Revenge Murder: అత్తగారింట్లో వాళ్ళని విషం పెట్టి చంపిన కోడలు

చక్కని జీవితం, ప్రేమ, పెద్దలను ఎదిరించి పెళ్లి (Marriage). అత్తగారింట్లో కొంతకాలం సవ్యంగా నడిచినప్పటికీ అనుకోని సంఘటన కోడలిని హంతకురాలిగా మార్చేసింది. అసలు ఏం జరిగింది? ఆ కోడలు తీసుకున్న నిర్ణయం ఏమిటి? (Revenge Murder) పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..:  మహారాష్ట్రలోని అకోలాకు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడిని పెళ్లి (Marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజే కష్టకాలం మొదలైంది. మొదటిది, ఆమె తల్లిదండ్రులు ఆమె సంబంధాన్ని ఒప్పుకోలేనప్పటికీ, ఆమె పారిపోయి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి […]

Share:

చక్కని జీవితం, ప్రేమ, పెద్దలను ఎదిరించి పెళ్లి (Marriage). అత్తగారింట్లో కొంతకాలం సవ్యంగా నడిచినప్పటికీ అనుకోని సంఘటన కోడలిని హంతకురాలిగా మార్చేసింది. అసలు ఏం జరిగింది? ఆ కోడలు తీసుకున్న నిర్ణయం ఏమిటి? (Revenge Murder)

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..: 

మహారాష్ట్రలోని అకోలాకు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడిని పెళ్లి (Marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజే కష్టకాలం మొదలైంది. మొదటిది, ఆమె తల్లిదండ్రులు ఆమె సంబంధాన్ని ఒప్పుకోలేనప్పటికీ, ఆమె పారిపోయి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి (Marriage) చేసుకున్న తర్వాతే అసలు కథ మొదలైంది. మహిళను నేరస్తురాలుగా మార్చేసింది కాలం. 

సంఘమిత్ర (Sanghamitra) అనే మహిళ రోషన్ (Roshan) అనే వ్యక్తిని 2022 డిసెంబర్ లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కలిసి రోషన్ (Roshan) ఇంట్లోనే కాపురం ఉంటుంది. పెళ్లి (Marriage) తర్వాత రోషన్ (Roshan) తన తల్లిదండ్రులు శంకర్, విజయ అదే విధంగా తన ఆడపడుచు కోమల్ ప్రవర్తనలో చాలా మార్పులు చూసింది సంఘమిత్ర (Sanghamitra). సంఘమిత్ర (Sanghamitra)ను చీటికిమాటికి హింసించడం మొదలుపెట్టారు అత్తమామలు. అత్తమామల్ని వెనకేసుకొచ్చేవాడు వాడు భర్త రోషన్ (Roshan). 

నివేదిక ప్రకారం, సంఘమిత్ర (Sanghamitra) రక్షా బంధన్ పండుగ సందర్భంగా, తన కుటుంబంతో కలిసి జరుపుకోవడానికి ఇంటికి వెళ్లాలని కోరుకుంది, అయితే రోషన్ (Roshan), అతని తల్లిదండ్రులు ఆమెను అనుమతించలేదని ఆరోపించారు. ఆమె పట్టుబట్టడంతో, రోషన్ (Roshan) తనపై దాడికి పాల్పడ్డాడని ఆరోపించడంతో కుటుంబంలో గొడవ జరిగింది. ఆ క్షణంలో తను ఇంటి బయట కూర్చుని ఏడుస్తుండగా, సంఘమిత్ర (Sanghamitra) అత్తగారి వదిన అయిన రామ్టేకే అనే మహిళ తనని ఓదార్చే క్రమంలో, సంఘమిత్ర (Sanghamitra) తన అత్త, మామ కుటుంబాన్ని చంపి (Murder) ప్రతీకారం (Revenge) తీర్చుకోవాలి అనుకుంటున్నట్లు, బాధను భరించలేకపోతున్నట్లు వెల్లడిస్తుంది. 

పకడ్బందీ ప్లాన్: 

సంఘమిత్ర (Sanghamitra) తీసుకున్న నిర్ణయమే తనని హంతకురాలుగా మార్చిందని పోలీసు (Police)లు తెలియజేశారు. అప్పటికే భూమి తగాదాలలో, సంఘమిత్ర (Sanghamitra) అత్తయ్య విజయకి అలాగే తన వదిన రామ్టేకేకి ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇదే సంఘమిత్ర (Sanghamitra) అదేవిధంగా రామ్టేకే స్నేహానికి నాంది పలికి, ప్రతీకారం (Revenge) తీర్చుకునేలా చేసింది.. ఈ ఇద్దరు కలిసి రోషన్ (Roshan) కుటుంబాన్ని ఎలాగైనా చంపాలని ప్లాన్ (Plan) చేస్తారు. ప్లాన్ (Plan)లో భాగంగా, వారు మొదట ఆన్లైన్లో ఒక విషపూరితమైన పువ్వును కొనుగోలు చేసి ఆ పువ్వుని ఆహారం (Food)లో కలపాలని నిర్ణయించుకున్నారు. కానీ పట్టుబడిపోతామేమో అని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు సంఘమిత్ర (Sanghamitra),రామ్టేకే.

థాలియం (Poison) అనే పదార్థం నిజానికి స్లో- పాయిజన్ అని తరువాత తెలుసుకున్నారు. ఒకవేళ ఇది రోషన్ (Roshan) కుటుంబ సభ్యుల ఆహారం (Food)లో కలిపితే ఎవరికి అనుమానం రాదని నిర్ధారించుకున్నారు. వీరిద్దరూ సెప్టెంబరు మధ్యలో తెలంగాణ నుండి థాలియం (Poison)ను రప్పించుకుని, ఆహారం (Food)లో కలపడం ప్రారంభించారు. వారు థాలియం (Poison)ను ఎలా కొనుగోలు చేశారనేది ఇంకా పోలీసు (Police)లు నిర్ధారించలేదు.

శంకర్ (Shankar), విజయ (Vijaya), కోమల్‌ (Komal)లకు తినే నాన్‌వెజ్ ఫుడ్ (Food) ఐటమ్‌లో థాలియం (Poison) కలిపినట్లు, రోషన్ (Roshan) తినే పప్పులో కలిపినట్లు, సంఘమిత్ర (Sanghamitra) పోలీసు (Police)లకు ఇచ్చిన అంగీకారంలో తెలిపింది. సెప్టెంబరు 20న, శంకర్ మరియు విజయ పెదవులు నల్లబడటం, నాలుకతో సహా ఒంట్లో అవయవాలలో జలదరింపు, తీవ్రమైన నడుము నొప్పి, తల నొప్పిగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. 

వారిని అహేరిలోని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ నుండి వారిని చంద్రపూర్‌లోని ఆసుపత్రికి, తరువాత నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు అనారోగ్యాన్ని నిర్ధారించేలోపే, శంకర్ సెప్టెంబర్ 26న మరణించగా, మరుసటి రోజు విజయ మరణించింది. కోమల్, ఉరేడే మరియు రోషన్ (Roshan) ఆరోగ్యం కూడా క్షీణించింది. వారు కూడా ఆసుపత్రిలో చేరిన తర్వాత వరుసగా అక్టోబర్ 8, 14 మరియు 15 తేదీలలో మరణించారు. ఇలా సంఘమిత్ర (Sanghamitra) అదే విధంగా రామ్టేకే వారు వేసుకున్న సక్సెస్ అయినప్పటికీ, పూర్తి కుటుంబం అనారోగ్యం పాలై, కేవలం సంఘమిత్ర (Sanghamitra)కు ఏమి కాకపోవడంతో పోలీసు (Police)లకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు నిజం బయటపడింది.