కోడలిపై అత్యాచారం..గెంటేసిన భ‌ర్త‌

యూపీలోని ముజఫర్‌‌నగర్‌‌లో దారుణం జరిగింది. కోడలిపై మామ అత్యాచారానికి ఒడిగట్టాడు. అండగా నిలవాల్సిన భర్త ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు మనుషులు మృగాల్లా మారుతున్నారు. మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు.. ఊరికో కీచకుడు.. వాడకో దుశ్శాసనుడు. వావి వరుసలు మరిచి.. చెల్లిని చెరబట్టేదొకడు.. బిడ్డ వరుసయ్యే అమ్మాయిపై బలత్కారం చేసేదొకడు. కామంతో కళ్లు మూసుకుపోయి జంతువుల్లా దారునాలకు పాల్పడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కోడలిపై అత్యాచారినికి యత్నించాడో దుర్మార్గుడు. తప్పు చేసిన తండ్రిని వెనకేసుకొచ్చి.. భార్యను […]

Share:

యూపీలోని ముజఫర్‌‌నగర్‌‌లో దారుణం జరిగింది. కోడలిపై మామ అత్యాచారానికి ఒడిగట్టాడు. అండగా నిలవాల్సిన భర్త ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు

మనుషులు మృగాల్లా మారుతున్నారు. మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు.. ఊరికో కీచకుడు.. వాడకో దుశ్శాసనుడు. వావి వరుసలు మరిచి.. చెల్లిని చెరబట్టేదొకడు.. బిడ్డ వరుసయ్యే అమ్మాయిపై బలత్కారం చేసేదొకడు. కామంతో కళ్లు మూసుకుపోయి జంతువుల్లా దారునాలకు పాల్పడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కోడలిపై అత్యాచారినికి యత్నించాడో దుర్మార్గుడు. తప్పు చేసిన తండ్రిని వెనకేసుకొచ్చి.. భార్యను గెంటేశాడు ఆ దుర్మార్గుడి కొడుకు.

యూపీలోని ముజఫర్‌‌నగర్‌‌ జిల్లాలో ఓ 26 ఏళ్ల మహిళపై తన మామ అత్యాచారం చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని భర్తకు చెప్పింది.. కానీ తనకు రక్షణగా నిలవాల్సిన భర్త.. మూర్ఖంగా ప్రవర్తించాడు. తన తండ్రితో సంబంధం ఉన్నందువల్ల.. ఇక తన భార్య ఉండనివ్వనని చెప్పాడు. ఇకపై ఆమె భార్య కాదు.. తల్లి అంటూ పిచ్చి మాటలు మాట్లాడాడు. ఇంటి నుంచి గెంటేశాడు. ‘‘మా నాన్న ఇప్పుడు నీతో బలవంతంగా సంబంధం పెట్టుకున్నాడు. ఇకపై నువ్వు నాతో ఉండేందుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు మా నాన్నకు భార్యవు అయ్యావు. అంటే నాకు తల్లివి” అని చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన మామ, భర్తపై సెప్టెంబర్ 7న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఏడాది కిందటే పెళ్లి

ఏడాది కిందట తనకు పెళ్లి జరిగిందని బాధితురాలు చెప్పింది. ‘‘ఆగస్టు 5వ తేదీన నా భర్త తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనారోగ్యంతో ఉన్న ఆమె చికిత్స కోసం ఓ సంప్రదాయ వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో మా మామ నాపై అత్యాచారం చేశాడు. తర్వాత నన్ను చాలా కొట్టాడు. బెదిరింపులకు దిగాడు” అని ఫిర్యాదులో చెప్పింది. ‘‘నా భర్త ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం చెప్పాను. కానీ అతడు నాతో కలిసి జీవించేందుకు నిరాకరించాడు. ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు” అని వాపోయింది. ఇప్పుడు తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తాను 7 నెలల గర్భవతిని అని సమాచారం. అయితే తన ఫిర్యాదులో మాత్రం ఈ విషయాన్ని వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త, మామపై  సెక్షన్ 376 (లైంగిక దాడి), సెక్షన్ 323, సెక్షన్ 506  కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులు ఇద్దరిపై లీగల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించినట్లు స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవీందర్ యాదవ్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అధికారిక విచారణ చేపట్టినట్లు చెప్పారు. సీఆర్‌‌పీసీ సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ర్టేట్ ఎదుట అధికారికంగా డాక్యుమెంట్ చేసినట్లు చెప్పారు. 

బుకాయిస్తున్న కీచక మామ

బాధితురాలిపై దారుణానికి పాల్పడిన కీచకుడు.. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నాడు. పైగా సదరు మహిళే తనపై అనవసర ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు. డబ్బుల కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని చెప్పాడు. కాగా 2005 జూన్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 28 ఏళ్ల వివాహితపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. పంచాయతీ చేసిన ఊరి పెద్దలు.. తన భర్తతో కలిసి ఉండకుండా ఆమెపై ఆంక్షలు విధించారు. ఇకపై అతడు కొడుకు వరుస అవుతాడంటూ చెప్పారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. తప్పు చేసిన వాళ్లను శిక్షించాల్సింది పోయి.. ఊరి పెద్దలే కొమ్ముకాయడం గమనార్హం. మ‌రో ఘ‌ట‌న‌లో భ‌ర్త చ‌నిపోయిన.. కోడ‌ల‌ని కూడా చూడ‌కుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఓ వ్య‌క్తి. వ‌య‌సులో ఎంతో వ్య‌త్యాసం ఉన్న‌ప్ప‌టికీ ఆమెకు తోడుగా నిల‌వ‌డం కోస‌మే చేసుకున్నాన‌ని స‌మ‌ర్ధించుకున్నాడు.