్ 29న హోటల్ కి ఇన్వైట్ చేయగా, కలవడానికి ఒక హోటల్ కి వెళ్ళింది. అయితే ఇదే సమయంలో ఆ యువకులతో పాటు మరో వ్యక్తి కూడా ఉండడం యువతి గమనించింది. అయితే స్నేహితుడు అని చెప్పడంతో, సరే అంటూ వారు ఆఫర్ చేసిన ఫుడ్ అలాగే డ్రింక్స్ తాగడం జరిగింది. అయితే ముందుగానే ప్లాన్ ప్రకారం, ఆ యువకుడు ఆ అమ్మాయికి ఇచ్చే ఆహార పదార్థాలలో మత్తుమందు కలపడం జరిగింది. అయితే ఆహారం తీసుకున్న వెంటనే ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. అయితే ఇదే సందర్భాన్ని అదునుగా తీసుకున్న ఆ యువకుడు అలాగే తన స్నేహితుడు ఆ అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు. 

తర్వాత కొద్దిసేపటికి అమ్మాయి స్పృహలోకి వచ్చాక తనమీద అత్యాచారం జరిగిందని తెలుసుకుంది. అంతేకాకుండా వారు చేసిన అత్యాచారాన్ని వీడియో తీసి ఆ అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. ఎవరికైనా ఈ విషయం గనుక చెప్తే, తన వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని ఆ ఇద్దరు యువకులు బెదిరించారు. అయితే అప్పటినుంచి భయంతో ఎవరికీ చెప్పని ఆ యువతీ ధైర్యం చేసి, ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. 

జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు,సెక్టర్ 50 పోలీస్ స్టేషన్ లో ఆ ఇద్దరు యువకుల మీద సామూహిక అత్యాచార సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి, ప్రస్తుతం ఆ ఇద్దరు యువకులు గురించి విచారణ జరిపిస్తున్నారు పోలీసులు.

ఎక్కువ అవుతున్న అత్యాచారాలు: 

ఇటీవల రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదివారం నాడు మైనర్ దళిత బాలికపై ముగ్గురు విద్యార్థులు ఆమె బాయ్ ఫ్రెండ్ ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం చేయడానికి ముందు ఆమె బాయ్ ఫ్రెండ్పై దాడి చేసిన ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. 

ఇలాంటి సంఘటనే మరొకటి. ఒక స్కూల్లో పని చేస్తున్న ఒక 58వ వ్యక్తి, ఆ నిరుపేద కుటుంబానికి దగ్గర బంధువు కావడంతో, స్కూల్ చదువుతున్న ఒక అమ్మాయిని పలుసార్లు తనతో పాటు ఇంటికి తీసుకు వెళ్లడం జరిగింది. అయితే చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపించి ఆ చిన్న అమ్మాయిని వంచించాడు ఆ వ్యక్తి. 

ఆ అమ్మాయిని చాలాసార్లు ఆ పెద్దాయన తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇలా కొనసాగుతూ ఉండగా, ఒకనాడు అమ్మాయి హఠాత్తుగా స్కూల్ కి వెళ్ళను అని చెప్పడంతో తల్లితండ్రులు ఎందుకు అని ఆరా తీశారు, అప్పుడే అసలు నిజం ఆ అమ్మాయి చెప్పింది. స్కూల్లో పనిచేస్తున్న తన బంధువు తనని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు చాలా సార్లు వంచించినట్లు, తల్లిదండ్రులకు చెప్పింది. 

తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని పోలీసులు ముందు చెప్పగ. వారు ఆ 58 ఏళ్ల వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతానికి కోర్టులో కేసు నడుస్తుండటంతో ఎట్టకేలకు, కేసు రీ ఓపెన్ చేసి 58 ఏళ్ల వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. అంతేకాకుండా 5,000 రూపాయల ఫైన్ విధించారు.